Illu Illalu Pillalu February 7th Episode: ధీరజ్‌పై ప్రేమ రివేంజ్ -సాగర్‌పై అలిగిన నర్మద -చందు పెళ్లిచూపులు ఫ్లాప్
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 7 ఎపిసోడ్‌లో పుట్టింటికి దూరమై ప్రేమ బాధపడుతుంది. తల్లి రేవతి కనిపించడంతో తనతో మాట్లాడమని ప్రాధేయపడుతుంది. కానీ కూతురు పిలిచినా పట్టించుకోకుండా రేవతి ఇంట్లోకి వెళ్లిపోతుంది. తల్లి ద్వేషం చూసి ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

Illu Illalu Pillalu: ధీరజ్ దెబ్బలతో కిందపడుకోవడం కష్టమని అనుకుంటుంది ప్రేమ. భర్తను బెడ్‌పై పడుకోమని చెప్పి తాను కింద పడుకోవడానికి చాప పరుచుకుంటుంది. నిన్ను అష్టకష్టాలు పెడుతున్నానని, నా వల్ల నువ్వు టార్చర్ అనుభవిస్తున్నావని అందరిని నమ్మించడానికే ఈ డ్రామాలు ఆడుతున్నావా అంటూ ప్రేమను అపార్థం చేసుకుంటాడు ధీరజ్.
నీ ముఖం చూస్తూ నేను ఇక్కడ పడుకోలేనని చెప్పి చాప తీసుకొని రూమ్ నుంచి బయటకు వెళ్లిపోతాడు ధీరజ్. పోనీలే దెబ్బలు తగిలాయి కదా అని జాలి చూపిస్తే పొగరు చూపిస్తున్నాడని ధీరజ్‌పై కోపంతో రగిలిపోతుంది ప్రేమ.
బ్యాచ్‌లర్స్ అడ్డా…
ధీరజ్ చాప, దిండు తీసుకొని తమ పక్కన పడుకోవడానికి రావడం చూసి తిరుపతి షాకవుతాడు. ఇది బ్యాచ్‌లర్స్ అడ్డా అని, ఇక్కడికి పెళ్లైన వారికి నో ఎంట్రీ అంటూ ధీరజ్‌ను పడుకోనివ్వడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోకపోతే రామరాజును పిలుస్తానని అరుస్తాడు. ప్రేమ ఒక్కతే ఒంటరిగా పడుకోవడానికి భయపడుతుందని, భార్యను అలా వదిలేసి రావడం, ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని ధీరజ్‌ను మందలిస్తాడు.
ప్రేమ రివేంజ్...
ఇద్దరు కలిసి బలవంతంగా ధీరజ్‌ను అతడి రూమ్‌లోకి పంపిస్తారు. ధీరజ్ చాప తీసుకొని రూమ్‌లోకి వచ్చినా పట్టించుకోకుండా కాలు మీద కాలు వేసి కూర్చొని ఉంటుంది ప్రేమ. చాపపై పడుకోమని ప్రేమకు ఆర్డర్ వేస్తాడు ధీరజ్. నేను చాపపై పడుకుంటే నీకు బ్యాడ్ నేమ్ వస్తుందని ధీరజ్‌కు కౌంటర్లు వేస్తుంది. పట్టుపరుపుల మీద పడుకున్న నన్ను మీరు టార్చర్ పెడుతున్నారని అందరూ అనుకుంటారని ధీరజ్ అన్న మాటలను అతడికి గుర్తుచేస్తుంది. మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకుంటే, మీకు బ్యాడ్‌నేమ్ వస్తే నేను చూడలేనని యాక్టింగ్ చేస్తుంది.
త్యాగశీలిగా...
మీకు బెడ్ ఇచ్చి నేను నేలపై పడుకుంటే అందరూ నన్ను త్యాగశీలి అనుకుంటారు, అందరి దగ్గర మార్కులు కొట్టేయడం కోసం నేను అలాంటి డ్రామాలు వేయలేనని ధీరజ్‌ను ఆటపట్టిస్తుంది.తాను చాపపై పడుకునేది లేదని, బెడ్‌పై మాత్రమే పడుకుంటానని నిద్రపోతుంది.
నువ్వు శాడిస్ట్‌లా ఉన్నావేంటి అని ప్రేమతో అంటాడు ధీరజ్. నీ భాషలో పొగరు, బలుపు ఎక్కువే. తిక్క టన్నులు టన్నులు ఉందని ప్రేమ బదులిస్తుంది. బెడ్ మీద పడుకున్న ప్రేమను చూసి మహారాణిలా ఎలా పడుకుందో చూడు కోపం పట్టలేకపోతాడు ధీరజ్.
చందు గ్రేట్...
