Illu Illalu Pillalu January 31st Episode: విశ్వ చెంప పగలగొట్టిన వేదావతి -భర్తను కాపాడుకున్న ప్రేమ - ధీరజ్ అబద్దం
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 31 ఎపిసోడ్ విశ్వ ఎటాక్ నుంచి ధీరజ్‌ను కాపాడిన ప్రేమ...భర్తను హాస్పిటల్‌కు తీసుకొస్తుంది. ధీరజ్ హాస్పిటల్ పాలైన సంగతి సాగర్‌కు చెబుతుంది. ధీరజ్‌పై విశ్వ ఎటాక్ చేశాడనే నిజం తెలిసి సాగర్, చందు కోపంతో రగిలిపోతారు.
జాతరలో రౌడీలకు దొరికిపోతాడు ధీరజ్. అతడిని విశ్వ చంపబోతుండగా ప్రేమ కాపాడుతుంది. మరోవైపు రాత్రయినా ధీరజ్, ప్రేమ ఇంటికి రాకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వేదావతి కంగారుపడుతుంది. కొడుకు, కోడలికి జరగరానిది ఏదయినా జరిగిందని భయపడుతుంది.
ధీరజ్ వల్ల అవమానాలు...
ధీరజ్‌కు వల్ల నాకు బాధలు, అవమానాలు ఎదురవ్వడం తప్ప వాడికి మాత్రం ఏం కాదని రామరాజు అంటాడు. గుడిలో తనకు అవమానం జరగడానికి ధీరజ్ కారణమని నిందిస్తాడు. ప్రేమను ధీరజ్ పెళ్లి చేసుకోవడం వల్లే ఊరందరి ముందు తాను పరువు పోగొట్టుకొని గుడిలో హారతి ఇవ్వకుండా రావాల్సివచ్చిందని కోప్పడుతాడు. ఎదురింటితో మనకు శత్రుత్వం ఉందని తెలిసి, వాళ్లు తనను అవమానిస్తారని తెలిసి కూడా ప్రేమను ధీరజ్ పెళ్లి చేసుకున్నాడని వేదావతితో రామరాజు అంటాడు.
పరువు నిలబెట్టడానికే...
ధీరజ్‌కు మీరంటే ప్రాణమని, మీ పరువు నిలబెట్టడానికే ప్రయత్నిస్తాడని వేదావతి కొడుకును వెనకేసుకొని వస్తుంది. నీ భర్త అడుగడుగునా తలదించుకోవడం కళ్లారా చూసి కూడా ధీరజ్‌ను వెనకేసుకొని రావడం బాధను కలిగిస్తుందని భార్యతో అంటాడు రామరాజు. తండ్రికి అవమానం జరిగిందన్న ఆనందంలో ధీరజ్ ఎక్కడో షికార్లు చేస్తుంటాడని చెప్పి రామరాజు వెళ్లిపోతాడు. తన వల్లే చేయని తప్పుకు ధీరజ్ శిక్షను అనుభవిస్తున్నాడని, మీ ద్వేషాన్ని అనుభవిస్తున్నాడని వేదావతి ఎమోషనల్ అవుతుంది.
ధీరజ్ సేఫ్...
గాయాలతో స్పృహ కోల్పోయిన ధీరజ్‌ను హాస్పిటల్‌కు తీసుకొని వస్తుంది ప్రేమ. ధీరజ్‌కు ఏమవుతుందోనని టెన్షన్ పడుతుంది. ధీరజ్ ప్రాణాలకు ప్రమాదమేమి లేదని డాక్టర్లు చెప్పడంతో ప్రేమ రిలీఫ్‌గా ఫీలవుతుంది. ఉదయం డిశ్చార్జ్ చేస్తామని, అప్పటివరకు ధీరజ్‌తో తోడుగా ఉండాలని ప్రేమతో డాక్టర్ అంటాడు.
ప్రేమ కన్నీళ్లు...
హాస్పిటల్ బెడ్‌పై బ్యాండేజ్‌లతో ఉన్న ధీరజ్‌ను చూసి ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అతడి చేతిని పట్టుకోబోయి ఆగిపోతుంది. ధీరజ్ హాస్పిటల్‌లో ఉన్న సంగతి ఫ్యామిలీ మెంబర్స్‌కు చెప్పాలని అనుకుంటుంది. ఆమె దగ్గర ఫోన్ లేకపోవడం ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. ధీరజ్ ఫోన్ తీసుకొని సాగర్‌కు ఫోన్ చేస్తుంది.
సాగర్ టెన్షన్...
ధీరజ్ ఫోన్ చేశాడని అనుకున్న సాగర్...నువ్వు ప్రేమ ఎక్కడికి వెళ్లారు..ఎందుకు ఇంటికి రాలేదు. మీ గురించి మేమంతా చాలా టెన్షన్ పడుతున్నామని అంటాడు. తాము హాస్పిటల్‌లో ఉన్నామని ప్రేమ చెప్పడంతో సాగర్ షాకవుతాడు. జరిగింది మొత్తం సాగర్‌కు చెబుతుంది ప్రేమ. ఆమె చెప్పింది వినగానే సాగర్ భయపడిపోతాడు. సాగర్ ముఖంలోని టెన్షన్ చూసి నర్మదకంగారు పడుతుంది. నర్మదకు నిజం చెప్పకుండా ఇప్పుడే వస్తానని చందును తీసుకొని హాస్పిటల్‌కు బయలుదేరుతాడు సాగర్.
ప్రాణం పోతున్నట్లుగా....
ఒంటినిండా గాయాలతో హాస్పిటల్ బెడ్‌పై పడి ఉన్న ధీరజ్‌ను చూసి సాగర్, చందు ఎమోషనల్ అవుతారు. నిన్ను ఇలా దెబ్బలతో చూస్తుంటే ప్రాణం పోతున్నట్లుగా ఉందని, నువ్వు హాస్పిటల్‌లో ఉన్నావని తెలియగానే భయంతో ఊపిరి ఆడలేదని చందు అంటాడు. తనకు ఏం కాలేదని, ఏడవద్దని ధీరజ్ అంటాడు.
నిజం దాచిన ధీరజ్...
అసలు ఏం జరిగింది, నీపై ఎటాక్ చేసింది ఎవరు అని ధీరజ్‌ను అడుగుతాడు చందు. ఎవరు నిన్ను కొట్టింది ఇప్పుడే తెలియాలని అంటారు. తెలియదని ధీరజ్ అంటాడు. విశ్వ తనపై ఎటాక్ చేశాడనే నిజం దాచిపెడతాడు. వాళ్లను ఇంతకుముందు చూడలేదని చెబుతాడు. నిన్ను ఇంత భయంకరంగా కొట్టారంటే నీపై కోపంతో, పగతో చేశారని అర్థమవుతుందని, దీని వెనుక ఎవరో మన శత్రువులు ఉన్నారని చందు అంటాడు.
విశ్వ అంతు చూస్తా...
మా అన్నయ్య విశ్వనే ధీరజ్‌ను కొట్టాడనే నిజం ప్రేమ బయటపెడుతుంది. నీ ప్రాణాలు తీయాలని చూసిన వాడిని వదిలిపెట్టేది లేదని, ఇప్పుడే విశ్వ అంతు చూస్తామని చందు కోపంగా అంటాడు. విశ్వను చంపాల్సిందేనని అంటాడు.
నాన్న కోసమే...
విశ్వను వదిలేయమని, గొడవలు వద్దని ధీరజ్ అంటాడు. నాన్నకోసమే విశ్వను ఏం చేయవద్దని అంటాడు. మీరు విశ్వను కొడితే నాన్నకు ఇంకా నా మీద కోపం పెరుగుతుందని చందు, సాగర్‌లతో చెబుతాడు ధీరజ్. నా కారణంగా మన రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం ఇంకా పెరిగిందని, అమ్మ తన పుట్టింటికి శాశ్వతంగా దూరమైందని నాన్న బాధపడుతున్నారు. మీరు వెళ్లి విశ్వతో గొడవపడితే నాన్న ఇంకా బాధపడతాడని, నాన్నకు నాపై ఉన్న కోపం మరింత పెరుగుతుందని ధీరజ్ అంటాడు.
నా కారణంగా నాన్న ఇంకా బాధపడే పరిస్థితి రావద్దని గొడవలు వద్దని అంటున్నానని అన్నయ్యలకు సర్ధిచెబుతాడు ధీరజ్.
నిజం తెలుసుకున్న నర్మద…
సాగర్‌కు నర్మద ఫోన్ చేస్తుంది. ధీరజ్‌పై విశ్వ ఎటాక్ చేసిన సంగతి నర్మదకు చెబుతాడు సాగర్. ఆ మాట వినగానే నర్మద షాకవుతుంది. హాస్పిటల్ నుంచి ధీరజ్‌ను ఇంటికి తీసుకొనివస్తారు సాగర్, చందు.
విశ్వ ఎటాక్ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పొద్దని మరోసారి అన్నయ్యలతో అంటాడు ధీరజ్. అమ్మకు ఏం చెప్పాలో, ఎలా ఓదార్చాలో తెలియడం లేదని సాగర్ అంటాడు.
నోరుజారిన ధీరజ్
ధీరజ్‌ను చూడగానే వేదావతి కంగారు పడుతుంది. ఒంటినిండా దెబ్బలు ఏమిటి? ఏం జరిగింది అని కొడుకును అడుగుతుంది. ఏం చెప్పాలో తెలియక గొడవ జరిగిందని నోరు జారుతాడు ధీరజ్. గొడవ ఏంటని వేదావతి కొడుకులను నిలదీస్తుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ముగిసింది.