Avinash: రూ.10లక్షలు ఇచ్చాకే విడిచిపెట్టారు: కమెడియన్ అవినాశ్-i payed 10 lakh rupees to leave jabardasth says mukku avinash ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Avinash: రూ.10లక్షలు ఇచ్చాకే విడిచిపెట్టారు: కమెడియన్ అవినాశ్

Avinash: రూ.10లక్షలు ఇచ్చాకే విడిచిపెట్టారు: కమెడియన్ అవినాశ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 22, 2024 04:51 PM IST

Comedian Avinash: జబర్దస్త్ కామెడీ షోను ఎందుకు వదిలిపెట్టారో కమెడియన్ అవినాశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే, బిగ్‍బాస్ తనకు మళ్లీ జన్మనిచ్చిందంటూ వెల్లడించారు.

Avinash: రూ.10లక్షలు ఇచ్చాకే విడిచిపెట్టారు: కమెడియన్ అవినాశ్
Avinash: రూ.10లక్షలు ఇచ్చాకే విడిచిపెట్టారు: కమెడియన్ అవినాశ్

Comedian Avinash: బబర్దస్త్ కామెడీ షో ద్వారా అవినాశ్ చాలా పాపులర్ అయ్యారు. ఆ షోలో చాలా స్కిట్స్ చేశారు. ముక్కు అవినాశ్ పేరుతో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఆ షోలో ఓ టీమ్ లీడర్ కూడా అయ్యారు. అయితే, కొంతకాలానికి జబర్దస్త్ షోను వీడారు. ప్రస్తుతం స్టార్ మా టీవీ ఛానెల్‍లో చాలా షోస్ చేస్తున్నారు అవినాశ్. సందడి చేస్తున్నారు. అయితే, తాను జబర్దస్త్ షోను ఎందుకు వీడానో తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవినాశ్ వెల్లడించారు.

రూ.10లక్షలు కట్టా

జీవితంలో మరింత పైకి ఎదగాలన్న ఉద్దేశంతోనే తాను జబర్దస్త్ షోను వీడానని అవినాశ్ చెప్పారు. రితూ చౌదరి యాంకరింగ్ చేసిన దావత్ టాక్ షోకు వచ్చిన అతడు ఈ విషయాలను పంచుకున్నారు. రూ.10లక్షలు ఫైన్ కట్టాకే జబర్దస్త్ షో.. మల్లెమాల సంస్థ తనను విడిచిపెట్టిందని అవినాశ్ తెలిపారు.

“ఎవరైనా ముందుకు ఎదగాలని అనుకుంటారు కాబట్టి అక్కడి నుంచి అలా అలా ఎత్తుకు వచ్చాను” అని అవినాశ్ అన్నారు. జబర్దస్త్ నుంచి స్టార్ మా బిగ్‍బాస్‍కు వెళ్లేందుకు మల్లెమాల వారు కొంత డబ్బు చెల్లించాలని చెప్పారని తాను విన్నానని రితూ అన్నారు. దీనికి అవినాశ్ స్పందించారు. “అవును. కరెక్టే. రూ.10లక్షలు ఫైన్ కట్టి వెళ్లాను” అవినాశ్ చెప్పారు. మళ్లీ జబర్దస్త్ షోకు వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. “ముందుకు వెళ్లాలని అనుకుంటాం కానీ.. వెనక్కి వెళ్లాలని ఎవరూ అనుకోరు కదా” అని అవినాశ్ చెప్పారు.

శ్రీముఖి డబ్బులిచ్చారు

ఫైన్‍గా కట్టిన రూ.10లక్షలు యాంకర్ శ్రీముఖి ఇచ్చారని విన్నామని అవినాశ్‍ను రితూ అడిగారు. అయితే, శ్రీముఖి రూ.5లక్షలు ఇచ్చారని, ఫ్రెండ్స్ మిగతాది ఇచ్చారని అన్నారు. మళ్లీ 15 రోజుల్లోనే వాళ్ల డబ్బులు తిరిగి ఇచ్చేశానని అవినాశ్ తెలిపారు. శ్రీముఖి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు.

ఆత్మహత్య చేసుకోవాలనిపించింది

కరోనా సమయంలో తనకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులపై కూడా అవినాశ్ మాట్లాడారు. హోమ్ లోన్ ఈఎంఐలు కట్టలేక చాలా కష్టాలు పడ్డానని చెప్పారు. అప్పుడు బిల్డింగ్‍పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని చెప్పారు. బిగ్‍బాస్ నుంచి పిలుపు వచ్చాక చాలా సంతోషంగా అనిపించిందని అవినాశ్ చెప్పారు. బిగ్‍బాస్ తనకు మరో జన్మ ఇచ్చిందని మరోసారి అన్నారు. ఆ షో వల్ల ఆర్థిక సమస్యలు తీరాయనేలా మాట్లాడారు. బిగ్‍బాస్ తెలుగు 4వ సీజన్‍లో అవినాశ్ పాల్గొన్నారు.

బూట్ కట్ బాలరాజు సినిమా అప్పుడు ‘సినిమా చూడండి’ అంటూ మీడియా ముందు సోహెల్ ఎమోషనల్ అయితే.. అవినాశ్ ఓదార్చారు. ఈ విషయంపై కూడా రితూ ప్రశ్నలు అడిగారు. అయితే, అది అంత ట్రోల్ అవుతుందని తాను అనుకోలేదని అవినాశ్ చెప్పారు. ఆ విషయంలో బాధపడ్డానని అన్నారు.

అవినాశ్ ప్రస్తుతం స్టార్ మా ఛానెల్‍ షోల్లో కనిపిస్తున్నారు. నీతోనే డ్యాన్స్ 2.0, ఆదివారం విత్ స్టార్ మా పరివారం సహా మరిన్ని షోలు చేస్తున్నారు. స్పెషల్ షోల్లోనూ సందడి చేస్తున్నారు. అలాగే, సినిమాల్లోనూ తరచూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని అవినాశ్ చెప్పారు.

Whats_app_banner