Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి కోసం ముందు సాయిపల్లవినే అనుకున్నా: సందీప్ రెడ్డి వంగా.. రియాక్ట్ అయిన హీరోయిన్-i wanted to cast sai pallavi in arjun reddy movie sandeep reddy vanga reveals at thandel jathara ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి కోసం ముందు సాయిపల్లవినే అనుకున్నా: సందీప్ రెడ్డి వంగా.. రియాక్ట్ అయిన హీరోయిన్

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి కోసం ముందు సాయిపల్లవినే అనుకున్నా: సందీప్ రెడ్డి వంగా.. రియాక్ట్ అయిన హీరోయిన్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 03, 2025 08:06 AM IST

Sandeep Reddy Vanga: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్‍గా ముందు తాను సాయిపల్లవిని అనుకున్నానని అన్నారు. అప్పటి విషయాల గురించి చెప్పారు. దీనికి పల్లవి కూడా రియాక్ట్ అయ్యారు.

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి కోసం సాయిపల్లవినే అనుకున్నా.. కానీ: సందీప్ రెడ్డి వంగా.. రియాక్ట్ అయిన హీరోయిన్
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి కోసం సాయిపల్లవినే అనుకున్నా.. కానీ: సందీప్ రెడ్డి వంగా.. రియాక్ట్ అయిన హీరోయిన్

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హుషారుగా జరిగింది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. ఆదివారం ఈవెంట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది. ఈ ఈవెంట్‍కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావాల్సింది. కానీ హాజరు కాలేదు. ఈ ఈవెంట్‍కు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. చీఫ్ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి నాటి ఓ విషయాన్ని పంచుకున్నారు. సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించారు.

yearly horoscope entry point

అర్జున్‍రెడ్డికి సాయిపల్లవిని అనుకున్నా

ప్రేమమ్ నుంచి సాయిపల్లవి యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. అర్జున్ రెడ్డి చిత్రంలో సాయిపల్లవినే హీరోయిన్‍గా తీసుకుందామని తాను ముందుగా అనుకున్నానని సందీప్ వెల్లడించారు. అయితే, అది ఎందుకు సాధ్యం కాలేదో వివరించారు.

స్లీవ్‍లెస్సే వేసుకోదన్నారు

అర్జున్ రెడ్డి కోసం సాయిపల్లవి తీసుకోవాలని తాను ఓ కోఆర్టినేటర్‌కు కాల్ చేశానని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. ఈ చిత్రంలో రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉంటాయని చెప్పానన్నారు. సాయిపల్లవి స్లీవ్‍లెస్ డ్రెస్సే వేసుకోరని, ఈ చిత్రాన్ని అసలు ఒప్పుకోరని ఆయన చెప్పినట్టు సందీప్ అన్నారు. “అర్జున్ రెడ్డి కోసం నటీనటుల గురించి ఆలోచిస్తుంటే సాయిపల్లవి గుర్తొచ్చారు. కేరళకు చెందిన ఓ కోఆర్డినేటర్‌కు నేను కాల్ చేశా. అర్జున్ రెడ్డి రొమాంటిక్ స్టోరీ అని చెప్పారు. సాధారణంగా తెలుగు చిత్రాల్లో ఉండే దానికంటే ఎక్కువ రొమాన్స్ ఉంటుందని అన్నా. సాయిపల్లవి హీరోయిన్‍గా చేస్తుందా అని అడిగా. ఆ విషయం మరిచిపోండని, ఆ అమ్మాయి కనీసం స్లీవ్‍లెస్ కూడా వేసుకోదని అతడు చెప్పారు. ఆ విషయం మర్చిపోవాలని అన్నారు” అని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.

మారిపోతారనుకున్నా కానీ..

హీరోయిన్లు కొంతకాలం తర్వాత మారిపోతారని మనం అనుకుంటామని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. అవకాశాలను బట్టి మారతారని భావిస్తామని అన్నారు. తాను కూడా అలాగే అనుకున్నానని చెప్పారు. కానీ సాయిపల్లవి పదేళ్లుగా అలాగే ఉన్నారని, ఏం మారలేదని సందీప్ అన్నారు. అది చాలా గ్రేట్ అని ప్రశంసించారు.

స్పందించిన సాయిపల్లవి

సందీప్ రెడ్డి వంగా చెప్పిన విషయంపై సాయిపల్లవి తన స్పీచ్‍లో రియాక్ట్ అయ్యారు. అర్జున్ రెడ్డి ఎలా రావాలని ఉందో అలాగే వచ్చిందని అన్నారు. షాలినీ అద్భుతంగా చేశారని చెప్పారు. విజయ్ కూడా అద్భుతం చేశారని అన్నారు. ఎవరు ఏ మూవీ చేయాలని ఉందో వారే చేస్తారని సాయిపల్లవి అన్నారు. సందీప్ రెడ్డి వంగా తొలి మూవీ అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా చేశారు. ఆ చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది.

తండేల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు స్టార్ హీరో అల్లు అర్జున్ రావాల్సి ఉంది. అయితే, గ్యాస్ట్రిక్ సమస్య వల్ల బన్నీ రాలేకపోయారని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులకు నిరాశ ఎదురైంది.

తండేల్ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీకాకుళం మత్స్యకారుడు రాజు పాత్రను నాగచైతన్య పోషించారు. బుజ్జి తల్లి పాత్ర చేశారు సాయిపల్లవి. ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Whats_app_banner

సంబంధిత కథనం