Bigg Boss Telugu 6 Episode 94: బిగ్‌బాస్ హౌస్‌లో దెయ్యం.. ఇంటి సభ్యులంతా భయం భయం-inaya scared house mates as ghost in bigg boss season 6 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 6 Episode 94: బిగ్‌బాస్ హౌస్‌లో దెయ్యం.. ఇంటి సభ్యులంతా భయం భయం

Bigg Boss Telugu 6 Episode 94: బిగ్‌బాస్ హౌస్‌లో దెయ్యం.. ఇంటి సభ్యులంతా భయం భయం

Maragani Govardhan HT Telugu
Dec 07, 2022 06:34 AM IST

Bigg Boss Telugu 6 Episode 94: మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ప్రైజ్ మనీ పెంచుకునే మరిన్ని ఛాలెంజులు జరిగాయి. ఈ టాస్కుల్లో కొంతమేర ప్రైజ్ మనీ పెరిగి రూ.41,10,000కి చేరుతుంది. అంతేకాకుండా ఇంట్లో దెయ్యం వచ్చిందని హౌస్ మేట్స్ భయపడటం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది.

బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం
బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం

Bigg Boss Telugu 6 Episode 94: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడు ఏది జరుగుతుందో అంత సులభంగా ఓ అంచనాకు రాలేం. మొన్నటివరకు విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోతలు పెడుతూ టాస్కులు ఇచ్చిన బిగ్‌బాస్ ఇప్పుడు పెంచుకునే అవకాశమిచ్చారు. ఇందుకోసం పలు ఛాలెంజ్‌లు హౌస్ మేట్స్‌కు ఇచ్చారు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్‌ ఈ టాస్క్‌లతో పాటు వినోదాత్మకంగా సాగింది. హౌస్ దెయ్యం వచ్చిందంటూ ఇంటి సభ్యులు చేసే హడావిడి వీక్షకులకు నవ్వు తెప్పిస్తుంది. శ్రీసత్య దెయ్యం స్టోరీ చెప్పడం, అనంతరం ఇనాయా దెయ్యం పట్టిందానిలా మారిపోవడం, హౌస్ మేట్స్‌ భయంతో పరుగులు తీయడం అంతా సరదాగా సాగింది.

మంగళవారం నాటి ఎపిసోడ్‌లో కోతలు పెట్టిన ప్రైజ్ మనీ పెంచుకునే టాస్క్‌లో భాగంగా రెండో ఛాలెంజ్ ఇచ్చారు. ఇందులో రేవంత్, ఇనాయా పోటీ పడ్డారు. మెజార్టీ హౌస్ మేట్స్ ఆ ఛాలెంజ్‌లో ఎవరు గెలుస్తారో కరెక్ట్‌గా గెస్ చేస్తే వారికి రూ.1,10,000 సొమ్ము తిరిగి ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. అనుకున్నట్లుగానే పిరమిడ్ పడొద్దు అనే ఛాలెంజ్‌లో రేవంత్ విజయం సాధించడంతో ఆ సొమ్ము తిరిగి ప్రైజ్ మనీకి యాడ్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటిస్తారు. అనంతరం మూడో ఛాలెంజ్ కోసం ఏకాభిప్రాయంతో రెండు జంటలను ఎంచుకోమని బిగ్‌బాస్ చెబుతారు. ఇందులో భాగంగా ఆదిరెడ్డి-కీర్తి, శ్రీహాన్-శ్రీసత్య ఈ మనీ ట్రాన్స్‌ఫర్ గేమ్‌లో పోటీ పడతారు.

