Illu Illalu Pillalu Today Episode: భద్రావతి కన్నింగ్ ప్లాన్ -చందు పెళ్లి క్యాన్సిల్ -ధీరజ్‌కు అబద్ధం చెప్పిన ప్రేమ
Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 14 ఎపిసోడ్‌లో చందు పెళ్లి సంబంధాన్ని భద్రావతి చెడగొడుతుంది. పెళ్లి కూతురు తండ్రికి లేనిపోని అబద్దాలు చెబుతుంది. భద్రావతి మాటలు నిజమని నమ్మిన పెళ్లి కూతురు తండ్రి రామరాజును అవమానిస్తూ మాట్లాడుతాడు.

Illu Illalu Pillalu Today Episode: చందు కోసం పెళ్లి సంబంధం చూస్తుంది నర్మద. పెళ్లి చూపుల కోసం రామరాజు, వేదావతితో పాటు మిగిలిన కుటుంబసభ్యులు వెళతారు. ధీరజ్, ప్రేమను మాత్రం ఇంట్లోనే ఉండమని చెబుతుంది వేదావతి. ధీరజ్ కోసం వంట ప్రిపేర్ చేయడానికి సిద్ధమవుతుంది ప్రేమ. ఏం తింటావని అడుగుతుంది.
ఆమె మాటలతో షాకవుతాడు ధీరజ్. నువ్వు నా కోసం వంట చేస్తావా? ఈ రోజు ఖచ్చితంగా భూకంపం వస్తుందని ధీరజ్ ఆన్సర్ ఇస్తాడు. నీది ఎగబడి తినే ఫేస్‌లా ఉందని, వండే ఫేస్‌లో కనిపించడం లేదని అనుమానంగా ప్రేమను అడుగుతాడు.
ప్రేమ పుట్టడం ఖాయం...
నీకు ఏది వస్తే తగిలేయ్ చెప్పడం ఎందుకు అని ధీరజ్ అంటాడు. నువ్వు చేసిన వంట తిన్న తర్వాత నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఆంబులెన్స్ రావాల్సివస్తుందేమోనని ధీరజ్ సెటైర్లు వేస్తాడు. నా చేతి వంట తిన్న తర్వాత నువ్వే నా చుట్టూ కుక్క పిల్లలా తిరుగుతావని, నీలో ప్రేమ పుట్టించడం ఖాయమని ప్రేమ అంటుంది. ఈ ప్రేమ మీద నీకు ప్రేమ పుట్టినా పర్వాలేదుగా అని ధీరజ్‌తో చెబుతుంది. భార్య చెప్పిన మాటలు వినగానే ధీరజ్ కంగారు పడిపోతాడు.
ఏం రేంజ్‌లో ప్రేమ పెరుగుతుందో...
మీ నాన్న మీ అమ్మ చేతి వంట తప్ప ఎవరూ వండిన తినడు. అంటే మీ అమ్మ తన వంటతో మీ నాన్న మనసు గెలుచుకుంది. నా చేతి వంట తిన్న తర్వాత నీ మనసులో నా పట్ల ఏ రేంజ్‌లో ప్రేమ పెరుగుతుందో నువ్వే చూస్తావుగా...నాపై ప్రేమను పెంచుకోవడానికి రెడీగా ఉండమని చెప్పి కిచెన్‌లోకి వెళ్లబోతుంది ప్రేమ. నువ్వంటే నాకు చిరాకు, కోపం తప్ప ప్రేమ ఎప్పటికీ కలగదని ధీరజ్ అంటాడు. అసలు నిన్ను వంట చేయనివ్వనని, నేను వండుకుంటానని ధీరజ్ చెప్పి కిచెన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు.
నీతో ప్రేమ అనే ఊబిలో పడిపోవడం కంటే కష్టమైన సరే నేను వంట చేసుకుంటానని ప్రేమతో ఛాలెంజ్ చేస్తాడు.
ప్రేమ నవ్వులు...
వంట చేయడానికి ధీరజ్ పడుతోన్న కష్టాలు చూసి నవ్వుకుంటుంది ప్రేమ. సాల్ట్ వేస్తున్నావో...షుగర్ వేస్తున్నావో చూసుకో అంటూ ఆటపట్టిస్తుంది. ధీరజ్ ముఖానికి మొత్తం మసి అంటేలా చేస్తుంది. చింపాజీలా ఉన్నావని ఏడిపిస్తుంది.
భద్రావతి ఫోన్ ...
చందుకు పెళ్లి సంబంధం ఖాయమయ్యే టైమ్‌లో అమ్మాయి తండ్రికి భద్రావతి ఫోన్ చేస్తుంది. మీ అమ్మాయి జీవితాన్ని కాపాడటానికి కాల్ చేశానని చెబుతుంది. రామరాజు గొప్పింటి అమ్మాయికి మాయమాటలు చెప్పి లేపుకెళ్లి పెళ్లిచేసుకున్నాడని, అతడి కొడుకులు కూడా అదే పని చేశారని అమ్మాయి తండ్రికి అబద్ధాలు చెబుతుంది భద్రావతి. రామరాజు ఇంటి పేరు లేని అనాథ అని, తల్లిదండ్రులు కూడా ఎవరో తెలియదని భద్రావతి అంటుంది.
