Illu Illalu Pillalu February 13th Episode: చందు పెళ్లి చెడగొట్టిన భద్రావతి -నర్మదపై చెయ్యేత్తిన సాగర్
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 13 ఎపిసోడ్‌లో చందు కోసం పెళ్లి సంబంధం తీసుకొస్తుంది నర్మద. పెళ్లిచూపుల్లో చందుకు అమ్మాయి నచ్చుతుంది. కానీ వేదావతి కుట్రలు పన్ని చల్లి పెళ్లి చూపులను చెడగొడుతుంది.

చందు గురించి, రామరాజు, వేదావతి మంచితనం గురించి తన స్నేహితురాలు పద్మకు గొప్పగా చెబుతుంది నర్మద. కోడళ్లను కూతుళ్లలా చూసుకుంటారని, చందు చాలా అమాయకుడని, మంచివాడని చెబుతుంది. నర్మద మాటలపై నమ్మకంతో చందుకు తమ పిన్ని కూతురితో సంబంధం ఖాయం చేస్తుంది పద్మ. పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేసుకోమని అంటుంది.
నర్మద హ్యాపీ...
పద్మ మాటలతో నర్మద హ్యాపీగా ఫీలవుతుంది. ఈ గుడ్‌న్యూస్‌ను రామరాజు, వేదావతితో పాటు మిగిలిన కుటుంబసభ్యులకు చెబుతుంది. రేపు పెళ్లి చూపులకు వెళదామని అంటుంది. గత పెళ్లి చూపుల్లో జరిగిన అవమానం గుర్తొచ్చి రామరాజు పెళ్లి చూపులకు వెళ్లడం వద్దని అంటాడు.
చందుకు తానే పెళ్లి సంబంధం చూస్తానని నర్మదతో అంటాడు. పోయిన పెళ్లిచూపుల్లో పడ్డ మాటలు తల్చుకొనే మీరు ఇలా మాట్లాడుతున్నారని అర్థమైందని, ఈ సారి గొడవలు జరగకుండా మా ప్రేమ పెళ్లిళ్ల గురించి పద్మకు ముందే చెప్పానని, వాళ్లకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారని రామరాజును కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది నర్మద.
ఇష్టం లేకపోయినా...
నర్మద చెప్పిందంటే ఖచ్చితంగా మంచి సంబంధమే అయ్యి ఉంటుందని, పెళ్లిచూపులకు వెళదామని సాగర్, వేదావతి రామరాజుతో పాటు మిగిలిన కుటుంబసభ్యులు బతిమిలాడుతారు. రామరాజుకు ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యుల కోసం పెళ్లిచూపులకు వెళ్లడానికి ఒప్పుకుంటాడు.
భర్తను పేరు పెట్టి పిలిచిన వేదావతి...
చందు పెళ్లి చూపులకు వెళ్లేందుకు వేదావతి రెడీ అవుతుంది. చందు తప్పకుండా పెళ్లవుతుందని, ఇంట్లో ఆనందం తప్ప దిగులు అన్నదానికి లోటు ఉండదని భర్తతో వేదావతి అంటుంది రామరాజు మాత్రం ఆలోచనలో పడతాడు. ఏమయ్యా రామరాజు చందు పెళ్లిచూపులకు బయలుదేరుదామా అని భర్తను పేరు పెట్టి పిలుస్తుంది వేదావతి. మనం ప్రేమించి పెళ్లిచూసుకున్నాం...భర్తను పేరు పెట్టి పిలిచే చనువు నాకు ఉండదా అని అంటుంది.
వేదావతి ఎన్ని మాటలు అంటున్నా... రామరాజు మాత్రం సెలైంట్‌గానే ఉండటంతో అతడికి సారీ చెబుతుంది. ఈ సారి పెళ్లిచూపుల్లో ఎలాంటి మాటలు పడాల్సివస్తుందోనని రామరాజు భయపడతాడు. నర్మద చూసిన సంబంధం ఇదని, ఎలాంటి సమస్యలు ఉండవని వేదావతి ఓదార్చుతుంది. భర్తకకు సర్ధిచెప్పి పెళ్లిచూసులకు తీసుకెళుతుంది.
సాగర్ ఖుషి...
