మరో ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన 5 వేల కోట్ల సూపర్ హిట్ మూవీ- అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్ మూవీ- 4 భాషల్లో స్ట్రీమింగ్!-how to train your dragon ott streaming on jio hotstar in telugu how to train your dragon ott release today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మరో ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన 5 వేల కోట్ల సూపర్ హిట్ మూవీ- అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్ మూవీ- 4 భాషల్లో స్ట్రీమింగ్!

మరో ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన 5 వేల కోట్ల సూపర్ హిట్ మూవీ- అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్ మూవీ- 4 భాషల్లో స్ట్రీమింగ్!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ తెలుగులో రూ. 5 వేల కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన యాక్షన్ అడ్వెంచర్ సినిమా హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈపాటికే ఓ ఓటీటీలో రెంటల్ విధానంలో ఉన్న ఈ మూవీ మరో ఓటీటీకి 4 భాషల్లో సబ్‌స్క్రిప్షన్‌తో చూసేలా రిలీజ్ అయింది. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఓటీటీపై లుక్కేస్తే!

మరో ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన 5 వేల కోట్ల సూపర్ హిట్ మూవీ- అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్ మూవీ- 4 భాషల్లో స్ట్రీమింగ్!

ఓటీటీలోకి ఇటీవల కాలంలో కుప్పలుతెప్పలుగా సినిమా స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ఇతర భాషా సినిమాలు కూడా తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలా ఇవాళ (అక్టోబర్ 13) ఓ సినిమా తెలుగులో ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చింది. ఆ సినిమానే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్.

నాలుగైదు భాగాలుగా

హాలీవుడ్‌లో లైవ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. అయితే, ఇదివరకు యానిమేషన్ రూపంలో నాలుగైదు పార్ట్స్‌గా ఈ సినిమా వచ్చి ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌తో ఈ ఏడాది లైవ్ యాక్షన్ మూవీగా హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్‌ను తీసుకొచ్చారు.

99 శాతం ఫ్రెష్ కంటెంట్ అండ్ రేటింగ్

అదిరిపోయే యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అమెరికాలో జూన్ 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు రొట్టెన్ టోమాటోస్ నుంచి 99 శాతం ఫ్రెష్ కంటెంట్ అని పేరు వచ్చింది. అలాగే ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.8 రేటింగ్ సాధించుకుంది.

బడ్జెట్ అండ్ కలెక్షన్స్

150 మిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 1260 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 635.7 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 5,340 కోట్లు. అంటే, పెట్టిన బడ్జెట్‌కు నాలుగు రెట్ల కలెక్షన్స్ వచ్చాయి.

అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో

అలాంటి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. అయితే, ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఓటీటీ స్ట్రీమింగ్ అయింది. అది కూడా కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్ అయింది.

ఇవాళ జియో హాట్‌స్టార్‌లో

ఇక తాజాగా ఇవాళ (అక్టోబర్ 13) మరో ఓటీటీలోకి వచ్చేసింది హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ. జియో హాట్‌స్టార్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)లో నేటి నుంచి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్, హిందీతోపాటు తెలుగు, తమిళం వంటి నాలుగు భాషల్లో హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఓటీటీ రిలీజ్ అయింది.

పిల్లలు చూసేందుకు బెస్ట్

యానిమేషన్ జీవులతోపాటు మనుషులను చూపించే ఈ లైవ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ పిల్లలు చూసేందుకు బెస్ట్. పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం