IT Raids on Producers: దిల్‍రాజు, పుష్ప నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు.. ముమ్మరంగా సోదాలు!-income tax it raids on dil raju and pushpa 2 producers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  It Raids On Producers: దిల్‍రాజు, పుష్ప నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు.. ముమ్మరంగా సోదాలు!

IT Raids on Producers: దిల్‍రాజు, పుష్ప నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు.. ముమ్మరంగా సోదాలు!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 21, 2025 08:45 AM IST

IT Raids on Producers: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‍రాజు, పుష్ప 2 ప్రొడ్యూజర్ నవీన్ యెర్నేనీ ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. వారు తీసిన సినిమాలు ఇటీవల బ్లాక్‍బస్టర్ అయ్యాయి. ఈ తరుణంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి.

IT Raids on Producers: దిల్‍రాజు, పుష్ప నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు.. ముమ్మరంగా సోదాలు!
IT Raids on Producers: దిల్‍రాజు, పుష్ప నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు.. ముమ్మరంగా సోదాలు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇన్‍కమ్ ట్యాక్స్ (ఐటీ) దాడుల కలకలం మరోసారి రేగింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్‍రాజు ఇంట్లో ఐటీ అధికారులు నేడు (జనవరి 21) సోదాలకు దిగారు. పుష్ప 2 నిర్మాత, మైత్రీ మూవీస్ నవీన్ యెర్నేనీ, సీఈవో చెర్రీ ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్‍లోని వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో ఈ సోదాలు చేస్తున్నారు.

yearly horoscope entry point

సుమారు 200 మంది

సుమారు 200 మంది ఐటీ అధికారులు వివిధ బృందాలుగా ఈ దాడులు చేస్తున్నట్టు సమాచారం. దిల్‍రాజు, నవీన్ యెర్నేనీ, చెర్రీ ఇళ్లు సహా మరికొన్ని చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెల్లవారుజామునే ఒకేసారి ఈ సోదాలకు దిగారు. దీంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

పుష్ప 2 బ్లాక్‍బస్టర్ ఎఫెక్టేనా!

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించిన పుష్ప 2 చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది. అల్లు అర్జున్ హీరోగా గత డిసెంబర్ 5న రిలీజైన ఈ సీక్వెల్ మూవీ రికార్డులను బద్దలు కొడుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.1,800 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటిందని మేకర్స్ ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 చిత్రం హిందీలోనూ ఆల్‍టైమ్ రికార్డులను క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 చిత్రాలను కూడా దాటేసింది.

ఈ తరుణంలో పుష్ప 2 నిర్మాత నవీన్, ఆ ప్రొడక్షన్ హౌస్ చెర్రీ ఇళ్లపై ఐటీ అధికారులు దాడులకు దిగారు. వారి ఇళ్లతో పాటు మరికొన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు. ఎంత ఆదాయం వచ్చిందో.. సరైన పన్నులు కట్టారో లేదని అధికారులు తనిఖీలు చేసే అవకాశం ఉంది.

దిల్‍రాజుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఇటీవలే రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి సందర్భంగా ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు అత్యంత సమీపంగా ఉంది. మోస్తరు బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ దిశగా దూసుకెళుతోంది. ఈ సమయంలో దిల్‍రాజు ఇంటిపై ఐటీ దాడులు హాట్ టాపిక్‍గా మారాయి.

ఈ దాడులు పూర్తయ్యాక ఐటీ అధికారులు ఏమైనా సమాచారం వెల్లడిస్తారా.. లేకపోతే తనిఖీలు చేసి వెళ్లిపోతారా అనేది చూడాలి. గతంలోనూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలపై ఐటీ రైడ్స్ జరిగాయి. అయితే అప్పట్లో లెక్కలేవీ బయటికి చెప్పలేదు ఆఫీసర్లు. మొత్తంగా టాలీవుడ్‍లో మరోసారి ఐటీ దాడుల కలకలం సృష్టిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం