Illu Illalu Pillalu Today Episode: ధీరజ్‌తో చేయి కలిపిన విశ్వ- ప్రభల తీర్థంలో రామరాజుకు కత్తిపోట్లు- కుమిలిపోయిన చందు
Illu Illalu Pillalu Serial January 27th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 27 ఎపిసోడ్‌లో ప్రభల తీర్థంలో ధీరజ్‌ను చంపేయమని రౌడీలకు చెబుతాడు విశ్వ. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్‌తో విశ్వ బావ అని పలకరిస్తాడు. దాంతో విశ్వపై ధీరజ్‌కు డౌట్ వస్తుంది. తను ప్రేమించిన అమ్మాయి కనిపించడంతో చందు షాక్ అవుతాడు.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఊరిలో సంక్రాంతి పోటీలు జరుగుతాయి. భార్యలను ఎత్తుకుని అందరికంటే ముందుగా పరిగెత్తాలి. జెనరల్‌గా దెయ్యాలు క్షణాక్షణానికి బరువు పెరుగుతాయంటా. నువ్వే కూడా అలాగే పెరుగుతున్నావ్. నువ్ కూడా ఆ సామాజిక వర్గానికే చెందినదానివేగా అని ధీరజ్ దాంతో ప్రేమ ధీరజ్‌ను కొడుతుంది, గిచ్చుతుంది.

రివేంజ్ తీర్చుకున్న ధీరజ్
నీ మీద ఎక్కినందుకు నాకు కూడా కంపరంగా ఉందిరా అని ప్రేమ అంటుంది. తర్వాత ఆ పరుగుపందెంలో ధీరజ్, ప్రేమ గెలుస్తారు. ఆ తర్వాత సాగర్, నర్మద వస్తారు. దాంతో అంతా చప్పట్లు కొడుతారు. మా ఇద్దరు కోడళ్లు గెలిపించారు అని వేదవతి అంటుంది. అది చూసి భద్రావతి కోపంతో రగిలిపోతుంది. తర్వాత ప్రేమను గిచ్చి తన రివేంజ్ తీర్చుకుంటాడు ధీరజ్. దాంతో ఒక్కసారిగా అరుస్తుంది ప్రేమ. దున్నపోతులా నా మీద ఎక్కి గిచ్చింది. ఇప్పుడు తిక్క కుదిరింది అని ధీరజ్ అనుకుంటాడు.
నువ్వా ఆ ఇంట్లో కలిసి తిరగడం, అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండటం సహించలేకపోతున్నాను అని భద్రవాతి అనుకుంటుంది. ఇప్పుడు సంక్రాంతిలో చివరి పోటీ తగ్గా ఆఫ్ వార్ అని చెబుతాడు లింగం. ఈ పోటీలో ఓ వైపు రామరాజు కుటుంబం ఉంటే.. మరోవైపు సేనాపతి కుటుంబం వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో సై మ్యూజిక్ వస్తుంది. ఇద్దరి కుటుంబాలు తలబడి ఒక కుటుంబం గెలుస్తుంది అని లింగం చెబుతాడు. ఈ పోటీలో గెల్చి తీరాలి అని ఇరు కుటుంబాలు అనుకుంటాయి.
వేదవతిపై భద్రావతి
ఇరు కుటుంబాలు పోటాపోటీగా లాగుతారు. రామరాజు కుటుంబం బలంగా లాగడంతో భద్రావతి వచ్చి వేదవతి మీద పడుతుంది. దాంతో రామరాజు కుటుంబం గెలిచినట్లు లింగం చెబుతాడు. మరోవైపు తమ చిన్ననాటి తనాన్ని గుర్తు చేసుకుంటారు అక్కా చెల్లెల్లు భద్రావతి, వేదవతి. ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటారు. తర్వాత తేరుకున్న భద్రావతి ఛీ అని చీదరించుకుని వెళ్లిపోతుంది. తర్వాత ధీరజ్‌ను చూస్తూ కోపంతో రగిలిపోతాడు విశ్వ. మరుసటి రోజు ఉదయం తను సెట్ చేసిన రౌడీలకు ధీరజ్‌ను చంపడం గురించి చెబుతాడు.
కాసేపట్లో ప్రభల తీర్థం మొదలవుతుంది. దాన్ని ధీరజ్ గాడు ఎత్తుకుని మోస్తాడు. వాడిని వేసేయడానికి ఇదే సరైన సమయం, సందర్భం అని విశ్వ అంటాడు. ఎంత దూరం నుంచి కత్తి విసిరిన టార్గెట్ మిస్ అవ్వదు అని రౌడీలు చెబుతారు. శివయ్య కోసం ప్రభలను ఎత్తుకున్న ధీరజ్ గాడు శివయ్యే దగ్గరికే వెళ్తాడు. కాసేపట్లో వాడు శవం అవుతాడు అని అంటారు. తర్వాత తననే చూస్తున్న విశ్వను చూసిన ధీరజ్ దగ్గరికొస్తాడు.
