Ileana D’Cruz: రూమర్లను కన్ఫర్మ్ చేసిన ఇలియానా.. రెండోసారి ప్రెగ్నెన్సీ.. వెరైటీ పోస్ట్
Ileana D’Cruz: ఇలియానా రెండోసారి గర్భం దాల్చారు. ఈ విషయంపై కొంతకాలంగా రూమర్లు వస్తుండగా.. ఇప్పుడు ఆమెనే కన్ఫర్మ్ చేశారు. వెరైటీ పోస్టుతో ఈ విషయాన్ని వెల్లడించారు.

హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‍ను ఆస్వాదిస్తున్నారు. 2023లో మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. దీంతో ఇలియానా, ఆమె జీవిత భాగస్వామి మైకేల్ డోలాన్ తొలిసారి తల్లిదండ్రులయ్యారు. తన కుమారుడి ఫొటోలను చాలాసార్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు ఇలియానా. మాతృత్వాన్ని ఎంత ఆస్వాదిస్తున్నానో కూడా వివరిస్తూ కొన్ని పోస్టులు చేశారు. అయితే, ఇలియనా మరోసారి ప్రెగ్నెంట్ అయ్యారంటూ కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఆమె ఓ టెస్ట్ కిట్ వీడియోను పోస్ట్ చేయడంతో ఇవి మొదలయ్యాయి. ఈ రూమర్లను ఇప్పుడు కన్పర్మ్ చేశారు ఇలియనా.
విభిన్నంగా పోస్ట్
తాను రెండోసారి గర్భంగా దాల్చానంటూ కాస్త వెరైటీగా చెప్పారు ఇలియానా. నేరుగా కాకుండా కాస్త విభిన్నంగా కన్ఫర్మ్ చేశారు. పఫ్‍కార్న్ స్నాక్స్, యాంటాసిడ్ చుయింగమ్ ప్యాకెట్స్ ఉన్న ఫొటోను ఇన్‍స్టాగ్రామ్ స్టోరీగా నేడు (ఫిబ్రవరి 15) పోస్ట్ చేశారు ఇలియానా. “ప్రెగ్నెంట్ అని చెప్పకుండా.. నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాలి” అంటూ రాసుకొచ్చారు. ఇలా ఇన్‍డైరెక్ట్‌గా వెరైటీ పోస్టుతో తాను ప్రెగ్నెంట్ అని ఇలియానా చెప్పేశారు.
ఇలియానా ఈ పోస్ట్ చేయడంతో చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. 2025లో రెండో బేబీ వచ్చేస్తోందా అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. చెప్పేదేదో నేరుగా చెప్పొచ్చు కదా.. ఈ సస్పెన్స్ ఎందుకు అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చారు. మేం సరిగానే అర్థం చేసుకున్నాం కదా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పరోక్షంగా విషయం చెప్పి కాస్త సస్పెన్స్ మెయింటైన్ చేశారు ఇలియానా.
మొదటి నుంచి సస్పెన్సే..
ఇలియానా తన పార్ట్‌నర్ మైకేల్ డోలాన్‍ను కూడా చాలా సస్పెన్స్ తర్వాత పరిచయం చేశారు. ముందు తాను గర్భం దాల్చిన విషయాన్ని 2023లో చెప్పడంతో ఆమె భాగస్వామి ఎవరా అనే ఆసక్తి రేగింది. ఆ తర్వాత డోలాన్ ముఖం కనిపించకుండా కొన్ని ఫొటోలను ఇలియానా పోస్ట్ చేశారు. దీంతో ఆ వ్యక్తి ఎవరనే చర్చలు సాగాయి. కొన్నాళ్లకు ఎట్టకేలకు డోలాన్‍ను ప్రపంచానికి పరిచయం చేశారు ఇలియానా. క్లిష్ట సమయాల్లో తన భర్త డోలాన్ తనకు చాలా మద్దతుగా నిలిచారని ఓ ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పారు. తనను చాలా ప్రేమిస్తారని అన్నారు.
2023 ఆగస్టు 1వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చారు ఇలియానా. అతడికి ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టారు. అతడితో ఉన్న ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో ఇలియానా పంచుకున్నారు. తాను ఎంత సంతోషంగా ఉన్నానో తెలియజేశారు.
టాలీవుడ్‍లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్‍కు చేరారు ఇలియానా. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లారు. ఆరేళ్లుగా ఇలియనా అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. చివరగా గతేడాది దో ఔర్ దో ప్యార్ సినిమాలో కనిపించారు.
సంబంధిత కథనం