రామరాజు ట్రైనింగ్...
ఊరుపేరు లేనివాడి ఇంటికి తమ పిల్లలను కోడలిగా పంపించడానికి ఎవరూ ఒప్పుకోరని, అందుకే బాగా డబ్బున్న అమ్మాయిలకు వల వేసి లేపుకెళ్లి పెళ్లిచేసుకోమని రామరాజు ట్రైనింగ్ ఇచ్చాడని అమ్మాయి తండ్రితో అంటుంది భద్రావతి.
చెత్త వెధవలు...
చందు కూడా ఓ అమ్మాయిని ప్రేమించాడని, లేచిపోయి పెళ్లిచేసుకోవడం కుదరకే సంబంధం కోసం మీ ఇంటికి వచ్చాడని చాడీలు చెబుతుంది. రామరాజు కొడుకులు చెత్త వెధవలని, అలాంటి ఇంటికి మీ అమ్మాయిని కోడలిగా పంపించడం అంటే నీ కూతురి జీవితంలో నువ్వే నిప్పులు పోసినట్లు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. భద్రావతి మాటలు నిజమని నమ్ముతాడు పెళ్లికూతురు తండ్రి సుబ్బరావు.
ప్రేమ అబద్ధం...
తన కోసం స్పెషల్‌గా సూప్ ప్రిపేర్ చేసుకుంటాడు ధీరజ్. ప్రేమ కూడా ఉండటంతో ఆమెకు ఇస్తాడు. సూప్ బాగుందని, వంట మాస్టర్‌గా నీకు మంచి భవిష్యత్తు ఉందని ప్రేమ అంటుంది. నీ చదువు అటో ఇటో అయితే టిఫిన్ సెంటర్ పెట్టుకొని బతకొచ్చదని ఆటపట్టిస్తుంది. నాకు వంట రాదని, నీతో వంట చేయించడం కోసం ప్రేమ పడుతుందని అబద్ధం ఆడానని ప్రేమ అంటుంది.
ఆమెను కొట్టడానికి ధీరజ్ వస్తాడు. అతడికి దొరక్కుండా పారిపోతుంది. ఇది రాక్షస జాతికే లీడర్‌లా ఉందని, నాతో మామూలుగా ఆడుకోలేదని ధీరజ్ అంటాడు.
సభ్యత, సంస్కారం...
అప్పటివరకు సంబంధం ఓకే అని చెప్పిన సుబ్బరావు...భద్రావతి ఫోన్ కాల్‌తో మాట మార్చేస్తాడు. తనకు ఈ సంబంధం ఇష్టం లేదని రామరాజుతో చెబుతాడు. మీరు ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరమని అంటాడు. ఏ తండ్రి అయినా తన కూతురిని సభ్యత, సంస్కారం ఉన్న ఇంటికి కోడలిగా పంపించాలని అనుకుంటాడు. అంతే కానీ పద్దతి పాడు లేకుండా పిల్లలను పెంచిన ఇంటికి, అస్తమానం అబద్దాలు మాట్లాడే ఇంటికి పంపించి కూతురు గొంతు కోయాలని అనుకోడని సుబ్బరావు కోపంగా అంటాడు.
మా గురించి, మా కుటుంబం గురించి ఇప్పటికే అన్ని నిజాలు చెప్పాం కదా...ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అని సుబ్బరావును అడుగుతుంది నర్మద.
కన్న బిడ్డలను సరిగ్గా పెంచలేని...
మీరు మాతో చెప్పినవన్నీ అబద్దాలేనని సుబ్బరావు కోపంగా బదులిస్తాడు. ఊరు పేరు లేని మీ ఇంటికి మా అమ్మాయిని కోడలిగా పంపించడం నాకు ఇష్టం లేదని సుబ్బరావు చెబుతాడు. రామరాజు అంటే మంచి మనిషి అనుకున్నానని, కానీ కన్నబిడ్డలనుసరిగ్గా పెంచడం చేతకానీ వాడని అనుకోలేదని అవమానిస్తాడు రామరాజు. పెళ్లి కూతురు తండ్రి మాటలను చందు, సాగర్ సహించలేకపోతారు. అతడిపై ఫైర్ అవుతారు.
సాగర్ కోపం...
కానీ రామరాజు వారిని వారిస్తాడు. అవమానం భారంతో ఇంటి నుంచి బయటకు వస్తారు. తండ్రికి అవమానం జరగడానికి నర్మద కారణమని సాగర్ కోపంతో రగిలిపోతాడు. తమ పెళ్లి రామరాజుకు ఇష్టం లేదనే కోపంతోనే సంబంధం పేరుతో తండ్రిని అవమానించిందని సాగర్ అనుమానిస్తాడు. ఈ విషయంలో ఇద్దరు గొడవపడతారు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం