Hrithik Wishes to NTR: పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా.. యుద్ధభూమిలో కలుసుకుందాం..!-hrithik roshan drops hint about joining ntr in war 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Hrithik Roshan Drops Hint About Joining Ntr In War 2

Hrithik Wishes to NTR: పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా.. యుద్ధభూమిలో కలుసుకుందాం..!

Maragani Govardhan HT Telugu
May 20, 2023 06:35 PM IST

Hrithik Wishes to NTR: ఎన్టీఆర్‌కు హృతిక్ రోషన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా వార్-2 చిత్రంలో వీరు నటించబోతున్నారనే అంశంపై హింట్ కూడా ఇచ్చారు. ఇందుకు తారక్‌ కూడా పాజిటివ్‌గా స్పందించారు.

హృతిక్-ఎన్టీఆర్
హృతిక్-ఎన్టీఆర్

Hrithik Wishes to NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2 మూవీలో నటించనున్నారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. హృతిక్-తారక్‌ను ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసేందుకు అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయం మీడియా ద్వారా తెలియడమే కానీ.. తారక్ అధికారికంగా ఈ దీనిపై క్లారిటీనే ఇవ్వలేదు. తాజాగా హృతిక్ రోషన్ ఈ కాంబోపై హింట్ ఇచ్చారు. ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాంకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

"హ్యాపీ బర్త్ డే తారక్. నీకు ఈ రోజు సంతోషకరంగా గడవాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం యాక్షన్ ప్యాకెడ్‌గా ఉంటుంది. యుద్ధభూమిలో నీ కోసం ఎదురుచూస్తున్నాను మిత్రమా. మేము పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు మిత్రమా. కలిసే వరకు రాబోయో రోజులు ఆనందం, శాంతి ఉండాలని కోరుకుంటున్నాను." అని హృతిక్ రోషన్ అంటాడు.

హృతిక్ ట్వీట్‌పై ఎన్టీఆర్ స్పందించారు. "మీ కోరికకు ధన్యవాదాలు సార్..! మీరు కూడా రోజులను లెక్కించడం ప్రారంభించాలి. మీరు యుద్ధభూమిలో బాగా విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నాను. దీని గురించి ఎదురుచూస్తున్న ఆలోచిస్తూ నిద్రబోతారని ఆశిస్తున్నాను. త్వరలో కలుద్దాం" అని తారక్ స్పష్టం చేశారు.

వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఈ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ సూపర్ స్పైస్ ఇందులో కనిపించనున్నారు. బీటౌన్ మీడియా వర్గాల ప్రకారం వార్-2లో హృతిక్ రోషన్ హీరోగా చేస్తుండగా.. తారక్ విలన్ పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఇందులో హృతిక్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తోందని సమాచారం. మరోపక్క తారక్ పక్కన ఆలియాను ఫీమేల్ లీడ్‌గా తీసుకోనున్నారట. అయ్యన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.