Huma Qureshi Buys Benz car: బెంజ్ కారు కొన్న బాలీవుడ్ బొద్దుగుమ్మ.. కాస్ట్ ఎంతో తెలుసా?-huma qureshi buys swanky new mercedes benz gls worth rs 1 19 crore ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Huma Qureshi Buys Swanky New Mercedes-benz Gls Worth <Span Class='webrupee'>₹</span>1.19 Crore

Huma Qureshi Buys Benz car: బెంజ్ కారు కొన్న బాలీవుడ్ బొద్దుగుమ్మ.. కాస్ట్ ఎంతో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Mar 07, 2023 01:50 PM IST

Huma Qureshi Buys Benz car: బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి సరికొత్త బెంజ్ కారును కొనుగోలు చేసింది. ఈ ముద్దుగుమ్మ మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ మోడల్‌ను సొంతం చేసుకుంది. ఈ కారు ధర వచ్చేసి రూ.1.19 కోట్లుగా ఉంది.

బెంజ్ జీఎల్ఎస్ వాహనాన్ని కొనుగోలు చేసిన హుమా ఖురేషి
బెంజ్ జీఎల్ఎస్ వాహనాన్ని కొనుగోలు చేసిన హుమా ఖురేషి

Huma Qureshi Buys Benz car: బాలీవుడ్ బొద్దుగుమ్మ హుమా ఖురేషి(Huma Quereshi) వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. సినిమాలతో పాటు తన లగ్జరీ లైఫ్ స్టైల్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే కారును కొనుగోలు చేసింది. ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెజ్ బెంజ్‌కు చెందిన లేటెస్ట్ ఎస్‌యూవీ జీఎల్ఎస్ మోడల్‌ను సొంతం చేసుకుంది. మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ(Mercedes Benz GLS 400d) వేరియంట్‌ను హుమా ఖురేషి తన గ్యారేజ్‌కు ఆహ్వానించింది. ఎక్స్ షోరూంలో ఈ వాహనం ఖరీదు వచ్చేసి రూ.1.19 కోట్లు.

కారులోని ఫీచర్లు(Mercedes Benz GLS Features)..

ఈ సరికొత్త బెంజ్ జీఎల్ఎస్ మోడల్‌లో మల్టీ బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఎలక్ట్రల్లీ అడ్జస్టబుల్ వెంటిలేటెర్డ్ ఫ్రంట్ సీట్లు, ఫైవ్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లను పొందుపరిచారు. అంతేకాకుండా ఈ ఎస్‌యూవీలో డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, 12-అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, లేటెస్ట్ MBUX యూజర్ ఇంటర్‌ఫేస్, వైర్లెస్ ఛార్జింగ్ తదితరు ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.

ఈ కారులో ఆర్టికో మ్యాన్ మేడ్‌ లెదర్‌తో తయారు చేసిన సీట్లు అదిరిపోయాయి. ఇవి కాకుండా అదనంగా పానోరామిక్ సన్‌‌రూఫ్, 13-స్పీకర్ బర్‌మెస్టర్ సౌండ్ సిస్టం లాంటి కస్టమైజ్డ్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి కాకుండా కస్టమర్ల సౌకర్యార్థం అదనపు ఫీచర్లను కూడా జోడించే సదుపాయాన్ని కంపెనీ అందించింది.

ఇంజిన్(Mercedes Benz GLS Engine)..

మెర్సిడేజ్ బెంజ్ జీఎల్ఎస్ 400 డీ వేరియంట్ 3.0-లీటర్ సిక్స్ సిలీండర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 325 బీహెచ్‌పీ హార్స్ పవర్, 700 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ ఆయిల్ బర్నర్ 9జీ ట్రానింక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. స్టాండార్డ్ 4 మ్యాటిక్ ఏడబ్ల్యూడీని కలిగి ఉండటం వల్ల ఫోర్ వీల్స్‌కు పవర్ చేరుతుంది. అంతేకాకుండా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.3 సెకండ్లలోనే అందుకుంటుంది. అంతేకాకుండా గరిష్ఠంగా గంటకు 238 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

హుమా కార్ల కలక్షన్(Huma Qureshi Car Collection)..

హుమా ఖురేషి కార్లంటే అమితమైన ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా తన కార్లను అప్డేట్ చేసుకుంటూనే ఉంది. ఈ ముద్దుగుమ్మ మొదటగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ను వాడింది. దీని తర్వాత ల్యాండ్ రోవర్‌ ఫ్రీ ల్యాండర్‌కు మారింది. అనంతంర మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ 250డీ వాహనాన్ని ఎంచుకుంది. తాజాగా బెంజ్ జీఎల్ఎస్ 400డీ మోడల్‌కు షిఫ్టయింది. ఇటీవల కాలంలో ఈ లగ్జరీ జీఎల్ఎస్ మోడల్‌ను కొనుగోలు చేస్తున్న సెలబ్రెటీల జాబితా చాలానే ఉంది. బాలీవుడ్‌లో విక్రాంత్ మాస్సె, మనీష్ పాల్, మనోజ్ బాజ్ పాయ్, దివ్యేందు శర్మ, ప్రతీక్ గాంధీ తదితరులు ఈ కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం హుమా ఖురేషి రెండు సినిమాలు చేస్తోంది. ఇందులో టార్లా అనే సినిమా ఒకటి కాగా.. మరొకటి పూజా మేరీ జాన్‌లో నటిస్తోంది.

IPL_Entry_Point

టాపిక్