Mahesh Babu: మహేష్ బాబుతో నేను చేయాలనుకున్న సినిమా యానిమల్ కాదు: సందీప్ రెడ్డి వంగా-i narrated devil movie script to mahesh babu not animal says sandeep reddy vanga ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: మహేష్ బాబుతో నేను చేయాలనుకున్న సినిమా యానిమల్ కాదు: సందీప్ రెడ్డి వంగా

Mahesh Babu: మహేష్ బాబుతో నేను చేయాలనుకున్న సినిమా యానిమల్ కాదు: సందీప్ రెడ్డి వంగా

Hari Prasad S HT Telugu
Nov 27, 2023 08:31 PM IST

Mahesh Babu: మహేష్ బాబుతో తాను సినిమా చేయాలనుకున్న మాట నిజమే అయినా.. అది యానిమల్ కాదని అన్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. యానిమల్ మూవీ టీమ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

ర‌ణ్‌బీర్ క‌పూర్, సందీప్ వంగా
ర‌ణ్‌బీర్ క‌పూర్, సందీప్ వంగా

Mahesh Babu: అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా యానిమల్ లాంటి సినిమా అంటేనే ఎంతో ఆసక్తి రేపుతోంది. నిజానికి ఈ యానిమల్ మూవీనే అతడు మహేస్ బాబుతో చేయాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో వీటిపై సందీప్ రెడ్డి స్పష్టత ఇచ్చాడు.

యానిమల్ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుండగా.. సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మూవీ టీమ్ మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడాడు. తాను మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నానని, అయితే అది యానిమల్ మాత్రం కాదని అతడు స్పష్టం చేశాడు.

యానిమల్ మూవీలో హీరో పాత్ర ఎలా ఉంటుందో అలాంటి పాత్రతోనే మరో సినిమా స్టోరీ మహేష్ కు చెప్పినట్లు సందీప్ వెల్లడించాడు. "నేను మహేష్ కు చెప్పిన స్టోరీ యానిమల్ ది కాదు. అతనికి డెవిల్ స్టోరీ చెప్పాను. ఆ పాత్ర కూడా ఇలాంటిదే. కానీ యానిమల్ కంటే కూడా మరింత వయోలెంట్ పాత్ర అది" అని సందీప్ రెడ్డి వంగా చెప్పాడు.

అయితే యానిమల్ లో రణ్‌బీర్ పాత్రకు సరిపోయే హీరో ఎవరని అడిగితే మాత్రం అతడు ఏమాత్రం ఆలోచించకుండా మహేష్ బాబు పేరు చెప్పడం విశేషం. యానిమల్ మూవీ రిలీజ్ కోసం వేచి చూస్తున్న సందీప్.. తర్వాత ప్రభాస్ తో స్పిరిట్, అల్లు అర్జున్ తో మరో సినిమా చేస్తున్నాడు. వీటి తర్వాత మహేష్ తో అతడు సినిమా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక యానిమల్ మూవీ విషయానికి వస్తే వచ్చే శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజైన విషయం తెలిసిందే. 3 గంటల 22 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీకి సీబీఎఫ్‌సీ ఎ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌బీర్ మరీ వయోలెంట్ పాత్ర పోషించాడు. ట్రైలర్ లో రణ్‌బీర్, బాబీ డియోల్ మధ్య సీన్స్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి రేపాయి.

Whats_app_banner