IMDb Ratings: 2022లో టాప్‌ IMDb రేటింగ్స్‌ ఉన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ ఇవే-imdb released top rated indian movies and web series of 2022 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Imdb Released Top Rated Indian Movies And Web Series Of 2022

IMDb Ratings: 2022లో టాప్‌ IMDb రేటింగ్స్‌ ఉన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ ఇవే

Hari Prasad S HT Telugu
Jul 14, 2022 10:04 AM IST

IMDb Ratings: ఏ సినిమాలు చూడాలి.. ఏ వెబ్‌ సిరీస్‌ చూడాలో నిర్ణయించుకోవడానికి ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (IMDB) రేటింగ్స్‌ చాలా మంది చూస్తుంటారు. 2022లో ఇప్పటి వరకూ అలా టాప్‌ రేటింగ్స్‌ ఉన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ లిస్ట్‌ను ఐఎండీబీ రిలీజ్‌చేసింది.

IMDb రిలీజ్ చేసిన టాప్ రేటెడ్ మూవీస్
IMDb రిలీజ్ చేసిన టాప్ రేటెడ్ మూవీస్ (IMDb Twitter)

ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (IMDb)లో రేటింగ్స్‌ బాగున్నాయి అంటే ఆ సినిమా లేదా వెబ్‌సిరీస్‌ చాలా మందికి నచ్చింది అని. ఈ సినిమాలు, వెబ్‌సిరీస్‌ను చూసిన వాళ్లు ఈ ఐఎండీబీలో తమ రేటింగ్స్‌ ఇస్తుంటారు. ఐఎండీబీ రేటింగ్‌ సగటు పదికి 7 నుంచి 9 మధ్యలో ఉంది అంటే ఆ సినిమా లేదా వెబ్‌సిరీస్‌ హిట్‌ అన్నట్లే. ఓటీటీల్లో అయినా, థియేటర్లలో అయినా వీటిని చూడాలని అనుకునే వాళ్లు ఐఎండీబీ రేటింగ్స్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు.

అందుకే ప్రతి ఏటా అప్పుడప్పుడూ ఇలా టాప్‌ రేటింగ్స్ సాధించిన మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ లిస్ట్‌లను ఐఎండీబీ రిలీజ్‌ చేస్తుంది. తాజాగా బుధవారం (జులై 13) కూడా ఈ లిస్ట్‌ రిలీజైంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ వచ్చిన టాప్‌ రేటెడ్‌ ఇండియన్‌ మూవీస్‌, టాప్‌ రేటెడ్‌ ఇండియన్‌ వెబ్‌ సిరీస్‌లకు సంబంధించి రెండు వేర్వేరు లిస్ట్‌లను రిలీజ్‌ చేశారు.

IMDb టాప్‌ 10 ఇండియన్‌ మూవీస్‌

విక్రమ్‌ : 8.8

కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2: 8.5

ది కశ్మీర్‌ ఫైల్స్‌: 8.3

హృదయం: 8.1

ఆర్‌ఆర్‌ఆర్‌: 8.0

ఎ థర్స్‌డే: 7.8

ఝుండ్‌: 7.4

సామ్రాట్‌ పృథ్వీరాజ్‌: 7.2

రన్‌వే 34: 7.2

గంగూబాయ్‌ కఠియావాడి: 7.0

IMDb టాప్‌ 10 వెబ్‌ సిరీస్‌ ఇవే

క్యాంపస్‌ డైరీస్‌ (ఎంఎక్స్‌ ప్లేయర్‌): 9.0

రాకెట్‌ బాయ్స్‌ (సోనీ లివ్‌): 8.9

పంచాయత్‌ (ప్రైమ్‌ వీడియో): 8.9

హ్యూమన్‌ (హాట్‌స్టార్‌): 8.0

అపహరణ్‌ (ఎంఎక్స్‌ ప్లేయర్‌): 8.4

ఎస్కేప్‌ లైవ్‌ (హాట్‌స్టార్‌): 7.7

ది గ్రేట్ ఇండియన్‌ మర్డర్‌ (ప్రైమ్‌ వీడియో): 7.3

మాయి (నెట్‌ఫ్లిక్స్‌): 7.2

ద ఫేమ్‌ గేమ్‌ (నెట్‌ఫ్లిక్స్‌): 7.0

యే కాలీ కాలీ ఆంఖే (నెట్‌ఫ్లిక్స్‌): 7.0

IPL_Entry_Point