Tollywood: తెలంగాణలో డ్రగ్స్‌ను ఎక్కువగా టాలీవుడ్ వర్గాలే వినియోగిస్తోన్నాయని హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి తొలుత టాలీవుడ్‌ను టార్గెట్ చేశాడు. తెలుగు సినీ పరిశ్రమలోనే డ్రగ్స్ పార్టీలు ఎక్కువగా జరుగుతుంటాయని, డ్రగ్స్ వాడకాన్ని టాలీవుడ్ ప్రోత్సహిస్తుందని శ్రీనివాసరెడ్డి అన్నాడు.
డిమాండ్ ఉంది కాబట్టే ఎన్ని విధాలుగా అడ్డుకున్న ఇంకా డ్రగ్స్ సప్లై హైదరాబాద్‌లో ఉందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమేసేందుకు టాలీవుడ్ పెద్దలతో పాటు సినీ పరిశ్రమలోని అసోసియేషన్స్‌తో మీటింగ్ ఏర్పాటుచేయబోతున్నట్లు కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపాడు. ఇండస్ట్రీ కూడా ఈ డ్రగ్స్‌ను అడ్డుకట్ట వేయడానికి చొరవ తీసుకొని సమావేశాలు ఏర్పాటుచేసుకోవాలని సూచించాడు.
సినీ వర్గాల్లో మంచి, చెడు రెండు ఉన్నాయని అన్నారు. డ్రగ్స్ వినియోగం సినీ పరిశ్రమలోనే ఎక్కువగా ఉంది కాబట్టి టాలీవుడ్ పెద్దలు దీనిపై ఫోకస్ పెట్టాలని శ్రీనివాసరెడ్డి సూచించారు
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్సించారని శ్రీనివాసరెడ్డి అన్నారు. డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపబోతున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. టాలీవుడ్‌ను ఉద్దేశించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
టాపిక్