Tejus Kancherla: మా నాన్నను చాలా కష్టపెట్టాను.. కాఫీ షాప్, బార్ షాప్ ఎక్కడపడితే అక్కడంటూ హుషారు హీరో కామెంట్స్-husharu fame tejus kancherla about his father in uruku patela teaser launch adivi sesh released uruku patela teaser ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tejus Kancherla: మా నాన్నను చాలా కష్టపెట్టాను.. కాఫీ షాప్, బార్ షాప్ ఎక్కడపడితే అక్కడంటూ హుషారు హీరో కామెంట్స్

Tejus Kancherla: మా నాన్నను చాలా కష్టపెట్టాను.. కాఫీ షాప్, బార్ షాప్ ఎక్కడపడితే అక్కడంటూ హుషారు హీరో కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Tejus Kancherla Comments In Uruku Patela Teaser Launch: ఉరుకు పటేల మూవీ టీజర్‌ను హీరో అడవి శేష్ రిలీజ్ చేశారు. ఉరుకు పటేలా టీజర్ లాంచ్ కార్యక్రమంలో తన తండ్రిని చాలా కష్టపెట్టినట్లు యంగ్ హీరో, హుషారు ఫేమ్ తేజస్ కంచర్ల ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

మా నాన్నను చాలా కష్టపెట్టాను.. కాఫీ షాప్, బార్ షాప్ ఎక్కడపడితే అక్కడంటూ హుషారు హీరో కామెంట్స్

Tejus Kancherla About His Father: హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ‌స్ కంచ‌ర్ల‌. తాజాగా తేజ‌స్ చేస్తోన్న సినిమా ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ అనేది సినిమా ట్యాగ్ లైన్‌. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు.

ఉరుకు పటేల సినిమాకు వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహించారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూర్చారు. తాజాగా ఉరుకు పటేల మూవీ టీజర్‌ను అడివి శేష్ రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహంచిన ఉరుకు పటేల టీజర్ లాంచ్ ఈవెంట్‌లో తేజస్ కంచర్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"మా టీజర్‌ను లాంచ్ చేసిన అడివి శేష్ గారికి థాంక్స్. మంచి కంటెంట‌్‌ను ఇవ్వాలని కాస్త టైం తీసుకున్నాను. మా నాన్నను చాలా కష్టపెట్టాను. ప్రవీణ్ లక్కరాజు మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఆగస్ట్ నుంచి పాటల్ని రిలీజ్ చేస్తాం. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని హీరో తేజస్ కంచర్ల చెప్పాడు.

"మా దర్శకుడు వివేక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. కాఫీ షాప్, బార్ షాప్ ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని చర్చించుకునే వాళ్లం. కెమెరామెన్ సన్నీ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కుష్బూతో నటించడం ఆనందంగా ఉంది. సెట్స్‌కి కరెక్ట్ టైంకి వచ్చి ఎంతో సహకరించారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని హుషారు హీరో తేజస్ కంచర్ల తెలిపాడు.

ఇక దర్శకుడు వివేక్ రెడ్డి మాట్లాడుతూ.. "టీజర్ లాంచ్ చేసిన అడివి శేష్ గారికి థాంక్స్. మా సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు. మా నిర్మాతే మా చిత్రానికి ఒరిజినల్ పటేల. ఆ తరువాత హీరో తేజస్. మేం అంతా కలిసి మంచి చిత్రాన్ని తీశాం. నా మొదటి చిత్రానికే మంచి నిర్మాత దొరికారు. ఈ కథను ముందుగా నా ఏడీ మారుతికి చెప్పాను. నాలుగైదేళ్ల నుంచి వాళ్లు నాతోనే ప్రయాణం చేశారు. తేజస్‌కి కథ చెబుతూ డెవలప్ చేశాం. నిర్మాత గారు మాకేం కావాలో.. ఎంత కావాలో అంతా ఇచ్చారు" అని అన్నారు.

"టీజర్‌లో పూర్తి కథను చెప్పలేదు. సినిమా స్టోరీ చాలా బాగుంటుంది. మీకు వన్ పర్సెంటేజ్ మాత్రమే చూపించాం. బాల భాను గారు విజనరీ ప్రొడ్యూసర్. వివేక్ మంచి కథను రాశారు. షూటింగ్ అప్పుడే అయిపోయిందా? అని అనిపించింది. తేజస్‌తో పని చేయడం ఆనందంగా ఉంది" అని ఉరుకు పటేల హీరోయిన్ కుష్బూ చౌదరి తెలిపింది.

నిర్మాత బాల భాను మాట్లాడుతూ.. "ఇది మా మొదటి సినిమా. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ మీద మా అబ్బాయి తేజస్‌తో ఈ చిత్రాన్ని తీస్తున్నాం. వివేక్ మంచి కథను రాశారు. అందరూ ఆదరించండి" అని అన్నారు. కాగా.. ఉరుకు పటేల సినిమాను హీరో తేజస్ కంచర్ల తండ్రి కంచర్ల బాల భాను నిర్మాతగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్నారు.