Illu Illalu Pillalu Serial: ధీరజ్‌తో రామరాజు మాటలు బంద్ - వేదావతి కన్నీళ్లు - విశ్వ కన్నింగ్ ప్లాన్
ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 21 ఎపిసోడ్‌లో ప్రేమ మెడలో మూడుముళ్లు వేసిన కొడుకు ధీరజ్‌తో జీవితాంతం మాట్లాడనని రామరాజు శపథం చేస్తాడు. తన వల్ల తండ్రి బాధలు, అవమానాలు పడటం చూసి ధీరజ్ ఎమోషనల్ అవుతాడు..
ధీరజ్, ప్రేమ పెళ్లి జరగడానికి నువ్వే కారణమంటూ భార్య వేదావతిపై రామరాజు కొప్పడతాడు. భర్త మాటలతో తాను ఆడిన నాటకం బయటపడిందని వేదావతి కంగారు పడుతుంది. నువ్వు చేసిన గారాబం వల్లే ధీరజ్ చెడిపోయాడని రామరాజు అంటాడు. ప్రతి విషయంలో ధీరజ్‌ను నువ్వు వెనకేసుకొని రావడం వల్లే ఈ రోజు ప్రేమ మెడలో మూడుముళ్లు వేశాడని రామరాజు అంటాడు. భర్త మాటలతో తన డ్రామా బయటపడలేదని తెలిసి వేదావతి ఊపిరి పీల్చుకుంటుంది.

భయపడుతూ బతకొద్దు...
తండ్రితో మాట్లాడబోతాడు ధీరజ్. నువ్వు నాతో మాట్లాడకు అని రామరాజు కోపంగా అరుస్తాడు. నలుగురి ఏమనుకుంటారో...పరువు ఎక్కడ పోతుందోనని ప్రతి క్షణం భయపడుతూ బతకడం కరెక్ట్ కాదని తండ్రితో ధీరజ్ అంటాడు. అది భయం కాదు విచక్షణ అని కొడుకుకు బదులిస్తాడు రామరాజు. ఒకరు మనల్ని వేలెత్తి చూపించే పరిస్థితి తెచ్చుకోకూడదని నా తపన అంత అని రామరాజు బదులిస్తాడు.
ఎవరు సాయం చేశారు?
పాతికేళ్ల క్రితం మీరు అమ్మను పెళ్లిచేసుకొని రోడ్డు మీద నిలబడినప్పుడు ఏ నలుగురు మీకు అండగా నిలబడ్డారు? మీ కష్టంతోనే మీకు పైకి వచ్చారు తప్పితే మీకు ఎవరైనా సాయం చేశారా? కష్టంలో మీకు అండగా నిలబడ్డారా..? అలాంటప్పుడు ఇతరుల గురించి ఆలోచించడం ఎందుకు? మీ పిల్లల కంటే సొసైటీ మీకు ముఖ్యమా? సమాజం గురించి ఆలోచించి బతుకుతారా అంటూ తండ్రిని ప్రశ్నిస్తాడు ధీరజ్. కొడుకు మాటల్ని ఆపాలని ప్రయత్నిస్తుంది వేదావతి.
నీతులు చెప్పొద్దు...
మన గురించి మనం బతుకుతాం...మన గురించి ఏదో మాట్లాడుకునేవాళ్ల కోసం కోసం భయపడుతూ బతకొద్దని తండ్రితో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ధీరజ్. కొడుకు తనకు నీతులు చెప్పడం చూసి రామరాజు కోపం పట్టలేకపోతాడు. కన్న తండ్రికి ఇవ్వాల్సిన కనీసం మర్యాద కూడా ధీరజ్ తనకు ఇవ్వడం లేదని రామరాజు కొప్పడతాడు. జన్మలో ధీరజ్‌తో మాట్లాడేది లేదని రామరాజు అంటాడు.
ప్రేమను తాను పెళ్లి చేసుకోవడం వల్ల భద్రవతి ఫ్యామిలీ ముందు తండ్రి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, నాన్న కోపం, బాధలో అర్థం ఉందని, అది అర్థం చేసుకోకుండా ఆయన వాదించి తప్పుచేశానని ధీరజ్ వాపోతాడు.
ధీరజ్ కన్నీళ్లు...
ధీరజ్‌కు క్లాస్ ఇస్తుంది వేదావతి. ఆయన్ని ఎవరైనా అంటే కన్న కొడుకు అయినా వదిలిపెట్టనని వేదావతి అంటుంది. ధీరజ్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి వేదావతి షాకవుతుంది. నా కన్నీళ్లకు, నాన్న పడుతోన్న బాధకు కారణం నువ్వేనని అమ్మనే తప్పు పడతాడు ధీరజ్. ప్రేమ మెడలో నాతో నువ్వు తాళి కట్టించడం వల్లే ఇదంతా జరిగిందని అంటాడు.
ప్రేమ గురించి ఆలోచించావు తప్పితే...నాన్న గురించి ఆలోచించలేదు. నువ్వు చేసిన పని వల్ల భద్రావతి కుటుంబానికి మనపై ఉన్న పగ, ద్వేషం మరింత పెరిగాయని తల్లితో ధీరజ్ అంటాడు. నువ్వు మీ పుట్టింటి గురించి, ఆ ఇంట్లో వాళ్ల గురించే ఆలోచించావు తప్పితే...నాన్నకు అవమానాలు ఎదురవుతాయని, మన కుటుంబం బాధపడుతుందని నువ్వు ఆలోచించలేదని తల్లినే తప్పు పడతాడు ధీరజ్.
పుట్టింటి స్థార్థంతో కాదు...
ఒక మాట అంటే తీసుకొచ్చు...మనసుకు కష్టంగా అనిపించినా భరించొచ్చు. ఒక ప్రాణం పోతే తీసుకురాగలమా అని వేదావతి ఎమోషనల్ అవుతుంది. ప్రేమ మెడలో నిన్ను తాళి కట్టమని చెప్పినప్పుడు నేను అదే మాత్రమే ఆలోచించాను. కానీ నా పుట్టిళ్లు అనే స్వార్థంతో కాదని వేదావతి బదులిస్తుంది. జరుగుతున్న పరిణామాలు, మీ నాన్న బాధ చూస్తుంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తాయోనని భయంగా ఉందని కళ్లు తిరిగి పడిపోబోతుంది వేదావతి. ధీరజ తల్లిని పట్టుకుంటాడు.
కూర్చొబెట్టి నీళ్లు తాగిస్తాడు. కుటుంబంలో ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటానని, నాన్నను, నిన్ను బాధపెట్టేలా ఎప్పుడు ప్రవర్తించనని, నాన్నకు ఎదురుచెప్పనని తల్లికి మాటిస్తాడు ధీరజ్.
సంక్రాంతి సంబరాలు...
సంక్రాంతి సంబరాలకు భద్రావతి, రామరాజు కుటుంబాలను పిలవడానికి ఊరి పెద్దలు వస్తారు. రెండు గ్రూపులుగా విడిపోయి రెండు ఫ్యామిలీలను వేడుకలకు ఒకేసారి ఆహ్వానిస్తారు. రామరాజుతో పాటు భద్రావతి కూడా సంక్రాంతి సంబరాలకు ఈ సారి రావడం లేదని చెబుతారు.
మీ కుటుంబం అమ్మవారి పల్లకి మోయకుండా సంక్రాంతి సంబరాలు ఎప్పుడూ పూర్తికాలేదని రామరాజును ఊరి పెద్దలు బతిమిలాడుతారు. ఈ సారి కుటుంబ పరిస్థితులు వేరుగా ఉన్నాయని రాలేనని రామరాజు అంటాడు. మీరు రాకపోతే సంక్రాంతి పండుగకు అర్థమే ఉండదు, ఊరిలో పండగ జరగదని రామరాజును ఊరి పెద్దలు బతిమిలాడి ఒప్పిస్తారు.
మాటిచ్చిన చందు...
తన వల్లే సంక్రాంతి సంబరాలకు తండ్రి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడని ధీరజ్ అనుకుంటాడు. సంక్రాంతి వేడుకలను వస్తామని చెప్పమని చందును బతిమిలాడు. ధీరజ్ బలవంతంతో మేము సంక్రాంతి సంబరాలకు వస్తామని చందు అంటాడు. కొన్ని సంవత్సరాలుగా మీ చేతుల మీదుగా జరుగుతున్న సంప్రదాయం ఆగిపోకూడదని, ఎప్పటిలాగే ఈ సారి కూడా అమ్మవారి పల్లకి మోసి సంక్రాంతి పండుగ చేసుకుందామని చందు అంటాడు.
విశ్వ ప్లాన్...
మరోవైపు సంక్రాంతి సంబరాలకు తాము దూరంగా ఉంటామని భద్రావతి, సేనాపతి అంటాడు. కానీ విశ్వ మాత్రం మేము సంక్రాంతి సంబరాలకు వస్తామని, ఏర్పాట్లు చేసుకోమని ఊరి పెద్దలకు చెబుతాడు. రావాల్సిన అవసరం ఉందని అంటాడు. ఊరి పెద్దలకు మాటిచ్చిన విశ్వపై భద్రావతి, సేనాపతి కోప్పడుతారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలిసి ఎలా మాటిచ్చావని కొడుకును నిలదీస్తాడు సేనాపతి. రామరాజు కుటుంబానికి మనమంటే ఏమిటో చూపించాలనే మాటిచ్చానని విశ్వ అంటాడు.వాళ్లకు బుద్ది వచ్చేలా చేస్తానని చెబుతాడు.
గర్వంతో...
సంక్రాంతి పండుగను అడ్డం పెట్టుకొని రామరాజు కుటుంబాన్ని ఏదైనా చేస్తే తాను ఊరుకోనని భద్రావతి తల్లి అనడంతో విశ్వ మాట మార్చేస్తాడు. ఇప్పుడు మనం సంక్రాంతి సంబరాలకు వెళ్లకపోతే అవమానంతో ముఖం చెల్లక సంబరాలకు రాలేదని రామరాజు కుటుంబం గర్వంతో విర్రవీగుతారని విశ్వ అంటాడు. వాళ్లకు అలాంటి అవకాశం ఇవ్వకూడదని ఊరి పెద్దలతో మాటిచ్చానని చెబుతాడు.
భద్రావతికన్వీన్స్...
విశ్వ మాటలు వంద శాతం కరెక్ట్ అని భద్రావతి అంటుంది. ప్రేమ...రామరాజు కొడుకును పెళ్లి చేసుకోవడం వల్ల మన పరువు పోయింది..సంబరాలకు వెళ్లకపోతే రామరాజు ముందు తలదించుకునేవాళ్లం అవుతామని భద్రావతి అంటుంది. రామరాజు మన ముందు తల ఎగరేసుకొని తిరిగే అవకాశం వాడికి ఇవ్వకూడదని, అందుకైనా సంక్రాంతి సంబరాలకు మనం వెళ్లి తీరాల్సిందేనని భద్రావతి అంటుంది. సంక్రాంతి సంబరాలను అడ్డుపెట్టుకొని ధీరజ్‌పై రివేంజ్ తీర్చకోవాలని విశ్వ ప్లాన్ చేస్తాడు. ఇక నా ఆట, వేట మొదలుపెట్టాల్సిందేనని మనసులో అనుకుంటాడు.
నా పెంపకానికి అవమానం...
తన మాటను మీరి ఊరి పెద్దలకు మాటిచ్చిన చందుపై రామరాజు ఫైర్ అవుతాడు. చందు మాటివ్వడం వెనుక ధీరజ్ ఉన్నాడని కనిపెడతాడు. ధీరజ్ వల్లే ఊరి పెద్దలకు చందు మాటిచ్చాడని కోప్పడతాడు.
ధీరజ్, సాగర్ వల్లే సంక్రాంతి సంబరాలకు ఈ ఏడాది వెళ్లకూడదని అనుకుంటున్నట్లు రామరాజు అంటాడు. గుడికి వెళితే మీకు తెలియకుండా మీ ఇద్దరి కొడుకులు ఎలా పెళ్లి చేసుకున్నారు? మీ పెద్ద కొడుకుకు పెళ్లి చేయకుండా చిన్నవాళ్లకు ఎందుకు పెళ్లి చేశారు అని అడుగుతారు? వాళ్లకు ఏమని సమాధానం చెప్పాలి అని రామరాజు అంటాడు. అది నాకు, నా పెంపకానికి అవమానమని రామరాజు కోపంగా చెబుతాడు. నలుగురిలో గౌరవం, మర్యాద పోకుండా ఉండాలంటే గుడికి వెళ్లకపోవడమే మంచిదని చెబుతాడు.
రౌడీలతో డీల్
ధీరజ్‌ను చంపేందుకు రౌడీలతో డీల్ కుదుర్చుకుంటాడు విశ్వ. సంక్రాంతి సంబరాలు ముగిసేలోపు వాడి జీవితం ముగిసిపోవాలని రౌడీలతో చెబుతాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ముగిసింది.