Hyderabad Police | మహేశ్ బాబు ట్రైలర్‌ను వాడేసిన పోలీసులు.. ఆ సీన్‌తో అవగాహన-hyderabad police uses sarkaru vaari paata trailer scene for helmet awareness
Telugu News  /  Entertainment  /  Hyderabad Police Uses Sarkaru Vaari Paata Trailer Scene For Helmet Awareness
సర్కారు వారి పాట
సర్కారు వారి పాట (twitter)

Hyderabad Police | మహేశ్ బాబు ట్రైలర్‌ను వాడేసిన పోలీసులు.. ఆ సీన్‌తో అవగాహన

03 May 2022, 8:37 ISTMaragani Govardhan
03 May 2022, 8:37 IST

మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట ట్రైలర్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ట్రైలర్‌లోని ఓ సన్నివేశాన్ని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఉపయోగించారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా సోమవారం విడుదలైన ట్రైలర్‌తో మహేశ్ అభిమానులకు పూనకాలే వచ్చేశాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ ట్రైలర్ అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. తాజాగా హైదరాబాద్ పోలీసులు కూడా ఈ ట్రైలర్‌ను మెచ్చేశారు. దీంతో ఈ సినిమా ప్రచార చిత్రంలోని సీన్‌ను వాడేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇటీవల కాలంలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సినిమాలతో పాటు నెట్టింట వైరల్ అయ్యే వీడియోలను కూడా ఉపయోగించుకుంటున్నారు. మంచి పని కోసం సినిమా మాధ్యమం బాగా ఉపయోగపడుతుందని భావించిన వారు చాలా సందర్భాల్లో సదరు సినిమాల సన్నివేశాలను తీసుకున్నారు. తాజాగా మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాటలోని ఓ సీన్‌ను తీసుకున్నారు. ట్రైలర్‌లో ఓ సన్నివేశంలో విలన్‌కు హెల్మెట్ పెడుతూ మహేశ్ డైలాగ్ చెప్తారు. ఈ సీన్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్ అకౌంట్ నిర్వాహకులు వాడారు. మూవీలోని ఆ వీడియోను పోస్ట్ చేస్తూ హెల్మెంట్ ధరించంటి అని క్యాప్షన్ పెట్టారు.

వైరల్ అయిన వీడియోలను, సాంగ్స్ లాంటి వాటిని మార్ఫింగ్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక సినిమాలోని ట్రైలర్ ధరించే సీన్ ఉండేసరికి వీడియోను పోస్ట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి కళావతి, ఎవ్రీ పెన్నీ లాంటి సాంగ్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ప్రపంచ వ్యాప్తంగా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కీర్తి సురేశ్ ఇందులో కథానాయికగా నటించింది.

సంబంధిత కథనం

టాపిక్