Serial: స్టార్ మా సీరియ‌ల్‌లో గెస్ట్‌గా బుల్లితెర మెగాస్టార్ - ఇంటింటి రామాయ‌ణంలో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు యాక్ట‌ర్స్‌!-illu illalu pillalu actors prabhakar amani doing guest roles in intinti ramayanam serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Serial: స్టార్ మా సీరియ‌ల్‌లో గెస్ట్‌గా బుల్లితెర మెగాస్టార్ - ఇంటింటి రామాయ‌ణంలో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు యాక్ట‌ర్స్‌!

Serial: స్టార్ మా సీరియ‌ల్‌లో గెస్ట్‌గా బుల్లితెర మెగాస్టార్ - ఇంటింటి రామాయ‌ణంలో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు యాక్ట‌ర్స్‌!

Nelki Naresh HT Telugu

Serial: ఇంటింటి రామాయ‌ణం సీరియ‌ల్‌లో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు యాక్ట‌ర్స్ సంద‌డి చేయ‌నున్నారు. ప్ర‌భాక‌ర్‌, ఆమ‌నితో పాటు దుర్గాదేవి గెస్ట్‌లుగా క‌నిపించ‌నున్న‌ట్లు లేటెస్ట్ ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమో సీరియ‌ల్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటోంది.

స్టార్ మా సీరియల్

Serial: ఓ సీరియ‌ల్‌లో మ‌రో సీరియ‌ల్ యాక్ట‌ర్స్ గెస్ట్ పాత్ర‌ల్లో క‌నిపించి ఆడియెన్స్‌ను అడ‌పాద‌డ‌పా స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. గెస్ట్ క్యారెక్ట‌ర్స్ ట్రెండ్ గ‌త కొన్నాళ్లుగా తెలుగు సీరియ‌ల్స్‌లో ఎక్కువైంది. సీరియ‌ల్ యాక్ట‌ర్స్ మాత్ర‌మే కాకుండా సినిమా, సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీలు సైతం సీరియ‌ల్స్‌లో త‌ళుక్కున మెరుస్తూ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నారు.

ఇంటింటి రామాయ‌ణం...

తాజాగా స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న ఇంటింటి రామాయ‌ణం సీరియ‌ల్‌లో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు టీమ్ సంద‌డి చేయ‌నుంది. మంగ‌ళ‌వారం నాటి ఇంటింటి రామాయ‌ణం ప్రోమో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ యాక్ట‌ర్స్ క‌నిపించారు. ప్ర‌భాక‌ర్‌, అమ‌నితో పాటు దుర్గాదేవిని ప్రోమోలో చూపించారు. అస‌లు పేర్ల‌తో కాకుండా ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌లోని పేర్ల‌తోనే ఇంటింటి రామాయ‌ణంలో వీరు క‌నిపించ‌నున్న‌ట్లు ప్రోమోలో రివీల్ చేశారు.

ఆరాధ్య ముడుపు...

త‌న అమ్మ‌నాన్న‌లు క‌లిసి ఉండాల‌ని ఆరాధ్య చెట్టుకు ముడుపు క‌ట్టాల‌ని చూస్తుంది. ఆమెకు రామ‌రాజు, వేదావ‌తి సాయం చేసిన‌ట్లుగా ప్రోమోలో క‌నిపిస్తోంది. త‌మ అమ్మ‌నాన్న‌లు క‌లిసి ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఆరాధ్య వారితో చెప్పడం, అవ‌నిని వారికి చూపించిన‌ట్లుగా ప్రోమోలో చూపించారు. అవ‌నికి ధైర్యం చెప్పే పాత్ర‌లో రామ‌రాజు, వేదావ‌తి ఈ సీరియ‌ల్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

టీఆర్‌పీలో టాప్ త్రీ...

ప్ర‌స్తుతం స్టార్ మా ఛానెల్‌ సీరియ‌ల్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సెకండ్ ప్లేస్‌లో కొన‌సాగుతోండ‌గా...ఇంటింటి రామాయ‌ణం మూడో ప్లేస్‌లో ఉంది.లేటెస్ట్ రేటింగ్‌లో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌12.45 రేటింగ్ సొంతం చేసుకోగా...ఇంటింటి రామాయ‌ణం సీరియ‌ల్‌కు 12.30 టీఆర్‌పీ వ‌చ్చింది. ఫ్యామిలీ డ్రామా క‌థాంశాల‌తో తెర‌కెక్కిన ఈ సీరియ‌ల్స్ బుల్లితెర ఫ్యాన్స్‌ను మెప్పిస్తోన్నాయి. ఇంటింటి రామాయ‌ణం సీరియ‌ల్ 250 ఎపిసోడ్స్‌కు చేరువ కాగా...ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు ఇటీవ‌లే వంద ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న‌ది.

కీల‌క పాత్ర‌ల్లో...

ఇంటింటి రామాయ‌ణం సీరియ‌ల్‌లో ప‌ల్ల‌వి రామ‌స్వామి, య‌షు, రామ‌కృష్ణ‌, కృష్ణ‌శ్రీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌లో ప్ర‌భాక‌ర్‌, ఆమ‌ని, అన్షు రెడ్డి న‌టిస్తోన్నారు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం