Illu Illalu Pillalu February 15th Episode: మామకు ఎదురు తిరిగిన నర్మద- రామరాజుతో భద్రావతి గొడవ- ధీరజ్‌పై నగల దొంగతనం
Illu Illalu Pillalu Serial February 15th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 15 ఎపిసోడ్‌లో చందు పెళ్లి సంబంధంలో నర్మద కావాలనే తన తండ్రిని అవమానించడానికి చేసిందని సాగర్ కొట్టబోతాడు. అది ఆపిన రామరాజు ఆవేశంగా సాగర్‌ను కొట్టబోతుంటే నర్మద చేయి పట్టుకుని ఎదురుతిరుగుతుంది. అది చూసి అంతా షాక్ అవుతారు.

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చందుకు మరో సంబంధం కూడా క్యాన్సిల్ అయిందని బాధగా వెళ్లిపోతాడు రామరాజు. ఏమైందని ధీరజ్ అడిగితే.. అమూల్య సంబంధం క్యాన్సిల్ అయిందని చెబుతుంది. ఎందుకు అని ధీరజ్ అడిగితే.. వాళ్లు నాన్నని అని అమూల్య చెప్పబోతుంటే.. చందు అడ్డుపడతాడు. ఇప్పుడు అవన్ని అవసరం లేదని చందు చెబుతాడు.
ఎందుకు అర్థం చేసుకోలేదో
వాళ్లు నాన్నగారిని ఏమన్నారు. వదినా మీరు అన్ని చెప్పే కదా పెళ్లి సంబంధం సెట్ చేశారు. ఏమైంది అని అడుగుతాడు ధీరజ్. కానీ, చందు చెప్పనివ్వకుండా వెళ్లిపోమంటాడు అని చందు. అసలు ఏమైంది. వాళ్లు నాన్నను ఏమో అన్నారని చెల్లి అంటుంది అని ఆలోచిస్తాడు ధీరజ్. మరోవైపు కోపంగా ఉంటాడు సాగర్. నేను వాళ్లకు అంతా చెప్పాను. కానీ ఎందుకు అర్థం చేసుకోలేదో నాకు తెలియట్లేదు అని నర్మద వచ్చి చెబుతుంది.
లేదు. ఇదంతా నువ్ కావాలనే చేశావని అనిపిస్తోంది. నీకు మా నాన్న అంటే కోపం. ఎందుకు మన పెళ్లికి ఒప్పుకోలేదని, ఇంట్లో కోడలిగా పూర్తిగా ఒప్పుకోలదేని కోపం ఉంది. అందుకే మా నాన్నకు అవమానించేందుకు దీన్ని వాడుకున్నావ్ అని సాగర్ ఆవేశంతో ఊగిపోతాడు. మన మీదున్న కోపాన్ని పొగొట్టేందుకే ఈ పెళ్లి సంబంధం ఏర్పాటు చేశానని చేస్తే అవమానించడానికని అంటావేంటీ సెన్స్ లేకుండా అని నర్మద అంటుంది.
లేదు నువ్ కావాలనే అవమానించడానికే చేశావ్. వాడితో మా నాన్నకు అనాథ అని పిలిచేలా చేశావ్ అని సాగర్ అంటాడు. మావయ్యకు అవమానం జరిగితే నాకు జరిగినట్లే కదా. అలా నేనేందుకు చేస్తాను. వాళ్లకు అన్ని విషయాలు చెప్పాను. కానీ, వాళ్లు ఇలా అంటారని నాకు తెలియదు. ఇంకోసారి ఇలా నన్ను నిందిస్తే బాగుండదు చెబుతున్నాను అని నర్మద అంటుంది. మా నాన్నను అంతలా అవమానిస్తే బాధలేదుగానీ, నిన్ను రెండు మాటలు అనేసరికి అంటున్నావా. అసలు ఎవరు చూడమన్నారే నిన్ను ఆ దిక్కుమాలిన సంబంధం అని సాగర్ అంటాడు.
కొట్టడం కాదు నరికేయాలి
ఛీ ఛీ.. ఎంత చెప్పిన అర్థం చేసుకోవేంటీ నువ్వు. నీకు అసలు బుద్ధుందా అని నర్మద అంటుంది. దాంతో కోపంగా నర్మదను కొట్టడానికి చేయి ఎత్తుతాడు సాగర్. అప్పుడే అటుగా వచ్చిన రామరాజు రేయ్ అని అంటాడు. దాంతో సాగర్ ఆగిపోతాడు. నువ్ అసలు మనిషివేనా. కట్టుకున్న భార్యపై చేయి ఎత్తడానికి బుద్ధిలేదా అని ఆవేశపడతాడు రామరాజు. నీకు అవమానం జరగడానికి కారణం ఇదే కదా. ఇంకా నాకు బుద్ధిలేదా అంటుంది. దీన్ని కొట్టడం కాదు నరికేయాలి అని సాగర్ అంటాడు.
దాంతో కోపంగా ఏంట్రా వాగుతున్నావ్ అని సాగర్‌పై చేయి ఎత్తుతాడు రామరాజు. మావయ్య అంటూ రామరాజు చేయి పట్టుకుని ఆపుతుంది నర్మద. దాంతో అంతా షాక్ అవుతారు. ఇంత చిన్న విషయానికి ఆయన మీద చేయి ఎత్తుతారు ఏంటీ మావయ్య. మీరింకా కొట్టడానికి ఆయనేం చిన్నపిల్లాడు కాదు. ఆయనకు పెళ్లి అయి భార్య కూడా ఉంది అని నర్మద అంటుంది. ఏ అమ్మాయి. మీ మావయ్యకే ఎదురు చెబుతావా నువ్వు. ఆయన కొడుక్కి బుద్ధి చెప్పే హక్కు లేదా అని వేదవతి అంటుంది.
మీరు చెప్పేది నిజమే. బుద్ధి చెప్పాలి. కానీ, కొడితే ఆయన బాధపడుతారు. అది చెబుతున్నాను అని నర్మద అంటుంది. నువ్వేంత.. నీ వయసెంత. ఆయనకే నీతులు చెబుతున్నావా అని వేదవతి అంటుంది. రేయ్ ఇంకోసారి ఇలా చూస్తే బాగుండదు. రా బుజ్జమ్మ వెళ్దాం అని రామరాజు అంటాడు. చిన్నపెద్దా తేడా లేకుండా మా ఆయనకు ఎదురుతిరిగితే నేను ఊరుకోను గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది వేదవతి.
పెళ్లికి టైమ్ తీసుకుంటాను
ఏంటే అక్కడ మా నాన్నను అవమానించి, ఇక్కడ నాన్న చేయి పట్టుకుంటావా. నువ్ బాగా ఓవర్ చేస్తున్నావే. చెబుతా నీ సంగతి అని కోపంగా వెళ్లిపోతాడు సాగర్. దాంతో కోపంగా పక్కన ఉన్న బిందే తన్నుతుంది నర్మద. మరోవైపు రామరాజును చందు కలుస్తాడు. ఇక సంబంధం చూడకండి. ఆపేయండి. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లికి కొంచెం టైమ్ తీసుకుంటాను అని చెబుతాడు. నీ మాటల వెనుకున్న బాధ ఏంట్రా అని రామరాజు అంటాడు.
బాధ ఏం లేదు నాన్న. నిజంగానే టైమ్ తీసుకుందామనుకుంటున్నాను అని చందు అంటాడు. నా పెద్ద కొడుకు నాకు అబద్ధం చెప్పడు. నా మొహం చూస్తూ చెప్పు నీకు బాధ లేదని అని రామరాజు అంటాడు. ఉంది నాన్నా. ఇంట్లో ఇంతకుముందు సంతోషం ఉండేది. ఇప్పుడు లేదు అదే నాన్న నా బాధ. నా పెళ్లి జరగట్లేదని తమ్ముళ్లు బాధపడుతున్నారు. భార్యభర్తలు గొడవ పడుతున్నారు. నా పెళ్లికోసం ఇంతమంది బాధపడుతున్నారు. అలాంటి నా పెళ్లి నాకెందుకు నాన్న. జీవితాంతం ఇలాగే ఉంటాను అని చందు అంటాడు.
నాకోసం నీ ప్రేమను నీలోనే చంపేసుకున్నావ్. అలాంటి నా కొడుకు పెళ్లి చేయకపోతే నేను తండ్రిగా ఓడిపోయినట్లేగా. చెప్పురా తండ్రిగా నన్ను ఓడిపోమ్మంటావా అని రామరాజు అంటాడు. దాంతో రామరాజును ప్రేమగా హగ్ చేసుకుంటాడు చందు. కాస్తా నాకు టైమ్ ఇవ్వురా. నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. ఎప్పటిలా మన ఇల్లు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని రామరాజు అంటాడు. మరోవైపు ఈ పెళ్లి సంబంధం కాన్సిల్ అవ్వడానికి కారణం మీవాళ్లే అయింటారు అని ప్రేమతో ధీరజ్ అంటాడు.
అరిసెలను తిన్న నర్మద
మీరే మావాళ్లపై అసూయతో రగిలిపోతున్నారు. అపార్థంతో బతుకుతున్నారు అని ప్రేమ అంటుంది. మమ్మల్ని ఎప్పుడు ఎలా బాధపెట్టాలా అని గోతికాడ నక్కల్లా చూస్తున్నారు అని ధీరజ్ అంటాడు. ఈ పెళ్లి సంబంధం చూసింది మీ వాళ్లు. అది సరిగ్గా మాట్లాడలేదని తెలుస్తోంది. మళ్లీ మమ్మల్ని అంటావేంట్రా అని ప్రేమ అంటుంది. మరోవైపు కిచెన్‌లో అన్ని కోపంగా విసిరేసిన నర్మద అరిసెలను కోపంగా తింటుంది. అది చూసి షాక్ అవుతుంది వేదవతి.
అలా చూడకండి దిష్టి తగులుతుంది. కావాలంటే తినండి అని నర్మద అంటుంది. అక్కడ అంత గొడవ పెట్టుకుని ఇక్కడ అరిసెలు తింటున్నావా అని ఆశ్చర్యంగా అంటుంది వేదవతి. మరోవైపు మీ వాళ్లలాగే నీకు ఒళ్లంతా పొగరే.. అందుకే ఆ కల్యాణ్ గాడు పారిపోయాడు అని ధీరజ్ అరుస్తుంటాడు. అది విన్న వేదవతి అయ్యో మళ్లీనా అని ధీరజ్ రూమ్ వైపు వస్తుంది వేదవతి, నర్మద. ధీరజ్ తలుపు కొడతారు. దాంతో ధీరజ్, ప్రేమ ఆగిపోతారు.
ప్రేమ వెళ్లి తలుపు తీస్తుంది. వేదవతిని లోపలికి లాక్కుని తలుపు పెడుతుంది ప్రేమ. కొంచెం ఉంటే ముక్కు పగిలిపోయేది అని నర్మద వెళ్లిపోతుంది. ఏంట్రా ఇది. మీరు ఇలా గొడవ పడటం మీ నాన్న చూస్తే కొంపలు అంటుకుంటాయి. దాని వల్ల పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయి అని వేదవతి అంటుంది. నీ మంచికోసం ఆలోచించి ఈ పెళ్లి చేసింది మా అమ్మ. అది మా ఇంటికి శాపమైంది. మీవాళ్లు మా మీద పగబట్టి మా అన్నయ్యకు సంబంధం కుదరనివ్వట్లేదు అని ధీరజ్ అంటాడు.
ఓదార్చిన నర్మద
ఇంకో మాట వస్తే చెంప పగులుతుందిరా. ప్రేమ నీకు కూడా చెబుతున్నాను. ఇద్దరు నోరుమూసుకుని ఉండండి. జరిగిపోయినా వాటి గురించి గొడవ పడితే మర్యాదగా ఉండదు అని వెళ్లిపోతుంది వేదవతి. బాధపడకండి అరిసెలు తినండి అని నర్మద వస్తుంది. వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాధపడకుండా ఎలా ఉండను. ఒకవైపు పెద్దోడికి పెళ్లి సెట్ కాలేదని, మరోవైపు వాళ్లు ఎలా ఒక్కటవుతారో అని వేదవతి అంటుంది.
బావగారికి మంచి అమ్మాయి దొరుకుతుంది, ధీరజ్-ప్రేమ కలిసిపోతారు. అన్ని చేయడానికి మీరున్నారు కదా. మీ వెనుక నేనున్నాను కదా అని నర్మద అంటుంది. చాల్లే అని ఇద్దరు మురిసిపోతారు. మరుసటి రోజు ఉదయం తన చేయిని నర్మద ఆపడం తలుచుకుంటాడు రామరాజు. టిఫిన్ చేయమని వేదవతి వచ్చి చెబుతుంది. ఇంతలో వస్తుంటే రామరాజుకు చెక్క ముక్క గుచ్చుకుంటుంది. దాంతో నడవలేకపోతాడు రామరాజు.
రామరాజును కూర్చొబెడుతుంది వేదవతి. అందరిని పిలుస్తుంది వేదవతి. ముల్లు తీయాడానికి ఒకరినొకరు అనుకుంటారు అక్కా చెల్లెళ్లు. నాన్నను హాస్పిటల్‌కు తీసుకెళ్దాం అని అమూల్య అంటుంది. ఏదో యాక్సిడెంట్ అయి ఐసీయూకు తీసుకెళ్లాలన్నట్లుగా చేస్తున్నారు అని రామరాజు అంటాడు. ఇంతలో వచ్చిన నర్మద రామరాజు కాళ్లు తనపై పెట్టుకుని ముల్లు తీస్తుంటుంది.
రామరాజుతో భద్రావతి గొడవ
మావయ్య గారు మా నాన్న మాల వేసుకున్నప్పుడు చెప్పులు లేకుండా నడుస్తారు. అప్పుడు ముల్లు గుచ్చుకుంటే నేనే తీస్తాను. కాబట్టి నాకు ముల్లు తీయడం రాదని మీరేం ఆలోచించకండి అని నర్మద అంటుంది. దాంతో రామరాజు అరవకుండా ఉంటాడు. అది చూసి వేదవతి మురిసిపోతుంది. తర్వాత రామరాజు మీదకు భద్రావతి గొడవకు వస్తుంది. ధీరజ్ ప్రేమతో పాడు ఏడు వారాల నగలు కూడా తీసుకెళ్లాడని ఫైర్ అవుతుంది.
అప్పుడే వచ్చిన ధీరజ్‌ను రామరాజు నిలదీస్తాడు. దాంతో తీసుకెళ్లినట్లు అబద్ధం చెబుతాడు ధీరజ్. మరి చూస్తావేంట్రా వెళ్లి వాళ్ల నగలు వాళ్లకు ఇచ్చేయ్ అని రామరాజు అంటాడు. దాంతో ధీరజ్, ప్రేమ షాక్ అవుతారు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్