అయితే ఈ ఛాలెంజ్‌లో ఆదిరెడ్డి-కీర్తి ఓడిపోగా.. శ్రీహాన్-శ్రీసత్య గెలుస్తారు. ఫలితంగా ఇంటి సభ్యుల అభిప్రాయం తప్పవడంతో లక్ష రూపాయలు కోల్పోతారు. అనంతరం బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు రూ.2 లక్షలు నాలుగో ఛాలెంజ్ ఇస్తారు. పవర్ పంచ్ టాస్క్ కోసం ఇద్దరిని ఎంపిక చేసుకోవాలని ఇంటి సభ్యులకు చెబుతారు. దీంతో ఇనాయ, రేవంత్‌లను ఇంటి సభ్యులు ఎంపిక చేసుకున్నారు. కీర్తి సంచాలక్‌గా వ్యవహరించారు. ఒక ఇసుక మూటను వేలాడదీసి.. దానికి కింద కన్నం పెట్టారు. మూట కింద రెండు డబ్బాలు ఉంచుతారు. ఒకటి రేవంత్‌ది కాగా.. మరొకటి ఇనాయాది. వీళ్లిద్దరూ చేతికి బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకుని ఇసుకమూటను కిక్ చేస్తూ ఉండాలి. ఎవరి డబ్బాలో అయితే ఎక్కువ ఇసుక చేరుతుందో వారే విజేతగా నిలుస్తారని బిగ్‌బాస్ చెబుతారు. ఈ ఛాలెంజ్‌లో రేవంత్ గెలుస్తాడని ఇంటి సభ్యులు అంచనా వేయడంతో ప్రైజ్ మనీకి మరో రూ.2 లక్షలు చేరుతుంది. దీంతో మొత్తం ప్రైజ్ మనీ విలువ రూ.41,10,100 అవుతుంది.

హౌస్‌లో దెయ్యం..

బిగ్‌బాస్ హౌస్ అర్ధరాత్రి దాటిన తర్వాత హౌస్ మేట్స్ అందర్నీ ఒక చోటే కూర్చోబెట్టి దెయ్య కథ చెప్పింది శ్రీసత్య. ఆ సమయంలో శ్రీహాన్ పక్క బెడ్ మీద దుప్పటి మొత్తం కప్పుకుని పడుకున్నాడు. "జులై 13న మా బుడ్డిదాని బర్త్ డే కోసం ఓ ఫాం హౌస్ తీసుకున్నాం. లోపలకు ఉంటుంది. పూల్ పార్టీ అయిపోయాక నేను వెళ్లి నిద్రపోయా. అప్పటి వరకు మాతో ఉన్న వింత శబ్దం చేసుకుంటూ పారెస్టులోకి వెళ్లిపోతున్నాడు. మా వాళ్లంతా వెళ్లి ఆ అబ్బాయిని కొడుతున్నారంట. అయినా ఎలాంటి చలనం లేకుండా ఉండిపోయాడు. వాడిని తీసుకొచ్చి రూమ్‌లో పడుకోబెడితే మళ్లీ నడుచుకుంటూ ఫారెస్టులోకి వెళ్లిపోయాడు" అంటూ శ్రీసత్య హర్రర్ స్టోరీ చెబుతూ ఉంటుంది. ఈ సమయంలోనే హౌస్‌లో దెయ్యంలా నవ్వుతూ ఓ శబ్దం వినిపించింది.

ఆ శబ్దానికి శ్రీసత్య రివ్వున శ్రీహాన్ బెడ్‌పైకి దూకుతుంది. ఇక శ్రీహాన్ అయితే బాత్రూమ్‌కు వెళ్లడానికి కూడా భయపడ్డాడు. దెయ్యం కాదు.. మనుషులే అంటూ ధైర్యం చెప్పింది. దీంతో అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. లగేజ్ రూమ్‌లో చెక్ చేద్దామంటూ ఆదిరెడ్డిని తీసుకుని శ్రీహాన్ అక్కడకు వెళ్తాడు. వాళ్ల వెనకే రేవంత్ మినహా అందరూ అనుసరిస్తారు. ఇనాయ ఒక్కసారిగా దెయ్యాన్ని చూసినట్లుగా కేకలు వేస్తూ పరుగులు తీస్తుంది. ఆమెతో పాటు అందరూ పరిగెడతారు. అంతేకాకుండా దెయ్యం పట్టినదానిలా ప్రవర్తిస్తుంది. దీంతో ఆదిరెడ్డి భయపడతారు. దెయ్యం భయంతో అందరూ జడుసుకుంటూ, నవ్వుకుుంటూ ఏ అర్ధరాత్రికో పడుకున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం