Illu Illalu Pillalu Today Episode: ధీరజ్‌తో ప్రేమ గొడవ - వేదావతిని బుక్ చేసిన కామాక్షి - విశ్వ ప్లాన్ ఫెయిల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 28 ఎపిసోడ్‌లో ప్రభల తీర్థం తేవడానికి చందు బదులుగా ధీరజ్ వెళతాడు. ధీరజ్‌కు బంధాలు, బాధ్యతల విలువ తెలియదని, నీకు అప్పగించిన పనిని వాడికి ఎందుకు చెప్పావంటూ చందుకు క్లాస్ ఇస్తాడు రామరాజు.
జాతరలో తన లవర్ కనిపించడంతో చందు షాకవుతాడు. చందు ఎవరో తనకు తెలియదని భర్తతో ఆమె చెప్పడం చూసి బాధపడతాడు. చందును ధీరజ్ ఓదార్చుతాడు. తను దూరమై చాలా కాలమైనా ఇంకా ఏడుస్తున్నావంటే...నీ మనసులో ఆమె పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని చందుతో ధీరజ్ అంటాడు.
ఆ అమ్మాయిని ప్రేమించానని ఒక్క మాట నాన్నతో చెప్పి ఉంటే నీ లైఫ్ ఇంకోలా ఉండేదని, ఈ బాధ కన్నీళ్లు ఏవి ఉండేవి కావని చందుతో ధీరజ్ చెబుతాడు కానీ నాన్న అంటే నీకు ఉన్న గౌరవం, భయంతో నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు...నిన్ను చూస్తుంటే బాధగా ఉందని చందుతో ధీరజ్ అంటాడు.
కోనేటి తీర్థం....
ప్రభలు తీసుకెళ్లడానికి అందరూ సిద్ధం కావాలని అనౌన్స్‌మెంట్ రావడంతో చందును అక్కడి నుంచి పంపిస్తాడు ధీరజ్. తాను కోనేటి నుంచి తీర్థం తీసుకొస్తానని అన్నయ్యకు చెబుతాడు. కోనేటి నీళ్లు తీసుకురావడానికి ధీరజ్ వెళ్లాడని తెలిసి రామరాజు ఫైర్ అవుతాడు.
బంధాలు, బాధ్యతల గురించి ధీరజ్‌కు తెలియదని, నీకు అప్పజెప్పిన పనిని వాడికి ఎందుకు అప్పగించావని కోపంగా అంటాడు. వాడికి ముఖ్యమైన పనులు చెప్పడం అంత బుద్ది తక్కువ పని ఇంకొకటి ఉండదని క్లాస్ పీకుతాడు.
పెళ్లి చేసుకొని వచ్చాడు...
మీ అమ్మను, నర్మదను గుడికి తీసుకెళ్లమని అంటే... వాళ్లను దారి మధ్యలోనే వదిలేసి ప్రేమను పెళ్లి చేసుకొని వచ్చాడని ధీరజ్‌ను తప్పుపడతాడు రామరాజు. తమ్ముడు చాలా మంచోడని, నా అనే వాళ్ల బాధను అర్థం చేసుకోవడం, పంచుకోవడం బాగా తెలుసునని, ఎదుటివాళ్ల బాధను దూరం చేయడానికి ఎన్ని అవమానాలు అయినా పడతాడని తమ్ముడిని వెనకేసుకొనివస్తాడు చందు.
మన అనే వాళ్లకు కష్టం వస్తే తన జీవితాన్ని పణంగా పెట్టడానికి ధీరజ్ వెనుకాడడని వేదావతి అంటుంది. కుటుంబసభ్యులు ఎంత చెప్పిన రామరాజు మాత్రం తన నిర్ణయం మార్చుకోడు.
ఒంటరిగా దొరికిన ధీరజ్...
కోనేటి నుంచి నీరు తీసుకురావడానికి వెళ్లిన ధీరజ్‌ను చూస్తాడు విశ్వ. ఒంటరిగా కనిపించడంతో అతడిని చంపేయమని తన మనుషులకు చెబుతాడు. కోనేటి తీర్థం తీసుకురావడానికి వెళ్లిన ధీరజ్ ఆలస్యం చేయడంతో రామరాజు కోడుకును కోప్పడుతాడు. ఇదేనా వాడి గొప్పతనం, బాధ్యత అని వేదావతిని నిలదీస్తాడు. ధీరజ్‌కు దేవుడు బుద్దిజ్ఞానం ఇవ్వలేదని, పోటుగాడిలా ప్రతి పనిలో తలదూర్చుతాడని ప్రేమ కోసం మనసులో భర్తను కోప్పడుతుంది.
ప్రేమ ఫోన్ కాల్...
కలశం నెత్తిన పెట్టుకొని వస్తుంటాడు ధీరజ్. వెనక నుంచి అతడిపై కత్తి విసురుతాడు రౌడీ. అప్పుడే ప్రేమ ఫోన్ చేయడంతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు ధీరజ్. కానీ ఫోన్ కిందపడటంతో వంగుతాడు. దాంతో రౌడీ విసిరిన కత్తి మిస్సైపోయి చెట్టుకు తగులుతుంది. రాక్షసి ఈ టైమ్‌లో ఫోన్ చేస్తుందని ప్రేమపై కోప్పడుతాడు ధీరజ్. ప్రేమ కాల్ చేయడం వల్లే తన ఫోన్ కిందపడిపోయిందనే కోపంతో కాల్ కట్ చేస్తాడు.
విశ్వ షాక్...
కలశం తీసుకురాలేదని ధీరపై రామరాజు చిందులు తొక్కడం విశ్వ చూస్తాడు. ఈ పాటికే ధీరజ్ తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయాడని అనుకుంటాడు. కానీ అప్పుడే ధీరజ్ అక్కడికి రావడం చూసి షాకవుతాడు. వీడేంటి ఇంకా బతికే ఉన్నాడని అనుకుంటాడు. టైమ్ విలువ, పని విలువ నీకు తెలియదా అని కలశం తీసుకురావడం ఆలస్యం చేసిన చేసిన ధీరజ్‌కు క్లాస్ ఇస్తాడు రామరాజు.
జీవితం మీద విరక్తి...
ప్రేమ వల్లే తండ్రితో తాను తిట్టు తినాల్సివచ్చిందని ధీరజ్ కోపంతో రగిలిపోతాడు. నీతో మాట్లాడాలని పక్కకు రమ్మని ప్రేమతో అంటాడు. ఏంటి బెదిరిస్తున్నావు...నేను రానని ప్రేమబదులిస్తుంది. కోపంగా ప్రేమ చేయి పట్టుకొని పక్కకు తీసుకెళతాడు ధీరజ్. ఏదో పెళ్లాం మాదిరిగా చేయి పట్టుకొని తీసుకెళుతున్నావు...చేయి వదలమని ప్రేమ అంటుంది. నువ్వు పెళ్లాం అంటే జీవితం మీద విరక్తి పుడుతుందని, సన్యాసంలో కలిసిపోవాలని అనిపిస్తుందని ధీరజ్ అంటాడు. ఆ పని చేయి నేను ప్రశాంతంగా ఉంటానని ప్రేమ అంటుంది. ఇద్దరు వాదించుకుంటారు.
కామాక్షి అనుమానం…
ధీరన్, ప్రేమ పవర్తనపై కామాక్షిలో అనుమానం మొదలవుతుంది. ధీరజ్, ప్రేమ మనల్ని మోసం చేశారని తల్లితో అంటుంది. అసలు వాళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదని నిజం బయటపెడుతుంది. వాళ్ల మధ్య లవ్ ఉన్నదన్నది అంత అబద్ధమని అంటుంది. వాళ్ల పెళ్లి వెనుక ఏదో గూడుపుఠాణి ఉందని అనుమానపడుతుంది. కూతురి మాటలతో వేదావతి కంగారు పడుతుంది. ప్రేమించుకున్నవాళ్లు ఎక్కడైనా అలా పోట్లాడుకుంటారా అని కామాక్షి అంటుంది. ధీరజ్, ప్రేమ పోట్లాడుకునే సీన్‌కు వాళ్లకు డైరెక్ట్‌గా చూపిస్తుంది.
