నెల రోజుల్లోపే ఓటీటీలోకి ధనుష్ సినిమా.. ఇడ్లీ కొట్టు డిజిటల్ స్ట్రీమింగ్ పై లేటెస్ట్ బజ్.. డేట్ ఇదేనా?-idli kadai ott release date dhanushs latest family emotional drama to stream on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నెల రోజుల్లోపే ఓటీటీలోకి ధనుష్ సినిమా.. ఇడ్లీ కొట్టు డిజిటల్ స్ట్రీమింగ్ పై లేటెస్ట్ బజ్.. డేట్ ఇదేనా?

నెల రోజుల్లోపే ఓటీటీలోకి ధనుష్ సినిమా.. ఇడ్లీ కొట్టు డిజిటల్ స్ట్రీమింగ్ పై లేటెస్ట్ బజ్.. డేట్ ఇదేనా?

తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘ఇడ్లీ కడై’. తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో రిలీజైంది. ఈ హార్ట్ టచింగ్ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. స్ట్రీమింగ్ డేట్ పై క్రేజీ బజ్ నెలకొంది.

ఇడ్లీ కొట్టు పోస్టర్ లో ధనుష్ (x/dhanushkraja)

యునిక్ కాన్సెప్ట్ లతో, వైవిధ్యమైన కథలతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు తమిళ స్టార్ ధనుష్. ఇప్పుడు ఇడ్లీ కడై అంటూ థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజైంది. ఇప్పుడీ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఇడ్లీ కడై ఓటీటీ

ధనుష్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇడ్లీ కడై. ఈ సినిమాకు థియేటర్లో పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఓ వైపు కాంతార చాప్టర్ 1 నుంచి పోటీ ఉన్నా ఇడ్లీ కడై బాక్సాఫీస్ దగ్గర నిలకడగా రాణిస్తోంది. ఇప్పుడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై క్రేజీ బజ్ నెలకొంది. ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

ఓటీటీ డేట్

దసరా పండుగను పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 1న ఇడ్లీ కడై థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు ధనుష్ కేవలం హీరో మాత్రమే కాదు రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అయితే ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 29న ఇడ్లీ కడై ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో

ఇడ్లీ కడై ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు టాక్. ఈ మూవీలో ధనుస్, అరుణ్ విజయ్, సత్యరాజ్, సముద్రఖని, నిత్యా మీనన్, షాలిని పాండే, రాజ్ కిరణ్, పతిర్బన్ తదితరులు నటించారు.

ఇడ్లీ కడై కథ ఏమిటంటే?

ఇడ్లీ కొట్టు గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. డైరెక్టర్ గా ధనుష్ కు నాలుగో మూవీ. ఈ కథ మురుగన్ (ధనుష్) చుట్టూ తిరుగుతుంది. అతను తన తండ్రి సాంప్రదాయ ఇడ్లీ దుకాణాన్ని నడపడానికి సహాయం చేస్తాడు. తన కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడం, ఆధునిక ఆశయాలను కొనసాగించడం మధ్య చిక్కుకున్న మురుగన్ ఒక కార్పొరేట్ ఉద్యోగం చేస్తాడు.

కానీ మోసానికి గురై చివరికి తన మూలాలకు తిరిగి వస్తాడు. తిరుచిత్రంబలంలో విజయవంతమైన సహకారం తర్వాత ధనుష్, నిత్యా మీనన్ కలయిక ఈ చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. హీరోగా ధనుష్ కు ఇది 52వ సినిమా.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం