Rashmika Mandanna : కెరీర్ ప్రారంభంలోనే ఆ తప్పు చేశాను
Rashmika Mandanna On Trolls : రష్మిక మందన్న.. ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరు. అయితే ఆమె ఏ పని చేసినా ట్రోల్స్ చేసేవారు కొంతమంది ఉంటారు. ట్రోల్స్ విషయంపై ఆమె స్పందించింది. కొన్ని విసుగు తెప్పిస్తున్నాయని చెప్పుకొచ్చింది.
నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ఆ మధ్య చేసిన ప్రకటన పెద్ద దుమారాన్ని రేపింది. 'సౌత్ ఇండియాలో మాస్ మసాలా, ఐటెం సాంగ్స్ ఉంటాయి. కానీ రొమాంటిక్ సాంగ్స్ విషయంలో మాత్రం బాలీవుడ్(Bollywood) ది బెస్ట్ . బాలీవుడ్లో నా తొలి రొమాంటిక్ సాంగ్ రాబోతోంది'. అని వ్యాఖ్యలు చేసింది. దీనిపై పలువురు విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై రష్మిక మందన్న క్లారిటీ ఇచ్చింది . అంతేకాదు పదేపదే ట్రోల్(Troll)కు గురవుతున్నందుకు ఆవేదనను వ్యక్తం చేసింది.
ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడింది. బాలీవుడ్ రోమాంటిక్ పాటలకు(Romantic Songs) సంబంధించి.. ఆమె కామెంట్స్ గురించి అడిగారు. ఈ విషయమై రష్మిక మాట్లాడుతూ.. 'ఆ రోజు నా మాటలు సగంలో ఆగిపోయాయి. నాకు ఇంకా ఏదో మాట్లాడాలని ఉంది. నా రొమాంటిక్ సాంగ్స్ చాలా సౌత్ లో హిట్ అయ్యాయి. ఎలాగైనా అర్థం చేసుకుంటారని నేను చెప్పడం కొనసాగించలేదు. కానీ తర్వాత ట్రోల్ చేశారు.' అని రష్మిక చెప్పుకొచ్చింది.
రష్మికను ఎందుకు ట్రోల్ చేస్తున్నారనే.. ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతుంది. దీనికి ఆమె సమాధానమిచ్చింది.. 'ట్రోల్స్, విమర్శలకు నేను స్పందించలేదు. ఇది నేను ఇచ్చే గౌరవం. వాటి మీద ఏం మాట్లాడకుండా.. నేను ప్రతిదీ అంగీకరిస్తున్నాను. కెరీర్ మొదట్లో ఆ తప్పు చేశాను. అయితే, ఇప్పుడు విమర్శలను అంగీకరించలేం. అది నా కుటుంబంపై ప్రభావం చూపుతోంది' అని రష్మిక తెలిపింది.
రష్మిక మందన్న నటించిన 'మిషన్ మజ్ను'(Mission Majnu) జనవరి 20న OTTలో విడుదలైంది. ఈ సినిమాలో రష్మిక మందన్న నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అంధురాలి పాత్రలో నటించింది.
ఇటీవల సంక్రాంతి సందర్భంగా కూడా రష్మిక ట్రోల్స్ కు గురైంది. గోధుమ రంగు కుర్తా ధరించి, నమస్కరిస్తున్న ఫోటోను రష్మిక క్లిక్ చేసి తన సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసింది. అలాగే కొన్ని భాషల్లో సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసింది. ముందుగా కన్నడలో సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసి.. అనంతరం తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, ఆంగ్ల భాషల్లో పండుగ శుభాకాంక్షలు చెప్పింది. కొందరు రష్మికకు తిరిగి విష్ చేయగా, మరికొందరు ఆమెను ట్రోల్ చేయడం మెుదలెట్టారు.
'మొదట కన్నడ(Kannada)లో రాసినంత మాత్రాన నీకు కన్నడంటే ఇష్టమని చెప్పలేం. కన్నడతో అకస్మాత్తుగా ఎలా ప్రేమలో పడ్డారు? మీరు ఇంతకు ముందు చేసిన వాటిని మేం ఎప్పటికీ మరచిపోం. మేం ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా కన్నడిగులలాగే ఉంటాం. మీ ఈ నకిలీ కన్నడ ప్రేమ మాకు వద్దు. కనీసం ఇప్పుడు అయినా కన్నడ ప్రాముఖ్యత తెలుసా?' అని ఆమెపై నెటిజన్లు ఫైర్ అయ్యారు... ట్రోల్స్ చేశారు.
సంబంధిత కథనం