OTT Malayalam Action Thriller: తెలుగులో రిలీజైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న త్రిష మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ
OTT Malayalam Action Thriller: ఓ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో రిలీజైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. త్రిష, టొవినో థామస్ నటించిన ఈ మూవీ ఈ శుక్రవారమే (జనవరి 24) తెలుగులో రిలీజ్ అవడం విశేషం.
OTT Malayalam Action Thriller: ఈ ఏడాది మలయాళంలో రిలీజైన తొలి సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. త్రిష, టొవినో థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ జనవరి 2న థియేటర్లలో రిలీజైంది. ఇక తెలుగులోనూ వచ్చిన ఈ సినిమా ఈరోజే (జనవరి 24) రిలీజ్ కాగా.. వారం రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం.

ఐడెంటిటీ ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళం స్టార్ హీరో టొవినో థామస్, త్రిష నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ. ఈ సినిమా జనవరి 31 నుంచి జీ5 (Zee5) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతంలో వచ్చిన హిట్ మూవీ ఫోరెన్సిక్ ను డైరెక్ట్ చేసిన అనస్ ఖాన్, అఖిల్ పాల్ ఈ ఐడెంటిటీని దర్శకత్వం వహించారు. జనవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ కు వస్తోంది.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెలుగులోనూ శుక్రవారం (జనవరి 24) థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఓటీటీలోకి ఒకేసారి మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.18 కోట్లు వసూలు చేసింది.
ఐడెంటిటీ మూవీ గురించి..
ఈ ఐడెంటిటీ మూవీ ప్రధానంగా ముగ్గురి చుట్టూ తిరుగుతుంది. అలెన్ (వినయ్ రాయ్) అనే పోలీస్ ఆఫీసర్, అలీషా (త్రిష), హరన్ (టొవినో థామస్) అనే జర్నలిస్టుల చుట్టూ తిరిగే కథ ఇది. ఓ కిల్లర్ ను పట్టుకునేందుకు అలెన్, అలీషా ప్రయత్నిస్తుండగా.. వారికి సాయం చేయడానికి హరన్ రంగంలోకి దిగుతాడు. అయితే పలు మానసిక సమస్యలతో బాధపడే అలీషా.. ఆ కిల్లర్ ను ముఖ కవళికల ఆధారంగా గుర్తు పెట్టుకుంటుంది.
అయితే ఈ కేసు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ ముగ్గురూ ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తం చేసుకుంటారు. తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించింది. ముఖ్యంగా టొవినో థామస్, వినయ్ రాయ్ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. థ్రిల్లింగ్ కారు చేజులతోపాటు విమానంలో చేసే స్టంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
సంబంధిత కథనం