Indian 2 OTT Streaming: ఇంత కంటే చెత్త మూవీ మరొకటి లేదు.. ఓటీటీలో ఇండియన్ 2.. దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్-indian 2 ott streaming fans trolling the movie saying worst movie of director shankar kamal haasan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Indian 2 Ott Streaming: ఇంత కంటే చెత్త మూవీ మరొకటి లేదు.. ఓటీటీలో ఇండియన్ 2.. దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

Indian 2 OTT Streaming: ఇంత కంటే చెత్త మూవీ మరొకటి లేదు.. ఓటీటీలో ఇండియన్ 2.. దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

Hari Prasad S HT Telugu
Aug 09, 2024 08:09 PM IST

Indian 2 OTT Streaming: ఇండియన్ 2 మూవీ ఓటీటీలోకి వచ్చీ రాగానే నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇంత చెత్త సినిమా మరొకటి లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇంత కంటే చెత్త మూవీ మరొకటి లేదు.. ఓటీటీలో ఇండియన్ 2.. దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
ఇంత కంటే చెత్త మూవీ మరొకటి లేదు.. ఓటీటీలో ఇండియన్ 2.. దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

Indian 2 OTT Streaming: భారీ ఆశలు, అంచనాల మధ్య నెల రోజుల కిందట రిలీజైన మూవీ ఇండియన్ 2. తెలుగులో భారతీయుడు 2గా వచ్చింది. శంకర్ డైరెక్షన్, కమల్ హాసన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఇప్పుడు నెల తిరగక ముందే ఓటీటీలోకి రాగా.. ఇక్కడా ఈ సినిమాకు దారుణమైన ట్రోలింగ్ తప్పడం లేదు.

ఇండియన్ 2పై ట్రోలింగ్

ఎప్పుడో 28 ఏళ్ల కిందట వచ్చిన ఇండియన్ మూవీకి సీక్వెల్ గా జులై 12న ఇండియన్ 2 రిలీజైన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ ఇండియన్ ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడొచ్చిన ఈ ఇండియన్ 2 అంతకంటే దారుణమైన ట్రోలింగ్ కు గురవుతోంది. బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలు మిగిల్చిన ఈ సినిమా.. శుక్రవారం (ఆగస్ట్ 9) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇక్కడా చీత్కారాలే ఎదురవుతున్నాయి.

ఈ సినిమాను ఓటీటీలో చూసిన ప్రేక్షకులు.. ఇంత చెత్త సినిమా మరొకటి లేదని, శంకర్ కెరీర్లోనే చెత్త మూవీ అని ఒకరు.. కోలీవుడ్ చరిత్రలోనే అత్యంత చెత్త సినిమా అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. కమల్ హాసన్ లాంటి నటుడి నుంచి ఇలాంటి మూవీ అసలు ఊహించలేదని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. అసలు శంకర్ కు ఏమైంది.. ఇంత దారుణమైన సినిమా ఎలా చేశాడంటూ మరొకరు అన్నారు.

ఓ లెజెండరీ డైరెక్టర్ మరీ ఇలా ఓ జోకర్ డైరెక్టర్ లా ఎలా మారిపోయాడంటూ ఓ నెటిజన్ చాలా తీవ్రంగా స్పందించారు. మరొకరు ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ డైలాగ్ చెప్పే సీన్ షేర్ చేస్తూ.. నీకేమైంది.. ఇదేం డైలాగ్ డెలివరీ అని నిలదీశారు. ఇన్నాళ్లూ థియేటర్లలో ఈ మూవీని చూడని వాళ్లు ఇప్పుడు ఓటీటీలోకి రాగానే చూసి సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కెరీర్లోనూ ఇదే చెత్త బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంటూ అతన్నీ ఆడుకుంటున్నారు.

భారీ బడ్జెట్.. భారీ నష్టాలు

ఇండియన్ 2 మూవీని ఎప్పుడో నాలుగేళ్ల కిందట అనుకున్నారు. ఈ సీక్వెల్ కోసం డైరెక్టర్ శంకర్.. రామ్ చరణ్ తో తీస్తున్న గేమ్ ఛేంజర్ మూవీని ఆలస్యం చేస్తూ వెళ్లాడు. ఏకంగా రూ.225 కోట్ల బడ్జెట్ తో తీశారు. తీరా బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కేవలం రూ.148 కోట్లే. భారీ నష్టాలు ఒకెత్తయితే.. ఈ ట్రోలింగ్ మరో ఎత్తు.

శంకర్, కమల్ హాసన్ లాంటి కాంబినేషన్ ఇంత చెత్త సినిమా ఎలా తీశారంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి 1996లో వచ్చిన ఇండియన్ మూవీ అన్ని రికార్డులను చెరిపేసింది. కమల్ నట విశ్వరూపం, శంకర్ మార్క్ కథ, డైరెక్షన్ ఆ సినిమాకు బలాలుగా నిలిచాయి. అలాంటి సినిమాక సీక్వెల్ గా వచ్చిన ఇండియన్ 2 మాత్రం ఇంత తీవ్రంగా నిరాశ పరచడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇది చాలదన్నట్లు ఇండియన్ 3ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇండియన్ 2 వైఫల్యం నేపథ్యంలో మూడో భాగానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు.