Balakrishna: ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా..: బాలకృష్ణ-i do not wear black color on sunday daaku maharaj star balakrishna reveals ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna: ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా..: బాలకృష్ణ

Balakrishna: ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా..: బాలకృష్ణ

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 19, 2025 07:28 PM IST

Balakrishna: ఆదివారం తనకు ఉన్న ఓ నమ్మకాన్ని బాలకృష్ణ వెల్లడించారు. ఓసారి ఆ రంగు డ్రెస్ వేసుకున్నందుకు నడుము విరిగిందని అన్నారు. డాకు మహారాజ్ కోసం తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు.

Balakrishna: ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా..: బాలకృష్ణ
Balakrishna: ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా..: బాలకృష్ణ

టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం అదరగొడుతోంది. జోరుగా కలెక్షన్లను రాబడుతోంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా గత వారం జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం ఇప్పటికే రూ.100కోట్ల కలెక్షన్లను దాటిపోయింది. తాజాగా ఈ చిత్రం కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు బాలకృష్ణ. తనకు ఉన్న ఓ నమ్మకం గురించి వెల్లడించారు.

ఆదివారం నాకు బ్లాక్ డేంజర్

డాకు మహారాజ్ సినిమా సక్సెస్ కావడంతో యాంకర్ సుమతో మూవీ టీమ్ ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. బాలకృష్ణతో పాటు ఈ సినిమా డైరెక్టర్ బాబీ, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం రోజు తాను నలుపు రంగు దుస్తులు అసలు వేసుకోనని బాలకృష్ణ చెప్పారు. ఆరోజున తనకు బ్లాక్ డేంజర్ అని అన్నారు.

నడుము విరిగింది

తనది మూలా నక్షత్రం అని, తనకు ఆదివారం నలుపు మంచిది కాదని బాలకృష్ణ చెప్పారు. ఓసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం బ్లాక్ డ్రెస్ వేసుకుంటే.. తన నడుము విరిగిందని అన్నారు. “ఆదివారం నలుపు రంగు వేసుకోను. కానీ ఓసారి బ్లాస్ డ్రెస్ ధరించిన ఘటన చెబుతా. ఆదిత్య 369 చిత్రానికి ఎస్‍పీ బాలసుబ్రమణ్యం ఓ నిర్మాతగా ఉన్నారు. నేను ఆరోజు బ్లాక్ డ్రెస్ వేసుకొని వెళ్లా. అప్పుడు మనసు చెబుతూనే ఉంది.. ఈ రోజు సండే వద్దు అని. రాకరాక ఆయన షూటింగ్ స్పాట్‍కు వచ్చారు. ఆయన కళ్ల ముందే కిందపడి నా నడుము విరిగింది” అని బాలకృష్ణ చెప్పారు. తాను వచ్చినప్పుడు ఇలా జరిగిందని బాలసుబ్రమణ్యం కంగారు పడ్డారని, ఆ తర్వాత ఆయన షూటింగ్‍కు ఎప్పుడూ రాలేదని బాలయ్య చెప్పారు.

నా రికార్డులన్నీ నిజాలు

ఇప్పటి వరకు తన రికార్డులన్నీ నిజాలని, గోరంత దాన్ని కొండంత చేసే అలవాటు లేదని ఈ ఇంటర్వ్యూలోనే అన్నారు బాలకృష్ణ. “ఇండస్ట్రీలో మేమంతా చాలా జెన్యూన్‍గా ఉంటాం. గోరంతను కొండంత చేసే అలవాటు మాకు లేదు. ఆ సంస్కృతి, సంస్కారం నా దగ్గర లేదు. నా రికార్డులన్నీ అన్‍స్టాపబుల్” అని బాలకృష్ణ చెప్పారు. తాను షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని బాలయ్య వెల్లడించారు. ఇంటి పక్కనే షూటింగ్ జరుగుతున్నా అక్కడి ఆహారమే తింటానని చెప్పారు.

డాకు మహారాజ్ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.120కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సుల్లో బాలయ్య అదరగొట్టారు. స్టైలిష్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు బాబీ కొల్లి. ఈ మూవీలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా, సచిన్ ఖేడేకర్ కీలకపాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేసిన డాకు మహారాజ్ చిత్రానికి థమన్ సంగీతం మెప్పించింది. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది.

Whats_app_banner

సంబంధిత కథనం