Bigg Boss 6 Telugu New Captain: బిగ్‌బాస్ సీజ‌న్ 6 చివ‌రి కెప్టెన్‌గా ఇనాయా - హౌజ్‌లో నో రూల్స్ అంటూ ప్ర‌క‌ట‌న‌-inaya becomes last captain of bigg boss 6 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu New Captain: బిగ్‌బాస్ సీజ‌న్ 6 చివ‌రి కెప్టెన్‌గా ఇనాయా - హౌజ్‌లో నో రూల్స్ అంటూ ప్ర‌క‌ట‌న‌

Bigg Boss 6 Telugu New Captain: బిగ్‌బాస్ సీజ‌న్ 6 చివ‌రి కెప్టెన్‌గా ఇనాయా - హౌజ్‌లో నో రూల్స్ అంటూ ప్ర‌క‌ట‌న‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 26, 2022 09:06 AM IST

Bigg Boss 6 Telugu New Captain: బిగ్‌బాస్ లో కెప్టెన్ కావాల‌నే త‌న క‌ల‌ను ఎట్ట‌కేల‌కు నేర‌వేర్చుకున్న‌ది ఇనాయా. త‌న భార్య‌తో వీడియో కాల్ మాట్లాడిన రేవంత్ ఎమోష‌న‌ల్ అయ్యాడు.

ఇనాయా
ఇనాయా

Bigg Boss 6 Telugu New Captain: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6లో ఎట్ట‌కేల‌కు ఇనాయా కెప్టెన్ అయ్యింది. కెప్టెన్ కావాల‌నే త‌న క‌ల‌ను నెర‌వేర్చుకుంది. శుక్ర‌వారం ఎపిసోడ్ ఆరంభంలో ఫైమాకు పంచ్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. మ‌ట్టి తింటూ ఆమె క‌నిపించ‌డంతో రేష‌న్ క‌ట్ చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించాడు. హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఒక్కొక్క‌రు ఎంట్రీ ఇస్తుండ‌టంతో ఈ వారం ఎపిసోడ్స్ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

భార్య‌తో మాట్లాడిన రేవంత్‌...

శుక్ర‌వారం రేవంత్ వైఫ్ అన్విత వాయిస్ మాత్ర‌మే వినిపించ‌డంతో ఆమెను వెతుకుతూ రేవంత్ హౌజ్ మొత్తం క‌లియ‌తిరిగాడు. టీవీ స్క్రీన్‌పై భార్య కనిపించడంతో రేవంత్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. వీడియో కాల్ ద్వారా భార్య‌తో ముచ్చ‌టించాడు. డెలివ‌రీ డేట్ ఇచ్చిన‌ట్లుగా చెప్ప‌గానే క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమెతో మాట్లాడుతున్న స‌మ‌యంలోనే వీడియో కాల్ క‌ట్ అయిపోవ‌డంతో రేవంత్ డిస‌పాయింట్ అయ్యాడు. మ‌రో రెండు నిమిషాలు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌మ‌ని బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్ చేశాడు.

హౌజ్‌లోకి వ‌చ్చిన రేవంత్ మ‌ద‌ర్‌...

ఇంత‌లోనే రేవంత్ మ‌ద‌ర్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేసింది. ఆదిరెడ్డి డ్యాన్స్‌తో పాటు కీర్తి గేమ్ బాగా ఆడుతుంద‌ని మెచ్చుకున్న‌ది. ఎవ్వ‌రు లేర‌ని బాధ‌ప‌డొద్ద‌ని, నువ్వు త‌న కూతురువేన‌ని కీర్తితో చెప్పింది. గ‌డ్డంతో బాగాలేవ‌ని త‌ల్లి చెప్పిన మాట విని రేవంత్‌ గ‌డ్డం తీసేశాడు. నిన్ను రోడ్డు మీద చూసిన‌ది ల‌గ్గాయిత్తు అనే పాట‌కు కంటెస్టెంట్స్‌తో క‌లిసి స్టెప్పులేసింది రేవంత్ మ‌ద‌ర్‌.

కెప్టెన్ అయిన ఇనాయా…

ఈ వారం కొత్త కెప్టెన్‌గా ఇనాయా ఎంపికైంది. కెప్టెన్సీ కోసం గ్రాబ్ అండ్ ర‌న్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. హోరాహోరీగా ఈ టాస్క్ సాగింది. ఫ‌స్ట్ రౌండ్‌లో ఫైమా ఓడిపోయింది. ఈ గేమ్‌లో రేవంత్ అగ్రెసివ్‌గా మారిపోయాడు. ఫైమాతో గొడ‌వ‌పెట్టుకున్నాడు. రెండో రౌండ్‌లో రేవంత్ గేమ్ నుంచి వైదొలిగాడు. చివ‌రి రౌండ్‌లో కీర్తి, ఇనాయా, శ్రీస‌త్య మిగిలారు.

నో రూల్స్‌...

ఇనాయా, శ్రీస‌త్య మ‌ధ్య చివ‌రి వ‌ర‌కు ఫైట్ సాగింది. ఇందులో ఇనాయా గెలిచింది. ఫ‌స్ట్ టైమ్ కెప్టెన్‌గా ఎంపికైంది ఇనాయా. బిగ్‌బాస్ హౌజ్ చివ‌రి కెప్టెన్ కూడా ఆమెను కావ‌డం గ‌మ‌నార్హం. తానే చివరి కెప్టెన్ కావడంతో ఎవరికి ఎలాంటి రూల్స్ పెట్ట‌న‌ని, న‌చ్చిన‌ట్లుగా ఉండ‌మని ఇనాయా చెప్పింది.

టీ20 వరల్డ్ కప్ 2024