Ind vs NZ 1st Test: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఓడిపోగానే విరాట్ కోహ్లి ఎక్కడికెళ్లాడో చూశారా.. వీడియో వైరల్
Ind vs NZ 1st Test: న్యూజిలాండ్ చేతుల్లో ఇండియా తొలి టెస్టులో ఓడిన తర్వాత విరాట్ కోహ్లి చేసిన పని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ind vs NZ 1st Test: న్యూజిలాండ్ తో స్వదేశంలో 36 ఏళ్ల తర్వాత టీమిండియా ఓ టెస్టు మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇండియన్ టీమ్ కేవలం 46 పరుగులకే కుప్పకూలడంతోనే ఓటమి ఖాయమైనా.. రెండో ఇన్నింగ్స్ లో పోరాటం కాస్త ఆకట్టుకుంది. అయితే ఈ ఓటమి తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబైలో కృష్ణ దాస్ కీర్తనకు వెళ్లడం విశేషం.
ఫ్యామిలీతో గడిపిన విరాట్ కోహ్లి
బెంగళూరులో న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు చాలా మంది ప్లేయర్స్ రెండో టెస్టు జరిగే పుణెకు వెళ్లారు. అక్టోబర్ 24 నుంచి ఈ రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే విరాట్ కోహ్లి మాత్రం పుణె వెళ్లకుండా ముంబై వెళ్లి తన ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నాడు.
ఇందులో భాగంగా భార్య అనుష్క శర్మతో కలిసి అతడు ముంబైలో జరిగిన కృష్ణ దాస్ కీర్తనకు వెళ్లాడు. నిజానికి ఈ ఏడాది జులైలోనూ కోహ్లి, అనుష్క లండన్ లో ఇలాంటి కీర్తనకే వెళ్లడం విశేషం. జూన్ 29న సౌతాఫ్రికాపై ఫైనల్లో గెలిచి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విరాట్ కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న సంగతి తెలుసు కదా. ఆ సమయంలో అనుష్కతో కలిసి అతడు కృష్ణ దాస్ కీర్తనకు వెళ్లాడు.
విరాట్ కోహ్లి@9000
బెంగళూరు టెస్టులో టీమిండియా ఓడిపోయినా విరాట్ కోహ్లి మాత్రం ఓ వ్యక్తిగత మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో 9 వేల పరుగుల మార్క్ దాటాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఇండియన్ ప్లేయర్ అతడు. న్యూజిలాండ్ తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 53 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర కోహ్లి టెస్టుల్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌటైన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో 70 రన్స్ చేశాడు.
సర్ఫరాజ్ ఖాన్ 150, రిషబ్ పంత్ 99 రన్స్ చేయడంతో రెండో ఇన్నింగ్స్ లో ఇండియన్ టీమ్ 462 రన్స్ చేసింది. అయితే న్యూజిలాండ్ ముందు కేవలం 107 పరుగుల లక్ష్యమే ఉండటంతో ఆ టీమ్ చివరి రోజు సులువుగా టార్గెట్ చేజ్ చేసింది.
పుణెలో టీమిండియా రికార్డు ఇలా
న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా 0-1తో వెనుకబడింది. ఇప్పుడు సిరీస్ లో నిలవాలంటే పుణె టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో అక్టోబర్ 24 నుంచి పుణెలో రెండో టెస్టు కోసం సిద్దమవుతోంది. ఇక్కడ ఇప్పటి వరకూ ఇండియన్ టీమ్ రెండు టెస్టులు ఆడి ఒకటి, మరొకటి ఓడిపోయింది.
తొలిసారి 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఇండియన్ టీమ్ ఏకంగా 333 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో టీమ్ ఓడిన రెండు టెస్టుల్లో ఇదీ ఒకటి. అయితే రెండేళ్ల తర్వాత ఇక్కడే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఇన్నింగ్స్ 137 పరుగులతో గెలిచింది.
టాపిక్