Ileana pregnancy: మళ్లీ తల్లి కాబోతున్న ఇలియానా.. న్యూ ఇయర్ విషెస్ వీడియోలో హింట్ ఇచ్చిన బ్యూటీ..
Ileana pregnancy: ఇలియానా మళ్లీ తల్లి కాబోతోందా? తాజాగా న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో అదే హింట్ ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఈ కొత్త ఏడాదిలోనే ఆమె మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Ileana pregnancy: ఇలియానా డి'క్రజ్.. అభిమానులు ముద్దుగా ఇల్లీ బేబీ అని పిలుచుకునే జీరో ఫిగర్ బ్యూటీ. ఇప్పుడీ గోవా సుందరి మరోసారి తల్లి కాబోతున్నట్లు హింట్ ఇస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలలాగే ఇలియానా కూడా న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో గతేడాది ఒక్కో నెలా ఎలా గడిచిందో చెబుతూ వెళ్లింది. తన తొలి సంతానం ఎలా పెరిగి పెద్దయిందో ఇందులో చూడొచ్చు. అయితే ఇందులో అక్టోబర్ నెల క్లిప్ అందరి దృష్టిని ఆకర్షించింది.
మళ్లీ తల్లి కాబోతున్న ఇల్లీ బేబీ?
గోవా బ్యూటీ ఇలియానా బుధవారం (జనవరి 1) పోస్ట్ చేసిన ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆ పోస్ట్ కామెంట్స్ సెక్షన్ లో చాలా మంది శుభాకాంక్షలు చెప్పారు. దీనికి కారణం.. ఆమె పోస్ట్ చేసిన వీడియోలో ఓ చోట తాను ప్రెగ్నెంట్ అనే హింట్ ఇవ్వడమే. "ప్రేమ, శాంతి, దయ. 2025లో ఇవన్నింటితోపాటు మరెన్నో ఉండాలని కోరుకుంటున్నాను" అనే క్యాప్షన్ తో ఇలియానా ఓ వీడియో పోస్ట్ చేసింది.
అందులో ఇల్లీ బేబీ 2024 ఎలా గడిచిందో చూడొచ్చు. తన భర్త మైఖేల్ డోలాన్, కొడుకు కోవా ఫీనిక్స్ డోలాన్ లను కూడా చూడొచ్చు. ఒక్కో నెలా ఆమె తొలి సంతానం ఎదుగుతున్న తీరు ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే అక్టోబర్ నెలకు వచ్చేసరికి ఇలియానా మరోసారి పాజిటివ్ గా వచ్చిన ప్రెగ్నెన్సీ రిజల్ట్ ను చూపించింది. ఓ సెకనులోపే ఉన్న ఈ క్లిప్ ను చాలా మంది అభిమానులు చూసి ఇలియానాకు కంగ్రాట్స్ చెబుతున్నారు. "సెకండ్ బేబీ 2025లో వస్తోందా? లేక మేమే తప్పుగా అర్థం చేసుకుంటున్నామా" అని ఒకరు.. కంగ్రాచులేషన్స్ అగైన్ అని మరొకరు.. అక్టోబర్, కంగ్రాచులేషన్స్ అని ఇంకొకరు కామెంట్స్ చేశారు.
ఇలియానా అప్పుడు పెళ్లి కాకుండానే..
నిజానికి ఇలియానా పెళ్లికి ముందే తన తొలి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్, 2023లో తొలి ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించింది. తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ డోలాన్ తో కలిసి ఉన్నా అతన్ని అప్పటికి పెళ్లి చేసుకోలేదు. అదే ఏడాది ఆగస్టులో తొలి సంతానం కలిగింది.
ఈ విషయాన్ని కూడా ఆమె తన ఇన్‌స్టా పోస్టు ద్వారా తెలిపింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మైఖేల్ ను ఆమె పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ హింట్ కూడా ఇవ్వడం విశేషం. ఇలియానా గతేడాది తేరే క్యా హోగా లవ్లీ, దో ఔర్ దో ప్యార్ అనే సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేయలేదు.