Illu Illalu Pillalu Serial: రామరాజుపై భద్రావతి పగ - ధీరజ్‌ను బావ అని పిలిచిన విశ్వ - శారదాంబ ఆనందం
Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 23 ఎపిసోడ్‌లో కూతురు ప్రేమ కళ్ల ముందే ఉన్నా తనతో మాట్లాడలేని పరిస్థితి రావడంతో సేనాపతి, రేవతి కన్నీళ్లు పెట్టుకుంటారు. తమ కుటుంబంపై పగ తీర్చుకోవడానికే ధీరజ్‌కు, ప్రేమకు రామరాజు పెళ్లి చేశాడని భద్రావతి కోపంతో రగిలిపోతుంది.
Illu Illalu Pillalu Serial: సంక్రాంతి సంబరాల కోసం కుటుంబంతో కలిసి గుడికి వస్తాడు రామరాజు. కుటుంబసభ్యుల పేర అర్చన చేయిస్తాడు. ధీరజ్, ప్రేమ పేర్లు మాత్రం పూజారికి చెప్పడు. తండ్రిపై తనకున్న ద్వేషం ప్రేమగా మారే రోజు రావాలని ధీరజ్ దేవుడిని వేడుకుంటాడు. అంతులేని ప్రేమను చూపించిన కుటుంబసభ్యులు తనను ద్వేషించడం ప్రేమ తట్టుకోలేకపోతుంది.

కళ్యాణ్‌ను నమ్మి మోసపోయిన తనకు ఎందుకు ఈ శిక్ష విధించావని దేవుడితో తన బాధను చెప్పుకుంటుంది. ఇష్టం లేని వ్యక్తితో జరిగిన పెళ్లి కారణంగా తన జీవితం శూన్యంగా మారిపోయిందని బాధపడుతుంది. తన కుటుంబసభ్యులు తనతో మాట్లాడేలా చేయమని దేవుడితో తన బాధను చెప్పుకుంటుంది.
సేనాపతి కన్నీళ్లు...
ప్రేమ కళ్ల ముందు ఉన్నా కూతురితో మాట్లాడలేని పరిస్థితి ఉండటంతో సేనాపతి, రేవతి కన్నీళ్లు పెట్టుకుంటారు. కూతురుని కళ్లల్లో పెట్టి పెంచుకున్నందుకు తను ఇచ్చిన బహుమానం ఈ కన్నీళ్లు అని సేనాపతి అంటాడు. . కూతురు కళ్ల ముందు ఉన్నా మాట్లాడలేకపోవడం కంటే పెద్ద శిక్ష ఏది ఉండదని అంటాడు. రామరాజు పగతోనే ప్రేమను ధీరజ్‌కు ఇచ్చి పెళ్లి చేసి మనపై ప్రతీకారం తీర్చుకున్నాడని కోపంతో భద్రావతి రగిలిపోతుంది.
బావ మరదళ్లు...
భద్రావతి మాటల్ని శారదాంబ తప్పుపడుతుంది. ఎంత కాదనుకున్న ధీరజ్, ప్రేమ బావమరదళ్లని, ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అంటుంది. ప్రేమ మంచి ఇంటికి కోడలిగా వెళ్లిందని, మన కంటే వాళ్లు ఇంకా బాగా ప్రేమను చూసుకుంటారని శారదాంబ అంటుంది. తల్లి మాటలతో భద్రావతి కోపం పట్టలేకపోతుంది. దిక్కుమొక్కులేని అనాథ ఇంటికి కోడలిగా వెళ్లడం మంచి ఎలా అవుతుందని ఫైర్ అవుతుంది. మోసగాడు అంటూ రామరాజుపై నిందలు వేస్తంది.
కళ్ల ఎదురుగా ఉన్నా....
ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు కళ్లెదురుగా ఉన్నా నోరు తెరిచి మనసారా ఒక్క మాట కూడా మాట్లాడలేనందుకు పాతికేళ్లుగా ఎంత ఏడుస్తున్నానో నాకు మాత్రమే తెలుసునని, వేదావతి చేసిన పనికి తన గుండెలు బండరాయిగా మార్చుకొని చెల్లిపై మనసులో ఉన్న ప్రేమను చంపుకొని బతుకుతున్నానని భద్రావతి అంటుంది.
సంక్రాంతి ముగిసేలోపు...
