iBOMMA Services Shut down in India: సినీ ప్రియులకు షాక్.. శాశ్వతంగా ఐబొమ్మ సేవలు నిలిపివేత
iBOMMA Services Shut down: ప్రముఖ సినిమా వెబ్ సైట్ ఐబొమ్మ శాశ్వతంగా నిలిచిపోనుంది. ఈ మేరకు సదరు పోర్టలే అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సెప్టెంబరు 9 నుంచి సేవలను విరమించుకోనున్నట్లు స్పష్టం చేసింది.
iBOMMA Services Shut down: ఐబొమ్మ.. ఈ పేరు తెలియని సినీ ప్రియులు లేరంటే అతిశయోక్తి కాదు. ఓటీటీ కాలంలో ఉచితంగా హెచ్‌డీ క్లారిటీతో సినిమాలను అందజేస్తున్న ఈ వెబ్‌సైట్ చాలా మందికి సుపరిచితమే. సబ్‌స్క్రిప్షన్ ఫీజులతో ఓటీటీల బాదుడు ఎక్కువైన సమయంలో సామాన్యులకు ఉచితంగా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. దీంతో ఆనతి కాలంలో ఈ పోర్టల్ బాగా పాపులరైంది. ఈ సైట్‌లో చిత్రాలు చూసే వారి సంఖ్య బాగా పెరిగింది. తాజాగా ఐబొమ్మ తన సేవలను శాశ్వతంగా నిలిపివేయనున్నట్లు ప్రకటింటింది. దీంతో సినీ ప్రేమికులు షాక్‌కు గురవుతున్నారు.
ఇటీవల కాలంలో సినీ ప్రియులకు వరుస షాక్‌లకు గురిచేస్తోంది ఐబొమ్మ. ఇప్పటికే సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోడానికి వీలు లేకుండా చేసిన ఐబొమ్మ.. తాజాగా తన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. సెప్టెంబరు 9 నుంచి భారత్‌లో తన సేలను శాశ్వతంగా నిలిపివేయనున్నట్లు ప్రకటిచింది. అంతేకాకుండా భవిష్యత్తులోనూ తిరిగి తీసుకొచ్చే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది.
"హాయ్.. ఐబొమ్మ వినియోగదారులకు మేము షాక్ కానీ సర్‌ప్రైజ్ కానీ ఇవ్వదలచుకోలేదు. చర్యలు తీసుకునేముందు మీకు ఈ విషయాన్ని తెలియజేయాలనుకున్నాం. ఐబొమ్మ సేవలను పూర్తిగా నిలిపివేయనున్నాం. మేము ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటున్నాం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాం. సెప్టెంబరు 9 నుంచి ఇండియాలో ఐబొమ్మ సేవలు శాశ్వతంగా నిలిపివేస్తున్నాం. భవిష్యత్తులో తిరిగి వచ్చే ఆలోచన కూడా మాకు లేదు. యూజర్లు ఎవరూ మాకు మెయిల్స్ చేయవద్దు. ఒకవేళ చేసినా మేము పట్టించుకోం ఇంతకాలం మాపై చూపిన ప్రేమాభిమానాలకు అభినందనలు." అని ఐబొమ్మ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
హైక్వాలిటీ హెచ్‌డీ నాణ్యతతో సినిమాలను వెబ్‌సైట్‌లో ఉంచుతున్న ఐబొమ్మకు యూజర్లు చాలా ఎక్కువ. సినీ ప్రియుల ఆదరణ విశేషంగా పొందింది. గతంలోనూ తన సేవలను నిలిపివేయనున్నట్లు ఐబొమ్మ ప్రకటించింది. అయితే ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. కొద్ది రోజుల క్రితం డౌన్ లౌడ్ ఆప్షన్ తీసేసి ఆంక్షలు విధించింది. తాజాగా పూర్తిగా సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించడంతో సినీ ప్రియులు షాక్‌కు గురవుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా వారు కోరుకుంటున్నారు. మరి ఐబొమ్మ నిర్వాహకులు ఏం చేస్తారో వేచి చూడాలి.
సంబంధిత కథనం