Illu Illalu Pillalu February 10th Episode:చందుకి శాపంగా తమ్ముళ్లు- నర్మదను తప్పుబట్టిన సాగర్- అన్న కాళ్లపై పడిన చిన్నోడు
Illu Illalu Pillalu Serial February 10th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 10 ఎపిసోడ్‌లో అన్న పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందని తండ్రిని సాగర్ అడుగుతాడు. దానికి కారణం మీరిద్దరే, మీరు లేచిపోయి పెళ్లి చేసుకోవడమే అని రామరాజు కుమిలిపోతాడు. దాంతో నువ్ నర్మదను సాగర్, ప్రేమను ధీరజ్ తప్పుబడతారు.

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రామరాజుకు అమ్మాయి తండ్రి కాల్ చేసి సంబంధం క్యాన్సిల్ చేస్తాడు. దాంతో రామరాజు కుంగిపోతాడు. అటువైపు సాగర్-నర్మద, ధీరజ్-ప్రేమ రొమాంటిక్ పోజులు పెడుతూ ఫొటోలు దిగుతుంటారు. మీ ఇద్దరు అబ్బాయిలు లేచిపోయి పెళ్లి చేసుకున్నారట కదా. అది చెప్పలేదు కదా. అందుకే పెళ్లి వద్దనుకుంటున్నాం అని అమ్మాయి తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు రామరాజు.
దంపతుల ఫొటోలు కూడా తీస్తే
ఇంతలో రామరాజును చూసిన మామ.. బావొచ్చాడు.. బావొచ్చాడు అనుకుంటూ రామరాజు దగ్గరికి వెళ్తాడు. పెళ్లి సంబంధం ఓకే అయినట్లేగా. ముహుర్తాలు పెట్టుకోడమే ఆలస్యమే కదా. పెద్దోడి పెళ్లికి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయిద్దామని నేనే ఫొటోషూట్ పెట్టించాను. ఎలా ఉంది బావ నీ బామ్మర్ది క్రియేటివిటీ. పోలా.. అదిరిపోలా.. మీరు కూడా రండి బావా. మీ ఆది దంపతుల ఫొటోలు కూడా తీయిస్తే ఒక పని అయిపోతుంది. మీది ఒక సోలో ఫొటో తీయిద్దాం. ఇలా తొడకొట్టి, మీసం తిప్పి.. రండి బావా.. అంటూ మామ కామెడీ చేస్తాడు.
దానికి కోపంగా బామ్మర్దిని కొడతాడు రామరాజు. అది చూసి అంతా షాక్ అవుతారు. వెనుక నుంచి చూస్తున్న భద్రావతి.. రేయ్ రామరాజు. నీ పెద్ద కొడుకు పెళ్లి కోసం నువ్ చేసే ప్రతి ప్రయత్నాన్ని నేను ఇలాగే అడ్డుకుంటాను. నీ పెద్ద కొడుక్కి పెళ్లి జరగనివ్వను. ఈ బాధ నుంచి నిన్ను జీవితాంతం దూరం కానివ్వను అని భద్రావతి అనుకుంటుంది. నొప్పితో మామ బాధపడుతుంటాడు. అంతా ఇంట్లోకి వెళ్తారు. రామరాజు బాధగా నిల్చుని ఉంటాడు.
ఇంతలో చందు వచ్చి ఏమైందని అడుగుతాడు. నన్ను క్షమించురా పెద్దోడా. నీకు పెళ్లి సంబంధం కుదుర్చలేకపోయాను అని రామరాజు అంటాడు. అయ్యో మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటీ. అసలు ఏమైంది అని చందు అంటాడు. నీకు మంచి సంబంధం చూశాను. నువ్ జీవితాంతం సంతోషంగా ఉంటావనుకున్నా. కానీ, ఆ సంబంధం కుదిరినట్లే కుదిరి ఆగిపోయింది అని రామరాజు అంటాడు. అది కాకుంటే మరో సంబంధం రాదా. దీనికే బాధపడాలా అని చందు అంటాడు.
మీరిద్దరే కారణం
మీ నాన్న బాధకు కారణం వేరే ఉంది. వాళ్లు ముందు ఒప్పుకుని ముహుర్తాలు పెట్టుకుందామన్నారు. కానీ, ఇంటికి వచ్చేలోపే క్యాన్సిల్ అన్నారు. ఒప్పుకుని రద్దు చేయడం అని బాధపడుతున్నారు అని వేదవతి అంటుంది. వాళ్లేం అనుకుంటున్నారు. నాటకాలు ఆడుతున్నారా. అయినా మీరు గట్టిగా అడగాల్సింది అమ్మా అని సాగర్ అంటాడు. నీకు కారణం కావాలా. పెద్దోడికి బంగారం లాంటి సంబంధం ఫిక్స్ అయి క్యాన్సిల్ అవ్వడానికి కారణం నువ్వు, వాడు, మీరిద్దరే అని రామరాజు కోపంగా చెబుతాడు.
నేను, చిన్నోడు కారణం ఏంటీ అని సాగర్ అయోమయంగా అంటాడు. మీ పెళ్లిళ్లే కారణంరా.. పద్ధతి ప్రకారం ముందు పెద్దోడికి పెళ్లి కావాలి. మీ స్వార్థం మీరు చూసుకున్నారు. మీ పెళ్లిళ్లు మీరు చేసుకుని పెద్ద ఘనకార్యం చేశారు. తండ్రికి చెప్పకుండా ఇద్దరు కొడుకులు లేచిపోయి పెళ్లి చేసుకున్నారంటేనే అర్థం అవుతుందయ్యా అని అవమానించార్రా. ఇక మీ పెద్దోడు ఎలాంటోడో, మీ ఇంటికి పంపించలేమయ్యా అంటు నన్ను, నా పెంపకాన్ని చాలా నీచంగా మాట్లాడారు అని రామరాజు ఆవేశంగా అంటాడు.
కారణం చెప్పానుగా. ఇప్పుడు చెప్పండిరా ఏం చేయమంటారు. మీ ఇద్దరి ముందు వీడు గుణవంతుడు అంటే ఎవరు నమ్ముతార్రా. ప్రతిక్షణం వాడు మీ గురించే ఆరాటపడేవాడు. అంత ప్రేమను పంచిన మీ అన్నయ్యకు గొప్ప బహుమతిని ఇచ్చార్రా. తమ్ముళ్లే అన్నయ్య జీవితానికి శాపంగా మారారు కదరా ఛీ.. అని అసహ్యించుకుంటాడు రామరాజు. ఏదోక సంబంధం కుదురుతుందిలెండి. వాళ్లు నా కారణంగా బాధపడితే చూడలేను అని చందు అంటాడు.
ఇలాంటి ప్రశ్నలే
చూశాడురా వాడేమంటున్నాడో. ఇంకెవరి అయినా ఉంటే మీ వల్లే నా సంబంధం పోయిందని అనేవాడురా. కానీ, మీరు మాత్రం ఒక్క నిమిషం ఆలోచించలేకపోయారు అని రామరాజు అంటాడు. ఒక్క సంబంధానికే మీరు ఇంతలా బాధపడతారేంటీ అని చందు అంటే.. కాదురా ప్రతి సంబంధానికి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతే. ఎవరు ముందుకురాకపోతే. ఈ ఆలోచన, ఈ భయం నన్ను నిలువునా కాల్చేస్తున్నాయి అని రామరాజు కుమిలిపోతాడు.
అంతా వెళ్లిపోతారు. సాగర్, ధీరజ్ మాత్రం దోషుల్లా మిగిలిపోతారు. తర్వాత తండ్రి అన్న మాటలు తలుచుకుని సాగర్ ఏడుస్తుంటాడు. అది చూసిన నర్మద ఏమైందని అడుగుతుంది. మనం పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది అని సాగర్ అంటే నర్మద షాక్ అవుతుంది. నేను తప్పు చేశాను. అన్నయ్యకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశాను అని సాగర్ అంటాడు. మనం ఉన్న పరిస్థితుల్లో ఆ మార్గం తప్పా ఇంకేముంది చెప్పు అని నర్మద అంటుంది.
నిజమే, కానీ, నా పెళ్లి మా అన్నయ్య జీవితానికి సమస్యగా మారుతుందని నేను ఆలోచించలేకపోయాను. మా నాన్న పడిన బాధను చూస్తే నా ప్రాణం విలవిల్లాడిపోయింది. నా గుండె ఆగిపోయినట్లు అయింది. ఆరోజు నువ్ మా ఇంటికి వచ్చి కంగారుపెట్టేసావ్. పొరపాటు చేశావ్. చాలా పెద్ద పొరపాటు చేశావ్. మా అన్నయ్య పెళ్లి అయ్యేవరకు మనం ఆగాల్సింది అని సాగర్ నర్మదను నిందిస్తాడు. మా అన్నయ్య సంతోషం కోసం ఏదో ఒకటి చేయాలి అని సాగర్ అంటాడు.
ప్రేమపై విరుచుకుపడిన ధీరజ్
మా అన్నయ్యకు పెళ్లి కాకుండా మా నాన్న జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. దీనికి కారణం నేనే అని జీవితాంతం పశ్చాత్తాపం పడాల్సిందే. నేను కొడుకుగా ఓడిపోయాను. తమ్ముడిగా కూడా ఓడిపోతానేమో అని కూర్చుండి కన్నీళ్లు పెట్టుకుంటాడు సాగర్. నర్మద కూడా బాధపడుతుంది. మరోవైపు ధీరజ్ కూడా తండ్రి మాటలు తలుచుకుంటూ కోప్పడతాడు. వస్తువలన్నీ ఎత్తేస్తాడు. ఇంతలో ప్రేమ వస్తే.. నీ వల్లే.. అంత నీవల్లే. మా అన్నయ్య పెళ్లి క్యాన్సిల్ కావడానికి కారణం నీ వల్లే.. నీ వల్లే అని కోపంగా విరుచుకుపడతాడు అంటాడు ధీరజ్.
నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే. నువ్ ఆ కల్యాణ్ గాడితో వెళ్లిపోయిన విషయం ఎవరికీ తెలియదు. నేను నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో కూడా ఎవరికి తెలియదు. కానీ, ఈ లోకం దృష్టిలో నేను మాత్రం నిన్ను లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాను. ఆ కారణంతోనే కదా మా అన్నయ్య సంబంధం క్యాన్సిల్ అయింది. నీకు తాళి కట్టకుంటే ఆ పెళ్లి ఆగిపోయేది కాదు కదా. దానికి నువ్వే కదా కారణం అని ధీరజ్ అంటాడు. వాళ్లు మీ సాగర్ అన్నయ్య కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవడం కూడా కారణమే కదా అని ప్రేమ అంటుంది.
ఒక కొడుకు చేసుకుంటే సరేలే అని వదిలేస్తారు. ఇంకో కొడుకు కూడా లేపుకెళ్లి చేసుకున్నాడనే కదా మా నాన్న పెంపకాన్ని తప్పుబట్టారు. అంతా నీవల్లే అని ధీరజ్ అంటాడు. ఇంకోసారి నావల్లే అంటే ఊరుకోను. నీ వల్లే ఇలా అయిపోయాను అని రోజు రోజు విని విరక్తి వస్తుంది. ఎవరు కట్టమన్నార్రా. నేను తాళి కట్టమని అడిగానా. నీ కాళ్లు పట్టుకుని బతిమిలాడానా. నాకు ఇష్టం లేకుండా నువ్వే బలవంతంగా తాళి కట్టావ్. తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేశావ్. కానీ, నా కారణంగా నీ జీవితం నాశనం అయినట్లు రోజు వేపుకు తింటున్నావ్ అని ప్రేమ అంటుంది.
నేనే ఉరేసుకున్నా
నీకు తాళి కట్టి నా మెడకు నేనే ఉరివేసుకున్నాను. నేను నిన్ను కాపాడానే అని ధీరజ్ అంటాడు. ఇంకోసారి కాపాడాను అంటే చెంప పగులకొడతాను అని ప్రేమ అంటుంది. హే కాపాడానే. నేను నీకు తాళి కట్టకుంటే ఉంటే చచ్చిండేదానివి అని ధీరజ్ అంటాడు. ఇప్పుడు కూడా చస్తున్నాను. ఈ నరకం కంటే ఆరోజు నేను చచ్చింటే బాగుండేది అని ప్రేమ అంటుంది. అవును, నువ్ చచ్చుంటే ఈ పరిస్థితి, మా నాన్న కంట తడి పెట్టాల్సిన అవసరం వచ్చుండేది కాదు అని ధీరజ్ వెళ్లిపోతాడు.
అయినా నాకేంటీ కర్మ. వీడితో నేను మాటలు పడటం ఏంటీ అని ప్రేమ అనుకుంటుంది. మరోవైపు చందు దగ్గరికి వచ్చిన ధీరజ్, సాగర్ సారీ చెప్పి క్షమించమని అడుగుతారు. మా పెళ్లిళ్ల వల్ల నీ జీవితానికి శాపంగా మారాయి. మమ్మల్ని క్షమించు అని సాగర్ అంటాడు. ఊరుకోరా అని చందు అంటాడు. మీ ఇద్దరి కన్నీళ్లు మమ్మల్ని బాధతో కాల్చేస్తున్నాయి. ఇది మా వల్ల కావట్లేదు అని ధీరజ్ అంటాడు. చందు ఊరుకోమ్మని చెబుతాడు.
కాళ్లమీద పడిన ధీరజ్
ఏం చేయలేని నిస్సహాయుల్లా మిగిలిపోయాం అని చెప్పిన ధీరజ్ అన్న చందు కాళ్లపై పడతాడు. ధీరజ్ కాలేజ్‌కు వెళ్తుంటే.. ప్రేమను కూడా తీసుకెళ్లమని వేదవతి ఆర్డర్ వేస్తుంది. ధీరజ్ బైక్‍పై ప్రేమ ఎక్కుతుంది. అప్పుడే భద్రావతి ఇంట్లో వాళ్లందరూ వాళ్లను చూస్తుంటారు. ఇప్పుడే వస్తాను అని వేదవతి లోపలికి వెళ్తుంది. తండ్రి, అత్త, అన్నను చూసి భయంతో బైక్ దిగుతుంది ప్రేమ. విశ్వ కోపంతో రగిలిపోతుంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్