రెండు దశాబ్దాలకుపైగా మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తున్న మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్. ఈ సింగింగ్ షో 16వ సీజన్ రాబోతోంది. ప్రతి ఏటా సరికొత్త సింగింగ్ టాలెంట్ ను అందిస్తున్న ఈ షో కొత్త సీజన్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. శ్రేయా ఘోషాల్ తోపాటు విశాల్ దద్లానీ, బాద్‌షా మరోసారి జడ్జీలుగా తిరిగి వస్తున్నారు.
ఇండియన్ ఐడల్ సీజన్ 16 స్ట్రీమింగ్ తేదీని సోనీ లివ్ ఓటీటీ, సోనీ టీవీ అనౌన్స్ చేశాయి. ఈ సరికొత్త సీజన్ అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ అవుతుంది. సీజన్ 16 జడ్జ్‌ల ప్యానెల్‌లో కంపోజర్-సింగర్ విశాల్ దద్లానీ, ప్లేబ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్, రాపర్ బాద్‌షా ఉంటారు.
నిజానికి ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో విశాల్ ప్రకటించినా.. ఈ సీజన్ కు మళ్లీ తిరిగి వచ్చాడు. ఆరు సీజన్లపాటు జడ్జిగా ఉన్న తాను ఇక నుంచి మ్యూజిక్ కాన్సర్ట్ లపై దృష్టిపెట్టాలని అనుకుంటున్నట్లు అతడు గతంలో చెప్పాడు. ఈ ముగ్గురు జడ్జీలు కలిసి ఇండియన్ ఐడల్ సీజన్ 16 ఆడిషన్స్ మొదలుపెట్టిన వీడియోను సోనీ లివ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక ఈ ఇండియన్ ఐడల్ కు కొన్నాళ్లుగా హోస్ట్ గా ఉన్న ఆదిత్య నారాయణ ప్రస్తుతం మరో షోలో బిజీగా ఉండటంతో అతని తండ్రి, ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొన్నాళ్లపాటు ఈ షో హోస్ట్ గా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత ఆదిత్య తిరిగి ఈ షోకి రానున్నట్లు తెలుస్తోంది.
గతేడాది ఇండియన్ ఐడల్ 15 జరిగిన విషయం తెలిసిందే. ఈ సీజన్ 15 విజేతగా నిలిచింది మానసి ఘోష్. ఆమెకు రూ.25 లక్షల ప్రైజ్‍మనీ అందుకుంది. ఓ కొత్త కారు కూడా ఆమెకు దక్కింది. తెలుగు సింగర్ అనిరుధ్ సుస్వరం కూడా ఫైనల్ చేరినా విజేతగా నిలవలేకపోయాడు. ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇండియన్ ఐడల్ సీజన్ 15 గతేడాది అక్టోబర్‌లో మొదలైంది. సుమారు ఐదు నెలలకు పైగా సాగింది. స్టార్ సింగర్ శ్రేయా ఘోషాల్, మ్యూజిక్ కంపోజల్ బాద్షా, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ జడ్జిలుగా వ్యవహరించారు. మికా సింగ్, శిల్పా శెట్టి, రవీనా టాండన్ సహా కొందరు కొన్ని ఎపిసోడ్లకు గెస్టులుగా హాజరయ్యారు.
సంబంధిత కథనం