తండ్రి కోసం తన ప్రేమను త్యాగం చేసిన చందు గ్రేట్ అంటూ పొగడుతుంది నర్మద. మా అన్నయ్య ప్రేమించిన అమ్మాయి మెంటాలిటీ...నేను ప్రేమించిన అమ్మాయిలా ఉంటే మా వాడికి చుక్కలు కనిపించేవి అని నర్మదను ఆటపట్టిస్తాడు ధీరజ్. వాడిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేది అని చెబుతాడు. అంతే ఏంటి నేను రాక్షసినా, గయ్యాళినా అని నర్మద అంటుంది. పెళ్లికి ముందు నీ నంబర్ నుంచి కాల్ వస్తే భయంతో వణికి పోయేవాడిని. ఫోన్‌లో తిట్టావు, ఎదురుగా ఉంటే కొట్టావు. పెళ్లి చేసుకోమని నన్ను బ్లాక్ మెయిల్ చేశావని సాగర్ అంటాడు.
ప్రేమ కోసం యుద్ధం...
బ్లాక్‌మెయిల్ చేస్తేనే పెళ్లి చేసుకున్నావు తప్పితే..ఇష్టంతో కాదా అని సాగర్‌పై అలుగుతుంది నర్మద. నీ ప్రేమ కోసం నేను ఏడ్చిన ఏడుపు టార్చర్‌లా అనిపించిందా అంటూ కోప్పడుతుంది. ఆమెను బుజ్జగిస్తాడు సాగర్. నువ్వంటే చచ్చేంత ఇష్టం...అందుకే నాన్నకు ఇచ్చిన మాటకు తప్పి నిన్ను పెళ్లి చేసుకున్నానని సాగర్ అంటాడు.
నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఓ యుద్ధమే చేశానని, నేను కూడా గ్రేట్ అని ఒక్క మాట చెప్పమని నర్మదను కూల్ చేస్తాడు. భర్త రొమాంటిక్ మాటలతో నర్మద మామూలు మనిషి అవుతుంది. ఈ ఏకాంత సమయాన్ని గొడవలతో వేస్ట్ చేయద్దని సాగర్ అంటాడు. నర్మదకు ముద్దుపెట్టబోతాడు సాగర్.దిండు మధ్యలోకి తీసుకొచ్చి తాను పెట్టిన కండీషన్‌ను సాగర్‌కు గుర్తుచేస్తుంది నర్మద.
ప్రేమ కన్నీళ్లు...
పుట్టింటివైపు చూస్తూ తాను సంతోషంగా గడిపిన క్షణాల్ని గుర్తుచేసుకుంటుంది ప్రేమ. ఇంటి ముందు తల్లి కనిపించడంత ఆమెను పిలుస్తుంది. కానీ కూతురి పిలుపును పట్టించుకోనట్లుగా ఉంటుంది రేవతి. కనీసం నువ్వైనా నాతో మాట్లాడమని రేవతి కన్నీళ్లతో ప్రాధేయపడుతుంది ప్రేమ. కానీ రేవతి బదులు ఇవ్వకుండా ఇంట్లోకి వెళ్లిపోతుంది. ప్రేమను నర్మద ఓదార్చుతుంది.
కనీసం తల్లి తన ముఖం వైపు కూడా చూడలేదని బాధపడుతుంది. ఇంత కంటే బాధ, నరకం తనకు మరొకటి ఉండదని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీ అమ్మ మనసులో బాధ తప్ప నీపై ద్వేషం లేదని, తొందరలోనే నీ బాధలు దూరమై సంతోషంగా మారే రోజులు వస్తాయని ప్రేమకు సర్ధిచెబుతుంది నర్మద.
ప్రేమ మాటల్ని తలుపు చాటుకు ఉంది రేవతి వింటుంది. నువ్వు అమ్మ అని పిలవగానే తల్లి పేగు తల్లడిల్లిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ధీరజ్‌ను పెళ్లి చేసుకొని మాకు ఎందుకు ఈ పెద్ద శిక్ష వేశావని బాధపడుతుంది.
చందు పెళ్లి చూపులు...
చందు పెళ్లి చూపులకు రామరాజు, వేదావతి బయలుదేరుతారు. ఆ విషయం విని సాగర్, ధీరజ్‌తో పాటు మిగిలిన వాళ్లు ఆనందపడతారు. పెళ్లిచూపుల్లో అమ్మాయి చూసిన వేదావతి....చందుకు సరైన జోడీ అనుకుంటుంది. పెళ్లి చూపులకు ఆనందంగా వెళ్లిన వేదావతి, రామరాజు కోపంగా ఇంటికి తిరిగొస్తారు. సాగర్ - నర్మద, ధీరజ్ - ప్రేమలతో ఫొటో షూట్ ఏర్పాటుచేసిన తిరుపతిని కొడతాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ముగిసింది.