ఇన్నాళ్లు చెళ్లెలు మాట్లాడే పరిస్థితి లేదని నరకం అనుభవిస్తున్నాం...ఇప్పుడు కన్న కూతురు విషయంలో అలాంటి బాధే ఎలా అనుభవించాలని సేనాపతి బాధపడతాడు.
ప్రేమ త్వరలోనే మన ఇంటికి వస్తుందని, సంక్రాంతి ముగిసేలోపు తనను ఇంటికి తీసుకొస్తానని తండ్రికి మాటిస్తాడు విశ్వ. విశ్వ మాటలు కొత్తగా ఉండటంతో రేవతి కంగారు పడుతుంది. రామరాజు కుటుంబంతో ఎలాంటి గొడవ పెట్టుకోవద్దని చెబుతుంది. చెల్లెలు వస్తుంది అంతే అని చెప్పి నిజం దాచేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు విశ్వ.
అలిగిన సాగర్...
గాజులు కొనివ్వమని సాగర్‌ను బతిమిలాడుతుంది నర్మద. తాను రానని, నువ్వే వెళ్లి కొనుక్కోమని సాగర్ కోపంగా బదులిస్తాడు. శోభనం ఆలస్యం చేయడం వల్లే సాగర్ కోపంగా ఉన్నాడని నర్మద అర్థం చేసుకుంటుంది. చందు పెళ్లి సమస్య అవుతుందని రామరాజు చెప్పిన మాటల వల్లే శోభనం పోస్ట్‌పోన్ చేయాల్సివస్తుందని నర్మద మనసులో అనుకుంటుంది. కానీ సాగర్ తనపై అలగడం తట్టుకోలేకపోతుంది. భర్తను బుజ్జగిస్తుంది. చందు, తిరుపతి కూడా సాగర్‌ను కోపాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తారు. నర్మద బతిమిలాడటంతో సాగర్ ఆమె వెంట వెళతాడు.
నూరేళ్లు బతకాల్సిందే...
కొత్త జంట ధీరజ్, ప్రేమ చేత పూజ చేయించాలని వేదావతి అనుకుంటుంది. పూజలు చేయడం తనకు ఇష్టం లేదని ప్రేమ అంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరిద్దరు భార్యాభర్తలని, కలిసి నూరేళ్లు బతకాల్సిందేనని వేదావతి అంటుంది. ధీరజ్‌తో కలిసి పూజలు చేయడం తనకు ఇష్టం లేదని ప్రేమ కోప్పడుతుంది. ధీరజ్ కూడా అదే మాట చెబుతాడు. మీ మొండితనం, మూర్ఖత్వంతో జీవితాల్ని బలి చేసుకోవద్దని ఇద్దరికి వేదావతి క్లాస్ ఇస్తుంది.
ధీరజ్, ప్రేమ ఇద్దరితో కలిసి పూజ చేయిస్తుంది. ఇష్టం లేకపోయినా వేదావతి మాటల కాదనలేక ఇద్దరు పూజలో కూర్చుంటారు. పూజలో ఒకరికి మరొకరు బొట్టు పెట్టుకోమని పూజారి అంటాడు. పూజారి మాట కాదనలేక అతడు చెప్పినట్లు చేస్తారు. ఒకరికొరు కంకణం కట్టుకొని దండలు మార్చుకుంటారు.
వారధిగా పెళ్లి...
ధీరజ్‌తో కలిసి ప్రేమ పూజలో కూర్చోవడం చూసి సేనాపతి, భద్రావతి కోపంతో రగిలిపోతారు.శారదంబ, రేవతి మాత్రం ఆనంద పడతారు. గొడవలు సమసిపోయి రెండు కుటుంబాలు కలిసిపోవడానికి ధీరజ్, ప్రేమ పెళ్లి ఓ వారధిగా నిలవాలని దేవుడిని వేడుకుంటుంది వేదావతి.
ధీరజ్‌పైఎటాక్...
పూజ ముగించుకొని గుడి బయటకు వస్తాడు ధీరజ్. అతడిని బావ అని పిలిచిన విశ్వ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతాడు. విశ్వ పిలుపులతో ఏదో తేడా ఉందని ధీరజ్ కనిపెడతాడు. ధీరజ్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా వెనక నుంచి విశ్వ నియమించిన రౌడీ అతడిపై కత్తితో ఎటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ముగిసింది.