Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం హిట్టయిన తెలుగులో ఆఫర్లు రాలేదు - ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం హిట్టయినా తెలుగులో ఒక్క సినిమా ఆఫర్ రాలేదని ఐశ్వర్య రాజేష్ అన్నది. టిఫికల్ కమర్షియల్ హీరోయిన్ కాకపోవడంతోనే ఎవరూ తనకు అవకాశం ఇవ్వడం లేదనుకుంటున్నట్లు చెప్పింది. ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్‌లోనే పెద్ద హిట్టును తన ఖాతాలో వేసుకుంది ఐశ్వర్య రాజేష్. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలకు పోటీగా సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ పండుగ విన్నర్‌గా నిలిచింది.
తొలి సక్సెస్...
సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి, రిపబ్లిక్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది ఐశ్వర్య రాజేష్. కానీ అవేవి ఆమెకు విజయాన్ని అందించలేకపోయాయి. తొలి సక్సెస్‌ను సంక్రాంతికి వస్తున్నాం మూవీతోనే అందుకున్నది.
ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీలో వెంకటేష్ భార్య పాత్రలో తన కామెడీ టైమింగ్, యాక్టింగ్‌తో మెప్పించింది ఐశ్వర్య రాజేష్. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. వెంకటేష్‌తో పోటీపడినటించిందంటూ చెబోతున్నారు.
ఒక్క ఆఫర్ రాలేదు...
సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్టయిన తనకు తెలుగు నుంచి ఇప్పటివరకు ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదని ఐశ్వర్య రాజేష్ కామెంట్స్ చేసింది. తనకు అవకాశాలు ఇవ్వడానికి తెలుగు వాళ్లకు టైమ్ కావాలేమోనని అన్నది. “టిఫికల్ కమర్షియల్ టైప్ హీరోయిన్‌ను నేను కాదు. అందువల్లనేమో నాకు ఆఫర్లు రాలేదనుకుంటున్నానని” ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ చెప్పింది.
ఎవరిని అడగను...
సంక్రాంతికి వస్తున్నాం సినిమా షూటింగ్, ప్రమోషన్స్ కారణంగా కొన్ని తమిళ సినిమాల అవకాశాలు కోల్పోయానని తెలిపింది. “తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరిక ఉంది. అయితే అవకాశాల కోసం ఎవరిని అడగలేదు. అలా అడగటం ఇష్టం ఉండదు. వచ్చిన ఆఫర్లు చేసుకుంటూ వెళ్లిపోతానని” అన్నది. తమిళంలో మాత్రం చాలా దర్శకులు తనను దృష్టిలో పెట్టుకొని మంచి కథలు రాస్తున్నారని ఐశ్వర్య రాజేష్ అన్నది. ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
సుడల్ 2
అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్ తమిళంలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ప్రస్తుతం తమిళంలో మూడు, కన్నడంలో ఓ సినిమా చేస్తోంది. ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్‌లో నటించిన సుడల్ వెబ్‌సిరీస్ సీజన్ 2 ఫిబ్రవరి 28న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతోంది.
సంబంధిత కథనం
టాపిక్