చందుకు నర్మద పెళ్లి సంబంధం తేవడంతో సాగర్ ఖుషి అవుతాడు. చందు పెళ్లి విషయంలో నాన్న కనిపించని బాధ, కన్నీళ్లను మోస్తున్నారని, ఈ పెళ్లి కుదిరితే అది సంతోషంగా మారుతుందని, మనం ప్రేమ పెళ్లి చేసుకున్నామనే కోపం కూడా పోతుందని సాగర్ అంటాడు. చందు పెళ్లి చేసే బాధ్యత తనకు కూడా ఉందని భర్తతో అంటుంది నర్మద.
ధీరజ్, ప్రేమ...ఇంట్లోనే...
చందు పెళ్లి చూపులకు అందరూ రెడీ అవుతారు. . ధీరజ్‌ను ఇంట్లోనే ఉండమని అంటుంది వేదావతి. అతడి కోసం ప్రేమను వంట చేయమని చెబుతుంది. వీడి కోసం నేను వంట చేయాలా అని అత్తయ్య మాటలతో మనసులో కోపంతో రగిలిపోతుంది ప్రేమ.
భద్రావతి పన్నాగం...
రామరాజు ఫ్యామిలీ మొత్తం కలిసివెళ్లడం చూసి భద్రావతి కంటపడుతుంది. వాళ్లు ఎక్కడికి వెళుతున్నారో, ఎవరిని కలుస్తున్నారో తెలుసుకోమని విశ్వకు చెబుతుంది. రామరాజు కారును ఫాలో అవుతాడు విశ్వ. వాళ్లు పెళ్లిచూపులకు వచ్చిన సంగతి తెలుసుకొని భద్రావతికి చెబుతాడు.
చందు పెళ్లిని చెడగొట్టాలని భద్రావతి ఫిక్సవుతుంది. చందుకు ఎప్పటికీ పెళ్లి కాకూడదని, అది తల్చుకొని రామరాజు జీవితాంతం కుమిలిపోతూ బతకాలని విశ్వతో అంటుంది. ఆడపెళ్లి వారి ఫోన్ నంబర్ తెలుసుకొని తనకు చెప్పమని విశ్వకు ఆర్డర్ వేస్తుంది భద్రావతి. ఈ భద్రావతి ఉండగా చందుకు పెళ్లి అవుతుందని ఎలా అనుకున్నావు...నేను జరగనివ్వనని రామరాజును తల్చుకొని కోపంగా అంటుంది భద్రావతి.
తిరుపతి సంబరం...
పెళ్లిచూపుల్లో అమ్మాయి తనకు నచ్చిందని చందు అంటాడు. అమ్మాయి కూడా తనకు చందు నచ్చాడని అంటుంది. పెళ్లి సంబంధం ఓకే అయ్యిందని తెలిసి తిరుపతి సంబరపడిపోతాడు. ధీరజ్, సాగర్ పెళ్లి విషయంలో మాకు ఎలాంటి అభ్యంతర లేదని అమ్మాయి తండ్రి చెబుతాడు. అప్పుడే అమ్మాయి తండ్రికి వేదావతి ఫోన్ చేస్తుంది.
ఊరుపేరు లేనివాడికి...
ఫోన్ మాట్లాడిన తర్వాత అమ్మాయి తండ్రి పెళ్లికి ఒప్పుకోడు. ఊరుపేరు లేనివాడికి తన కూతురిని ఇచ్చేది లేదని, వెంటనే తన ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని రామరాజు కుటుంబాన్ని అవమానిస్తాడు. నర్మద, సాగర్ గొడవపడతారు. నర్మదను కొట్టడానికి సాగర్ చెయ్యేత్తుతాడు. రామరాజు అతడిని అడ్డుకుంటాడు.
భార్యపై చేసుచేసుకోకూడదనే సంస్కారం లేదా...నువ్వసలు మనిషివేనా అని సాగర్‌కు క్లాస్ ఇస్తాడు రామరాజు. దీన్ని కొట్టడం కాదు చంపేయాలని సాగర్ కోపంగా అంటాడు. దాంతో కొడుకును కొట్టడానికి రామరాజు చేయ్యేత్తుతాడు. సాగర్‌ను కొట్టకుండా రామరాజు చేయిని పట్టుకుంటుంది నర్మద. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం