పవన్ కల్యాణ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ మూవీపై క్రేజీ బజ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ నటించిన ఈ కొత్త సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొందని తెలసింది. ముఖ్యంగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.
పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఓటీటీ రైట్స్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను రికార్డు ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని తెలిసింది. ఇందుకోసం ఈ ఓటీటీ భారీగా చెల్లించనున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఈ అమౌంట్ ఎంత అన్నదానిపై ఇప్పుడైతే క్లారిటీ లేదు. త్వరలోనే తెలిసే అవకాశముంది.
హరిహర వీరమల్లు మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కల్యాణ్ పొలిటికల్, పర్సనల్ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల పవన్ తన పనులన్నింటినీ పక్కనపెట్టి మరీ ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వీటిని త్వరలోనే కంప్లీట్ చేసి మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమాలో చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ నటించారు. మొఘల్ రాజుల నుంచి కోహినూర్ వజ్రాన్ని చోరీ చేసే కథతో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలిసింది. ఈ యాక్షన్ మూవీలో పవన్ ఫైటింగ్ సీక్వెన్స్ మరో లెవల్ లో ఉండబోతున్నాయి. ఈ మూవీలో మొఘల్ రాజుగా బాబీ డియోల్ నటిస్తున్నారు.
నిధి అగర్వాల్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా తదితరులు హరిహర వీరమల్లు మూవీలో కీ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్ఫణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ ఫిల్మ్ కు క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతిక్రిష్ణ డైరెక్టర్లు.
పాన్ ఇండియా మూవీగా రెడీ అవుతున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ రిలీజ్ ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడింది. మే 9న మూవీ రిలీజ్ అవుతుందిన మేకర్స్ ప్రకటించిన అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మే 30న కూడా రిలీజ్ అవుతుందో లేదో సందేహంగా మారింది. చివరకు జూన్ 13న థియేటర్లకు వస్తుందనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది.
సంబంధిత కథనం