Apsara Rani: సినిమాలను వదిలేయాలని అనుకున్నా...ఆ టైమ్‌లోనే - రాచ‌రికం మూవీపై అప్స‌రా రాణి కామెంట్స్‌!-i was about to end my acting career apsara rani interesting comments on her acting career ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Apsara Rani: సినిమాలను వదిలేయాలని అనుకున్నా...ఆ టైమ్‌లోనే - రాచ‌రికం మూవీపై అప్స‌రా రాణి కామెంట్స్‌!

Apsara Rani: సినిమాలను వదిలేయాలని అనుకున్నా...ఆ టైమ్‌లోనే - రాచ‌రికం మూవీపై అప్స‌రా రాణి కామెంట్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Jan 28, 2025 02:08 PM IST

Apsara Rani: ఒకే త‌ర‌హా రొటీన్ క్యారెక్ట‌ర్స్‌ వ‌స్తుండ‌టంతో సినిమాల‌కు గుడ్‌బై చెప్పాల‌ని అనుకున్నాన‌ని అప్స‌రా రాణి అన్న‌ది. ఆ టైమ్‌లోనే రాచ‌రికం క‌థ‌తో ద‌ర్శ‌కుడు త‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చాడ‌ని తెలిపింది. వ‌రుణ్ సందేశ్ విల‌న్‌గా న‌టించిన ఈ మూవీ జ‌న‌వ‌రి 31న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది.

అప్స‌రా రాణి
అప్స‌రా రాణి

Apsara Rani: అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో న‌టించిన రాచ‌రికం మూవీ ఈ నెల 31న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి సురేశ్ లంకలపల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీలో వ‌రుణ్ సందేశ్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల జ‌రిగింది.

దేవుడే పంపించాడు.

ఈ ఈవెంట్‌లో త‌న సినీ జ‌ర్నీతో పాటు రాచ‌రికం మూవీపై అప్ప‌రారాణి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

అప్సరా రాణి మాట్లాడుతూ.. ‘‘ఒకే రకమైన పాత్రలు వ‌స్తుండ‌టంతో సినిమాల‌ను వ‌దిలేసి ఇండ‌స్ట్రీకి దూరంగా ఉండాల‌ని అనుకున్నా. ఆ టైంలోనే ఆ దేవుడు రాచ‌రికం టీమ్‌ను నా దగ్గరకు పంపించాడు. గ‌తంలో నేను చేసిన పాత్ర‌ల‌కు పూర్తి భిన్నంగా ఇందులో నా క్యారెక్ట‌ర్ ఉంటుంది. ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపిస్తాను. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది అని అప్స‌రారాణి అన్న‌ది.

కొత్త కోణంలో...

‘‘రాయలసీమ నేప‌థ్యాన్ని కొత్త కోణంలో చూపించే మూవీ ఇది. సీమ ప‌రిస్థితుల‌ను, ఆధిప‌త్య పోరును యాక్ష‌న్, ఎమోష‌న్స్‌తో చూపించే మూవీ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ ఇంకా మైండ్‌లోనే తిరుగుతున్నాయి. రామ్ ప్రసాద్ రాసిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి అని విజ‌య్ శంక‌ర్ తెలిపాడు.

నెగెటివ్ పాత్ర‌...

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.‘రాచరికం సినిమాలో నెగెటివ్ పాత్రను చేశాను. మైఖేల్ తరువాత మళ్లీ ఈ పాత్ర నన్ను ఎగ్జైట్ చేసింది. అందుకే విల‌న్ పాత్ర‌లో న‌టించ‌డానికి అంగీక‌రించారు.అప్సరా, విజయ్ కెమిస్ట్రీ బాగుంటుంది అని చెప్పాడు.

బోల్డ్‌గా క‌నిపిస్తూనే…

దర్శకుడు సురేశ్ లంకలపల్లి మాట్లాడుతూ. ‘అప్సరా రాణి మాత్రమే హీరోయిన్ పాత్ర‌ను చేయాలని క‌థ రాసుకున్న‌ప్పుడే ఫిక్స్ అయ్యాను. బోల్డ్‌గా క‌నిపిస్తూనే ప‌వ‌ర్‌ఫుల్‌గా ఆమె పాత్ర సాగుతుంది. వంద కోట్లతో తీసిన సినిమాలా రాచ‌రికం కనిపిస్తుంది.. వరుణ్ సందేశ్ క్యారెక్ట‌ర్‌ అదిరిపోతుంది. విజ‌య్ శంక‌ర్‌కు హీరోగా ఇండ‌స్ట్రీలో నిల‌బెడుతుంది’ అని అన్నారు.ఐపీఎల్ మూవీకి డైరెక్ట‌ర్ సురేష్‌తో ప‌నిచేశాన‌ని, ఇది త‌మ కాంబోలో సెకండ్ మూవీ అని మ్యూజిక్ డైరెక్ట‌ర్ వెంగి చెప్పాడు.

ర‌వితేజ‌, గోపీచంద్ సినిమాల్లో...

4 లెట‌ర్స్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అప్ప‌ర రాణి. రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన డీ కంపెనీ, డేంజ‌ర‌స్ సినిమాల్లో న‌టించింది. ర‌వితేజ క్రాక్‌, గోపీచంద్ సీటీమార్‌తో పాటు హంట్ సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేసింది.

Whats_app_banner