Siddharth: అపార్థం చేసుకున్నారు.. సీఎం రేవంత్‍ రెడ్డికి పూర్తిగా మద్దతిస్తున్నా: క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్-i support telangana cm revanth reddy in their fight against drugs says siddharth ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siddharth: అపార్థం చేసుకున్నారు.. సీఎం రేవంత్‍ రెడ్డికి పూర్తిగా మద్దతిస్తున్నా: క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్

Siddharth: అపార్థం చేసుకున్నారు.. సీఎం రేవంత్‍ రెడ్డికి పూర్తిగా మద్దతిస్తున్నా: క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 08, 2024 11:11 PM IST

Siddharth: సినిమా టికెట్ల రేట్లు పెంచాలంటే హీరోలు డ్రగ్స్ అవగాహన గురించి వీడియోలు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పారు. అయితే, ఈ విషయంపై హీరో సిద్ధార్థ్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన చెప్పిన ఆన్సర్ కాస్త వివాదంగా మారింది. దీంతో మళ్లీ క్లారిటీ ఇచ్చారు సిద్ధార్థ్.

Siddharth: అపార్థం చేసుకున్నారు.. సీఎం రేవంత్‍ రెడ్డికి పూర్తిగా మద్దతిస్తున్నా: క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్
Siddharth: అపార్థం చేసుకున్నారు.. సీఎం రేవంత్‍ రెడ్డికి పూర్తిగా మద్దతిస్తున్నా: క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన భారతీయుడు 2 సినిమా ప్రెస్‍మీట్ హైదరాబాద్‍లో జరిగింది. నేడు (జూలై 8) ఎన్ కన్వెన్షన్‍లో జరిగిన ఈ మీట్‍కు కమల్, డైరెక్టర్ శంకర్‌తో పాటు ఈ మూవీలో ఓ మెయిన్ రోల్ చేసిన హీరో సిద్ధార్థ్ కూడా హాజరయ్యారు. తనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే ప్రధాన నటీనటులు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వీడియోలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధించిన నిబంధన గురించి సిద్ధార్థ్‌కు ప్రశ్న ఎదురైంది. అయితే, దీనికి ఆయన సమాధానం చెప్పిన తీరుపై కాస్త వివాదం తలెత్తింది. దీంతో కొన్ని గంటల్లోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు సిద్ధార్థ్.

సిద్ధార్థ్ ఏమన్నారంటే..

టికెట్ల రేట్ల పెంపు చేయాలంటే డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వీడియో చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, మీకు ఏమైనా సామాజిక బాధ్యత ఉందా అని సిద్ధార్థ్‌కు భారతీయుడు 2 ప్రెస్‍టీమ్‍లో ప్రశ్న ఎదురైంది. తాను 20 ఏళ్లుగా తెలుగు సినిమాలు చేస్తున్నానని, కండోమ్‍లు వాడాలని ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో అప్పట్లో ప్రభుత్వానికి తానే ఫస్ట్ సహకరించానని సిద్ధార్థ్ తెలిపారు.

నటీనటులందరూ సామాజిక బాధ్యత కలిగి ఉంటారని, తమ దృష్టికి వచ్చిన వాటిపై స్పందిస్తారని సిద్ధార్థ్ అన్నారు. “నా పేరు సిద్ధార్థ్. 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. మొట్టమొదట తెలుగు సినిమాల్లో ఒక కండోమ్ చేతులో పట్టుకొని.. కండోమ్ వాడండి అంటూ బిల్ బోర్డుల్లో నా ఫేస్‍ వచ్చేటట్టు ప్రభుత్వానికి సహకారం ఇచ్చాను. 2005 నుంచి 2012 వరకు అప్పుడు ఆంధ్రప్రదేశ్‍లో ఒక్క స్టేటే కదా.. ఎక్కడ సురక్షిత శృంగారం గురించి హోర్డింగ్ ఉంటే అక్కడ సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కండోమ్ ఉండేది. ఆ బాధ్యత నా బాధ్యత.. ఒక ముఖ్యమంత్రి చెబితే ఆ బాధ్యత రాదు” అని సిద్ధార్థ్ అన్నారు. ఏ సీఎం చెప్పినా తాము చేస్తామని సిద్ధార్థ్ చెప్పారు. అయితే, ఒకవేళ ఇది చేస్తేనే.. తాము అది చేస్తామని ఇప్పటి వరకు తమకు ఏ సీఎం చెప్పలేదని సిద్ధార్థ్ అన్నారు.

సిద్థార్థ్ చెప్పిన చివరి మాటపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కౌంటర్ ఇచ్చారనేలా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. ఇది కాస్త వివాదంగా మారింది. దీంతో కొన్ని గంటల్లోనే సిద్ధార్థ్ స్పందించారు. ఓ వీడియో తీసుకొచ్చారు.

రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు

డ్రగ్స్‌పై పోరాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి తాను పూర్తిగా మద్దతునిస్తున్నానని సిద్ధార్థ్ చెప్పారు. తన మాటలను కొందరు అపార్థం చేసుకున్నారని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

మెరుగైన సమాజాన్ని రూపొందించడంలో సినీ ఇండస్ట్రీని భాగం చేయాలనుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాను 100 శాతం ఉంటానని సిద్ధార్థ్ చెప్పారు. “భారతీయుడు 2 సినిమాలో అవినీతి, డ్రగ్స్ విషయాలను అసలు సహించకూడదని మేం మాట్లాడుతున్నాం. అలాంటి భారతీయుడు 2 సినిమా ప్రెస్‍మీట్‍లో ఓ ప్రశ్నకు సమాధానం చెబుతున్నప్పుడు నా మాటలను కొందరు అపార్థం చేసుకున్నారు. దానికి నేను వెంటనే క్లియర్ చేసేయాలి. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి నేను పూర్తిగా మద్దతు తెలుపుతున్నా” అని సిద్ధార్థ్ చెప్పారు.

నేను చెప్పింది అదే

తాను ఎప్పుడూ సామాజిక కార్యక్రమాలు చేస్తూనే ఉంటానని, దాన్ని కొనసాగిస్తానని సిద్ధార్థ్ స్పష్టం చేశారు. “మమ్మల్ని ఇంత వరకు ఎవరూ ఫోర్స్ చేయలేదని మాత్రమే నేను మధ్యాహ్నం చెప్పాను. మేం సొంతం చేస్తున్నామని చెప్పా. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి, వారి ప్రభుత్వానికి అభినందనలు. మేం మీతో ఉన్నాం. భారతీయుడు 2 థియేటర్లలో జూలై 12న వస్తోంది” అని సిద్ధార్థ్ చెప్పారు. మొత్తంగా ఈ విషయం పెద్ద వివాదం కాక ముందే క్లారిటీ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టారు సిద్ధార్థ్.

Whats_app_banner