OTT Crime Thriller Movie: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ప్రేమలు హీరో మరో హిట్
OTT Crime Thriller Movie: ఓటీటీలోకి ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెండు నెలల తర్వాత వస్తోంది. ప్రేమలు హీరో నస్లేన్ కే గఫూర్ నటించిన ఈ సినిమా గతేడాది నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
OTT Crime Thriller Movie: ప్రేమలు మూవీ గతేడాది ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసు కదా. ఆ మూవీ హీరో నస్లేన్ కే గఫూర్ నటించిన మరో హిట్ మూవీ ఐ యామ్ కాథలన్ (I Am Kathalan). ఈ సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమాను మనోరమ మ్యాక్స్ స్ట్రీమింగ్ చేయబోతోంది. తాజాగా మంగళవారం (జనవరి 7) ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను చూడొచ్చు. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో నస్లేన్ కే గఫూర్ తోపాటు దిలీష్ పోత్, లిజోమోల్ జోస్ కూడా నటించారు. ఈ టెక్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఐ యామ్ కాథలన్ మూవీ స్టోరీ ఏంటంటే?
ప్రేమలు హీరో నస్లేన్ కే గఫూర్ ఈ ఐ యామ్ కాథలన్ సినిమాలో విష్ణు అనే బీటెక్ గ్రాడ్యుయేట్ పాత్రలో నటించాడు. సరిగా చదవలేక, బ్యాక్‌లాగ్స్ తో కుస్తీలు పడుతుంటాడు. అదే సమయంలో అతని గర్ల్‌ఫ్రెండ్ శిల్ప కూడా అతనికి గుడ్ బై చెబుతుంది. ఆమె తండ్రి కూడా అతన్ని అవమానిస్తాడు.
దీనిని మనసులో పెట్టుకున్న విష్ణు.. తన హ్యాకింగ్ ప్రతిభతో అతనిపై రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. శిల్ప తండ్రి వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుంటాడు. అదే సమయంలో ఓ ఎథికల్ హ్యాకర్ కూడా సీన్లోకి ఎంటరవడంతో సీన్ మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ ఐ యామ్ కాథలన్ మూవీలో చూడొచ్చు.
కేరళలోని ఓ చిన్న ఊళ్లో జరిగిన కథగా గిరీష్ ఈ మూవీని తెరకెక్కించినా.. హ్యాకింగ్ నే కథాంశంగా తీసుకొని అద్భుతంగా తీశాడని ప్రేక్షకులు మంచి మార్కులు ఇచ్చారు. ఈ సినిమాలో నస్లేన్ నటన కూడా ఆకట్టుకునేలా ఉంది. ప్రేమలుతో నస్లేన్, గిరీష్ కాంబినేషన్ సూపర్ హిట్ కొట్టింది. ఈ ఐ యామ్ కాథలన్ తో మరోసారి దానిని రిపీట్ చేసింది. అటు ప్రేమలు మూవీకి కూడా సీక్వెల్ రాబోతోంది.