Jailer Hukum Telugu Version: రజినీ కాంత్ ‘హుకుం’ తెలుగు వెర్షన్ సాంగ్ రిలీజ్.. పవర్‌ఫుల్‍గా..
Jailer Hukum Telugu Version: జైలర్ సినిమా నుంచి హుకుం అనే పాట తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. విక్టరీ వెంకటేశ్ ఈ పాటను లాంచ్ చేశారు.
Jailer Hukum Telugu Version: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా పాటలు సూపర్ హిట్ అవుతుండటంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. కావాలా, హుకుం సాంగ్స్ ఊపేస్తున్నాయి. కాగా, నేడు జైలర్ చిత్రం నుంచి హుకుం సాంగ్ తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. ఈ సాంగ్‍ను తెలుగులో లాంచ్ చేశారు సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్. హుకుం తెలుగు వెర్షన్ లిరికల్ సాంగ్‍ను ఆయన విడుదల చేశారు.
హుకుం తెలుగు వెర్షన్ సాంగ్ కూడా చాలా పవర్‌ఫుల్‍గా ఉంది. అనిరుధ్ రవిచందర్ అందించిన ఇంటెన్స్ మ్యూజిక్ అదిరిపోయింది. తెలుగులోనూ ఈ సాంగ్ బాగా సెట్ అయింది. హుకుం తెలుగు పాటకు భాస్కరభట్ల రిలిక్స్ అందించారు. సాంగ్ కంటే ముందు రజినీ కాంత్ పవర్ ఫుల్ డైలాగ్ ఉంది. ఆ తర్వాత “ఉరుముకి.. మెరుపుకి పుట్టాడురా.. పిడుగును పిడికిట పట్టాడురా” అంటూ తెలుగులో హుకుం సాంగ్ మొదలవుతుంది. మ్యూజిక్, రజినీ స్టైల్‍కు తగ్గట్టు పవర్‌ఫుల్ లిరిక్స్ అందించారు భాస్కరభట్ల. తెలుగులో ఈ పాటను దినకర్ కాల్వల పాడారు.
హుకుం లిరికల్ సాంగ్‍లో రజినీ కాంత్ స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. పూర్తి యాక్షన్ మోడ్‍లో ఈ పాట ఉంది. జైలర్ చిత్రం ఆగస్టు 10వ తేదీన తమిళంలో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్.. జైలర్ చిత్రాన్ని నిర్మించారు.
జైలర్ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్‍గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్, వినాయకన్, మిర్నా మీనన్, వసంత్ రవి కీలక పాత్రల్లో నటించారు. సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో అతిత్వరలోనే జైలర్ ట్రైలర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.