Indian 2 Intro: ఇండియన్ 2 ఇంట్రో వచ్చేస్తోంది.. నాలుగు భాషల్లో నలుగురు లెజెండ్స్ రిలీజ్ చేయనున్న వీడియో
Indian 2 Intro: మచ్ అవేటెడ్ మూవీ ఇండియన్ 2 ఇంట్రో వచ్చేస్తోంది. ఈ ఇంట్రో వీడియోను శుక్రవారం (నవంబర్ 3) నాలుగు భాషల్లో నలుగురు లెజెండ్స్ రిలీజ్ చేయనుండటం విశేషం.
Indian 2 Intro: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవేటెడ్ మూవీ ఇండియన్ 2 ఇంట్రోను శుక్రవారం (నవంబర్ 3) కమల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఈ ఈవెంట్ ఉంటుంది. అయితే ఈ ఈవెంట్ ను నాలుగు భాషల్లో నలుగురు స్టార్ హీరోలు, డైరెక్టర్ రిలీజ్ చేయనుండటం విశేషం.
ఇండియన్ 2 తెలుగు వెర్షన్ ఇంట్రో రిలీజ్ చేసే అవకాశం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి దక్కింది. ఇక తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఇంట్రో రిలీజ్ చేస్తాడు. హిందీలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కన్నడలో స్టార్ హీరో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్ లాల్ లతో ఇండియన్ 2 ఇంట్రో రిలీజ్ చేయించనున్నారు. ఈ గ్లింప్స్ పై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది.
ఇంట్రో ఒక్కో భాషలో ఎవరు రిలీజ్ చేయబోతున్నారో చెబుతూ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ఎక్స్ లో ట్వీట్లు చేసింది. ఈ ఇండియన్ 2 మ్యూజిక్ హక్కులను సోనీ మ్యూజిక్ సొంతం చేసుకున్నట్లు కూడా తెలిపింది.
ఎప్పుడో 27 ఏళ్ల కిందట వచ్చిన ఇండియన్ కు సీక్వెల్ గా ఈ ఇండియన్ 2 రానుంది. ఇప్పటికే ఏడాదికిపైగా ఈ షూటింగ్ కొనసాగుతోంది. డైరెక్టర్ శంకర్ ఓవైపు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ తీస్తూ మరోవైపు ఇండియన్ 2 కూడా తీస్తుండటంతో రెండు సినిమాలూ ఆలస్యమవుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తోంది.
నిజానికి ఎప్పుడో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే శంకర్, కమల్ మధ్య క్రియేటివ్ భేదాలు రావడంతో నిర్మాణం చాలా ఆలస్యమైంది. మొత్తానికి వచ్చే ఏడాది ఇండియన్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం ఈ మూవీ గ్లింప్స్ తోపాటు కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.