OTT: ఓటీటీలోకి బ్యాన్ చేసిన దేశభక్తి సినిమా.. 350 కోట్ల బ్లాక్ బస్టర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Fighter OTT Streaming Date: హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జోడీగా నటించిన లేటెస్ట్ దేశభక్తి సినిమా ఫైటర్. పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ ఫైటర్ మూవీకి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ప్రస్తుతం ఆసక్తిగా మారాయి. మరి ఫైటర్ ఓ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందనే వివరాల్లోకి వెళితే..
Fighter OTT Release Date: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఫైటర్. దేశభక్తి చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో హృతిక్ రోషన్‌కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించింది. ఈ లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ డ్రామా మూవీ ఫైటర్‌కు బ్యాంగ్ బ్యాంగ్, వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన యంగ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు.
బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాల్లో హృతిక్ రోషన్ హీరోగా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వార్ 2 కూడా తెరకెక్కుతోంది. కానీ, వార్ 2 మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే, సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాల తర్వాత వచ్చిన మూడో సినిమా ఫైటర్ కావడంతో విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా పఠాన్‌తో హాట్ హీరోయిన్‌గా మరింత క్రేజ్ తెచ్చుకున్న దీపికా కూడా మరో కీ రోల్ ప్లే చేయడంతో మరింత ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.
కాగా ఫైటర్ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ పతాకాలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే ప్రెస్టిజీయస్‌గా నిర్మించారు. ఫైటర్ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో, యానిమల్ నటుడు అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఇక పవర్ ఫుల్ విలన్‌గా రిషబ్ సాహ్ని నటించాడు. ఫైటర్ సినిమా ఈ ఏడాది జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలైంది.
కానీ, అదే సమయంలో ఫైటర్ చిత్రానికి నిషేధం సెగ అంటుకున్న విషయం తెలిసిందే. ఫైటర్ సినిమాపై గల్ఫ్ కంట్రీస్ నిషేధం విధించాయి. ఒక దుబాయ్ (యూఏఈ) తప్పా మిగతా గల్ఫ్ దేశాలన్నింటిలోనూ ఫైటర్ సినిమాను బ్యాన్ చేశారు. బహ్రేన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌది అరేబియా ఇలా ఆరు దేశాల్లో నిషేధం విధించారు. ఒక దుబాయ్‌లో (యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్/యూఏఈ) మాత్రం పీజీ15 వర్గీకరణతో ఫైటర్ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రిలీజ్ చేశారు.
ఉగ్రదాడలు, జమ్ము కశ్మీర్ వంటి సెన్సిబుల్ కంటెంట్ ఉన్న సినిమాలను గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేస్తూ వస్తున్నారు. ఇదివరకు టైగర్ 3 సినిమాకు కూడా ఇలాంటి నిషేధమే ఎదురైంది. ఇదిలా ఉంటే ఇండియాలో విడుదలైన ఫైటర్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్లలో జోరు చూపించింది ఫైటర్ సినిమా. మొత్తంగా ఫైటర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 210 కోట్ల నెట్ కలెక్షన్స్, రూ. 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో ఫైటర్ హిట్ అవడమే కాకుండా లాభాలు కూడా అందుకున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి ఫైటర్ మూవీ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఫైటర్ సినిమాను దాదాపుగా రూ. 180 కోట్లు పెట్టి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఓటీటీ రిలీజ్ థియేట్రికల్ రన్‌కి 50 రోజుల తర్వాత ఉంటుందని టాక్ నడిచింది. దాంతో మార్చి నాలుగో వారంలో ఫైటర్ ఓటీటీలోకి వస్తుందని అనుకున్నారు. దానికితగినట్లుగా మార్చి 21 నుంచి ఫైటర్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే, దీనికంటే ముందుగానే మార్చి 2వ వారంలోని ఫైటర్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని మరో టాక్ నడుస్తోంది.