Pushpa 2 collections: బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప 2’ రూల్.. 5 రోజుల్లోనే రూ.900 కోట్లు.. ఇందులో అల్లు అర్జున్‌కి ఎంతంటే?
Pushpa 2 worldwide box office collection:పుష్ప 2 బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ముందే ఊహించిన అల్లు అర్జున్ తెలివిగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఓ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్‌కి ఈ మూవీ రూపంలో ఎంత ఆదాయం రానుందంటే?
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ముదులిపేస్తోంది. డిసెంబరు 5న వరల్డ్‌వైడ్‌గా ఆరు భాషల్లో రిలీజైన పుష్ప 2 మూవీ.. ఐదు రోజుల్లోనే రూ.900 కోట్లు వరకూ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీలో సుమారు 12,500 స్క్రీన్లలో రిలీజైన పుష్ప 2 మూవీ.. అన్ని భాషల్లోనూ బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఇది 2021లో వచ్చిన పుష్ప : ది రైజ్’ మూవీకి సీక్వెల్‌కాగా.. పుష్ప 3 కూడా రాబోతుందని దర్శకుడు సుకుమార్ ఇప్పటికే హింట్ ఇచ్చేసిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్‌కి 40%
పుష్ప 2 మూవీ కోసం మూడేళ్లు సమయం కేటాయించిన అల్లు అర్జున్.. ఈ మూవీ ప్రాఫిట్స్‌లో షేర్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి.
కానీ.. సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడం.. మూవీపై ఉన్న నమ్మకంతో అల్లు అర్జున్ పారితోషికానికి బదులుగా ప్రాఫిట్స్‌లో 40% షేర్ అడిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలు చాలా మంది రెమ్యూనరేషన్‌కి బదులుగా సినిమాలో షేర్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.
పుష్ప 2 మూవీ రూ.1,500 కోట్లు వరకూ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. దాంతో మూడేళ్లు ఈ సినిమాకి సమయం కేటాయించిన అల్లు అర్జున్‌కి భారీగానే ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
దర్శకుడు సుకుమార్‌కి ఎంతంటే?
మూవీ దర్శకుడు సుకుమార్ కూడా రెమ్యూనరేషన్‌కి బదులుగా సినిమా ప్రాఫిట్స్‌లో 30% వాటా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత ఐదారేళ్లుగా పుష్ప ప్రాజెక్ట్‌పై ఉన్న సుకుమార్.. మరో సినిమా చేయలేదు. దాంతో ఈ లెక్కల మాస్టర్ లెక్క తప్పలేదు. అలానే ఇక మిగిలిన 30% ప్రొడ్యూసర్లకి వెళ్లనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి యలమంచిలి పుష్ప2 సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే.
రష్మికకి షేర్ లేదు.. కానీ?
పుష్ప 2లో చేసిన హీరోయిన్ రష్మిక మంధానకి ప్రాఫిట్స్‌లో షేర్ లేదుగానీ.. ఈ ముద్దుగుమ్మ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప-1 మూవీకి రూ.3 కోట్లు తీసుకున్న రష్మిక మంధాన.. పుష్ప 2కి మాత్రం రూ.11-12 కోట్లు తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. 2021లో వచ్చిన పుష్ప1తో నేషనల్ క్రష్‌గా మారిపోయిన రష్మిక.. ప్రస్తుతం సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతోంది. యూత్‌లో ఆమెకి ఉన్న క్రేజ్ దృష్ట్యా.. రెమ్యూనరేషన్‌ని కూడా భారీగా పెంచేసింది.