లవ్ లేకుండా....
నాకు ఫోన్ ఎందుకు చేశావో చెప్పవే దయ్యం అంటూ ప్రేమపై ధీరజ్ విరుచుకుపడతాడు. నీకు ఫోన్ చేయడం ఏమన్నా నేరమా అని ప్రేమ బదులిస్తుంది. దగ్గరకు వెళ్లి మాటలు వింటే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుస్తుందని, లవ్ లేకుండా ఎందుకు వాళ్లు పెళ్లి చేసుకున్నారో అర్థమైపోతుందని కామాక్షి అంటుంది.
తిరుపతి ట్రాన్స్‌లేషన్....
భార్యాభర్తలు మాట్లాడుకుంటుండగా వినడం మ్యానర్స్ కాదని నర్మద టాపిక్ డైవర్ట్ చేస్తుంది. దూరం నుంచే వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో లిప్ రీడింగ్ ద్వారా చెబుతానని బిల్డప్‌లు ఇస్తాడు తిరుపతి. నీతో మాట్లాడటం అంటేనే చిరాకు అని ప్రేమ, నీ బాబు తిడుతున్నాడనిన ఫోన్ చేశానని ధీరజ్‌తో అంటుంది ప్రేమ. నీతో మాట్లాడకపోతే ఏదో పోగొట్టుకున్నదానిని అయిపోతానని, ఆ విషయం నీకు తెలియదా ప్రేమ మాటల్ని మరోలా తిరుపతి ట్రాన్స్‌లేట్ చేసి చెబుతాడు.
డిస్ట్రబ్ చేశావంటే?
మా నాన్న నన్ను తిడతాడు, కొడతాడు నీకెందుకు అని ప్రేమను నిలదీస్తాడు ధీరజ్. ఇంకోసారి నాకు ఫోన్ చేసి డిస్ట్రబ్ చేశావంటే అని కోపంగా మాటలు మింగేస్తాడు ధీరజ్. నీకు ఫోన్ చేయడానికి నాకు పని పాట ఏం లేదని అనుకుంటున్నావా అని ప్రేమ బదులిస్తుంది.
నేను నిన్ను ఎక్కువ సేపు చూడకుండాఉండాలనే, అందుకే ఎవరికి తె లియకుండా ఫోన్ చేశానని, నిన్ను పక్కకు తీసుకొచ్చానని ధీరజ్ చెప్పినట్లుగా తిరుపతి ట్రాన్స్‌లేట్ చేస్తాడు. ఎంత ముద్దస్తున్నావో తెలుసా అని ధీరజ్ అన్నాడని తిరుపతి అంటాడు.
కామాక్షి శపథం...
అసలు నీ మాటలకు వాళ్ల మాటలకు పొంతన లేదని కామాక్షి అంటుంది. అసలు వాళ్ల మధ్య ఏం జరిగిందో తనకు తెలియాల్సిందేనని కామాక్షి పట్టుపడుతుంది. కూతురిని కసురుకుంటుంది కామాక్షి. భార్యభర్తల విషయంలో జోక్యం చేసుకోవద్దని సలహా ఇస్తుంది. ధీరజ్, ప్రేమ బండారం బయటపెట్టకుండా నిద్ర పోయేది లేదని కామాక్షిశపథం చేస్తుంది.
ప్రభల పోటీల్లో ప్రతిసారి రామరాజు కుటుంబమే గెలుస్తూ వస్తోందని, ఈ సారి ఏ కుటుంబం గెలుస్తుందో చూడాలని లింగం మైకులో అనౌన్స్‌చేస్తాడు. ప్రభల పోటీలు మొదలువుతాయి. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ముగిసింది.