Salaar: సలార్ చిత్రంలో ప్రభాస్‍తో నటించే ఛాన్స్ వచ్చినా.. మిస్ అయింది: హీరోయిన్
Salaar: ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్‍కు జోడీగా మాళవిక మోహనన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అయితే, ముందు తనకు సలార్ చిత్రంలోనే అవకాశం వచ్చిందని తాజాగా ఆమె వెల్లడించారు. మరిన్ని విషయాలను చెప్పారు.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‍కు జోడీగా శృతి హాసన్ నటించారు. అయితే, సలార్ మూవీలో తనకు ముందుగా అవకాశం వచ్చిందని తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్‍తో ది రాజాసాబ్ మూవీలో మాళవిక నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సలార్ ఛాన్స్ మిస్ అయిన విషయాన్ని చెప్పారు.
ఆ సినిమాలతో ఫ్యాన్ అయ్యా.. సలార్ మిస్ అయింది
బాహుబలి 1, 2 సినిమాలు చూశాక తాను ప్రభాస్‍కు అభిమానినయ్యానని మాళవిక మోహనన్ తెలిపారు. దీంతో ఆయనతో కలిసి ఒక్క సినిమాలో అయినా పని చేయాలనుకున్నట్టు చెప్పారు. సలార్‌లో అవకాశం వచ్చిన చేయలేకపోయానని వెల్లడించారు. “బాహుబలి 1, 2 తర్వాత ఆయనకు నేను పెద్ద అభిమానిని అయ్యా. ప్రశాంత్ నీల్ నన్ను కలిసి సలార్‌లో నటించాలని అడగాలనుకున్నారు. ఇది మ్యాజిక్‍లా అనిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల అది జరగలేదు” అని మాళవిక చెప్పారు. వేరే ప్రాజెక్టుల వల్ల సలార్ సినిమా మిస్ అయిందన్నట్టుగా చెప్పారు.
ప్రభాస్‍తో నటించడం చాలా బాగుంది
ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్‍తో కలిసి నటిస్తుండడం చాలా ఉత్సాహకరంగా ఉందని మాళవిక మోహనన్ చెప్పారు. “మారుతీ నుంచి కాల్ వచ్చింది. ప్రభాస్‍తో పని చేసే అవకాశం వచ్చింది. ప్రభాస్‍తోనే తెలుగులో అడుగుపెట్టాలని రాసిపెట్టి ఉందనుకుంటా. ది రాజాసాబ్‍లో ప్రభాస్‍తో కలిసి నటిస్తుండడం ఫన్‍గా, ఎగ్జైటింగ్‍గా ఉంది” అని మాళవిక మోహనన్ చెప్పారు.
ది రాజా సాబా చిత్రం హారర్, కామెడీ, రొమాన్స్‌తో ఉంటుందని మాళవిక అన్నారు. ఈ మూవీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ డ్యుయల్ చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.
ది రాజా సాబ్ చిత్రంలో మాళవికతో పాటు నిధి అగర్వాల్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీన ఈ మూవీని నుంచి ఓ మోషన్ పోస్టర్ వీడియో వచ్చింది. డిఫరెంట్ గెటప్‍లో ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఉన్నారు. దీంతో ఈ హారర్ కామెడీ రొమాంటిక్ చిత్రం క్యూరియాసిటీ మరింత పెరిగిపోయింది. ఈ రాజా సాబ్ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంబంధిత కథనం