Kanguva Movie: కంగువాకి సూర్య రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా? బడ్జెట్‌లో 10%పైనే!
Suriya Remuneration For Kanguva: సూర్య నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం సూర్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
తమిళ్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా నవంబరు 14 (గురువారం)న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మరో మూడు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. దాదాపు.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో సూర్య సరసన దిశాపటాని నటించగా.. బాబీ డియోల్ విలన్‌గా నటించారు.
సూర్య రెమ్యూనరేషన్ ఎంతంటే?
కంగువా సినిమా కోసం హీరో సూర్యాకి రూ.39 కోట్ల వరకూ పారితోషికం ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అలానే హీరోయిన్ దిశాపటానికి రూ.3 కోట్లు ఇవ్వగా.. యానిమల్ సినిమాలో విలన్‌తో భారీగా క్రేజ్ పెంచుకున్న బాబీ డియోల్‌కి రూ.5 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కంగువా సినిమాకి శివ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ - స్టూడియో గ్రీన్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్నాటకలో గురువారం ఉదయం 4 గంటలకే కంగువా సినిమా షోలు పడనున్నాయి. కానీ.. తమిళనాడులో మాత్రం ఉదయం 9 గంటలకి ఫస్ట్ షో పడనుంది. వేకువజామున షోలకి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
పర్మీషన్ ఎందుకు ఇవ్వలేదంటే?
సాధారణంగా తమిళనాట పెద్ద హీరోల సినిమాలు మిడ్ నైట్ షో, మార్నింగ్ షోలు ప్రదర్శించేవారు. కానీ.. గత ఏడాది సంక్రాంతికి ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన గొడవతో జరిగిన ప్రమాదం కారణంగా వేకువజామున షోలను నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది.
తమిళనాట ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. తమిళనాడు ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి తీసుకొచ్చినా.. వేకువజామున షోలకి మాత్రం అనుమతి ఇవ్వడం లేదు.
వెయ్యేళ్ల నాటి కథ
కంగువా సినిమాలో సూర్య డ్యూయెల్ రోల్ చేశారు. ఇది వెయ్యేళ్ల కిందట కథ అని.. అప్పట్లో కంగువా ఇచ్చిన మాటని నేటి కాలానికి చెందిన ఫ్రాన్సిస్ (సూర్య) ఎలా నిలబెట్టుకున్నాడు? అనేది సినిమా కథ అని డైరెక్టర్ శివ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
దిశాపటాని ఏంజెలీనా అనే పాత్రలో కనిపిస్తుందని.. అలానే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని కూడా డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ఈ కంగువా సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందట.. బాహుబలి తరహాలో కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా కంగువా -1 ముగించినట్లు కూడా దర్శకుడు శివ వెల్లడించారు.