Mahesh Babu: రోజులో స్మార్ట్‌ఫోన్ ఎంత సేపు వాడతారు?: మహేశ్ బాబు ఆన్సర్ ఇదే.. ‘గుంటూరు కారం’ రిలీజ్‍పై క్లారిటీ
Mahesh Babu: రోజులో మొబైల్ ఎంత సేపు వాడతారనే ప్రశ్న సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎదురైంది. దీనికి ఆయన సమాధానం చెప్పారు. అలాగే, గుంటూరు కారం సినిమా రిలీజ్ గురించి స్పష్టతనిచ్చారు.
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఆ చిత్రం ఉండనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ జరుగుతోంది. కొన్ని అవాంతరాలు ఎదురైనా మళ్లీ చిత్రీకరణ షురూ అయింది. కాగా, మహేశ్ బాబు నేడు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపోర్టర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
మొబైళ్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయించే మల్టీ స్టోర్స్ కంపెనీ ‘బిగ్ సీ’కి బ్రాండ్ అంబాసిడార్‌గా మహేశ్ బాబు ఉన్నారు. ఆ సంస్థ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. “మీరు రోజులో ఎంత సమయం స్మార్ట్ ఫోన్ వాడతారు” అని ఒకరు మహేశ్‍ను అడిగారు. దీనికి ఆయన సమాధానం చెప్పారు.
అందరిలాగే తాను కూడా ఎక్కువగా ఫోన్ వాడతానని మహేశ్ బాబు చెప్పారు. “మంచి క్వశ్చన్ అడిగారు. మీ అందరిలాగే బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. తలకాయ నొప్పి వచ్చి ఆపేయడానికి కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తాను” అని మహేశ్ జవాబు చెప్పారు. గుంటూరు కారం రిలీజ్ గురించి కూడా ఎదురైన ప్రశ్నకు ఆయన స్పందించారు. ముందుగా చెప్పిన విధంగా వచ్చే ఏడాది సంక్రాంతికి ఆ సినిమా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చారు.
“గుంటూరు కారం సినిమా సంక్రాతికి వస్తుంది. మీ అందరూ చాలా ఆనందంగా ఉంటారు” అని మహేశ్ చెప్పారు.
మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‍లో మూడో చిత్రంగా గుంటూరు కారం రూపొందుతోంది. గతంలో వీరి కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. మళ్లీ సుమారు 13ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి పని చేస్తున్నారు. గుంటూరు కారం చిత్రానికి ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుంచి తొలి పాట వచ్చే అవకాశం ఉంది.
గుంటూరు కారం చిత్రం నుంచి పూజా హెగ్డే తప్పుకోవటంతో మెయిన్ హీరోయిన్‍గా శ్రీలీల చేయనున్నారు. మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఈనెలలో రిలీజ్ చేసిన పోస్టర్లు చిత్రంపై ఆసక్తిని పెంచాయి. పంచెకట్టులో మాస్ లుక్‍తో మహేశ్ అదిరిపోయారు. గుంటూరు కారం చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.