విశ్వపై ధీరజ్ డౌట్
హాయ్ బావ అని విశ్వ పిలిస్తే.. ధీరజ్ షాక్ అవుతాడు. నువ్ మా మేనత్త కొడుకువి. పైగా నా చెల్లెలి మొగుడువి అని విశ్వ అంటాడు. ఏరా తాడి చెట్టు నీ మాటలో ఏదో తేడా కనపడుతుంది అని ధీరజ్ అంటాడు. ఎలా అర్థం చేసుకుంటే అలా. హ్యాపీ సంక్రాంతి అని చేయి ఇస్తే.. విశ్వ ఇవ్వడు. కానీ, విశ్వ తీసుకుని విశెష్ చెబుతాడు. ఒరేయ్ జిరాఫీ. మాములుగా అయితే నాకోసం నువ్వు కత్తిపట్టుకుని తిరగాలి. కానీ చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇస్తున్నావ్. ఏంట్రా కథ అని ధీరజ్ అంటాడు.
హ్యాపీగా సంక్రాంతి జరుపుకో. ఈ పండుగ నీకు చాలా స్పెషల్. కొత్తగా పెళ్లి అయింది కదా. ఈ పండుగ మీ కుటుంబానికి చాలా ఏళ్లు గుర్తుండిపోతుంది. హ్యాపీ సంక్రాంతి బావ అని విశ్వ వెళ్లిపోతాడు. వీడి మాటలో ఏదో మర్మం ఉందని ధీరజ్ అనుమానపడతాడు. రామరాజు, సేనాపతి కుటుంబం పక్క పక్కనే ప్రభలను తయారు రెడీ చేస్తుంటారు. పోయినాసారి ఉత్సవాల్లో ఆ రామరాజు కుటుంబమే గెలిచింది. ఈసారి మనమే గెలవాలి అని భద్రావతి అంటుంది.
కలశం కిందపెట్టకూడదు
మనమే గెలుస్తాం అక్కా అని సేనాపతి అంటాడు. కాసేపట్లో ప్రభల తీర్థం మొదలవుతుంది అని అనౌన్స్‌మెంట్ వస్తుంది. ఇంతలో పంతులు వచ్చి మీ ప్రభలతీర్థం త్వరగా కానివ్వండి. టైమ్ అవుతుంది. కళాశాలంకరణ కూడా పూర్తి చేయాలి అని చెప్పి వెళ్లిపోతాడు. పెద్దోడికి కోనేటిలో నీరు తీసుకురమ్మని, మధ్యలో కలశం కింద పెట్టకూడదు, అలా చేస్తే అరిష్టం అని వేదావతి అంటాడు. పెద్దోడికి పద్ధతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని రామరాజు అంటాడు.
చిన్నోడు ఇంట్లోవాళ్ల కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడడు అని వేదవతి అంటుంది. మొన్న పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు చూశాను. గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని రామరాజు అంటాడు. దాంతో ఆడపడుచు కట్నం గురించి మాట్లాడుతుంది ధీరజ్ అక్క. మరో అక్క సెటైర్లు వేస్తుంది. పెద్దోడు కోనేటికి నీరు కోసం వెళ్తాడు. తర్వాత విశ్వకు కలశంతో నీరు తీసుకురుమ్మని, జాగ్రత్త అని భద్రావతి చెబుతుంది.
కుప్పకూలిపోయిన చందు
చందు కలశం ఎత్తుకుని నీరు తెస్తుంటే దారిలో తను ప్రేమించిన అమ్మాయి భర్తతో కనిపిస్తుంది. అది చూసి షాక్ అయి అక్కడే ఆగిపోతాడు చందు. జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. చందును చూసిన తను అలాగే ఆగిపోతుంది. ఇంతలో తన భర్త వచ్చి అతనెవరో తెలుసా అని అడిగితే.. తెలియదు అని చెబుతుంది. దాంతో షాక్ అయిన చందు కలశాన్ని కింద పడేస్తాడు. తను తెలియదన్న మాటలనే తలుచుకుని కుప్పకూలిపోతుంటే ధీరజ్ వచ్చి పట్టుకుంటాడు.
చందు ప్రేమించిన అమ్మాయిని ధీరజ్ చూసి అర్థం చేసుకుంటాడు. ఇలా రా అని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెడతాడు. చందు ఏడుస్తుంటే ధీరజ్ ఓదారుస్తాడు. మా నాన్నకు ప్రేమించి పెళ్లి చేసుకోనని మాటిచ్చానని చెప్పింది చందు గుర్తు చేసుకుంటాడు. తన మాటలకు అమ్మాయి బాధపడి వెళ్లిపోయింది తలుచుకుంటాడు చందు. తర్వాత ప్రభల పోటీలు ప్రారంభం అవుతాయి. రామరాజు, ధీరజ్ ప్రభలను మోసుకుంటూ వెళ్తారు.
రామరాజును పొడిచిన రౌడీలు
దారిలో విశ్వ పురామాయించిన రౌడీలు ధీరజ్ వెనకాలే వస్తారు. విశ్వ సైగ చేయడంతో ఆ రౌడీ ధీరజ్‌ను పొడిచినట్లు చూస్తాడు. కానీ, ధీరజ్ నాన్న అని అరుస్తాడు. అయితే, రౌడీ ఎవరిని పొడిచాడో చూపించరు. రామరాజును రౌడీ కత్తితో పొడిచినట్లుగా ధీరజ్ అరుపు వింటే తెలుస్తోంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్