Bigg Boss Nagarjuna: వామ్మో...బిగ్‌బాస్‌లో నాగార్జున ధరించిన ఈ టీషర్ట్ ధర వింటే షాకవ్వాల్సిందే!
Bigg Boss Nagarjuna: బిగ్‌బాస్ సండే ఎపిసోడ్‌లో టీషర్ట్‌తో స్టైలిష్ లుక్‌లో నాగార్జున కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. రెడ్ అండ్ బ్లాక్ కలర్‌లో స్కల్ డిజైన్‌తో ఉన్న ఈ టీషర్ట్ ధర లక్ష ముప్పై రెండు వేల రూపాయలు కావడం గమనార్హం.
Bigg Boss Nagarjuna: బిగ్‌బాస్ తెలుగు గత ఐదు సీజన్స్ నుంచి నాగార్జున హోస్ట్‌గా కనిపిస్తోన్నారు. తన కామెడీ టైమింగ్, ముక్కుసూటితనం, మాటల గారడీతో షోను విజయవంతంగా ముందుకు నడిపిస్తోన్నాడు.
తెలుగులో బిగ్‌బాస్ షోకు క్రేజ్ రావడంలో నాగార్జున రోల్ ఎంతో ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 8 టీఆర్‌పీ రేటింగ్ పరంగా దూసుకుపోతోంది. తెలుగు టీవీ షోస్‌లో టాప్‌లో నిలుస్తోంది. బిగ్‌బాస్ చరిత్రలోనే లాంఛింగ్ ఎపిసోడ్ హయ్యెస్ట్ టీఆర్‌పీని దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.
ధర ఎంతంటే...
బిగ్‌బాస్ షోలో గత సండే ఎపిసోడ్‌లో నాగార్జున ధరించిన ఓ స్వెట్ షర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అలెగ్లాండర్ మెక్‌క్వీన్ బ్రాండ్‌కు చెందిన స్వెట్ షర్ట్ ధరించి గత సండే ఎపిసోడ్‌కు హాజరయ్యారు నాగార్జున. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ స్కల్ డిజైన్‌తో డిఫరెంట్‌గా ఉన్న టీ షర్ట్ ధర లక్ష ముప్పై రెండు వేల 96 రూపాయలు అంట.
ఈ బ్రాండ్ వెబ్‌సైట్‌లో ఈ టీషర్ట్ ధర చూసి నెటిజన్లు షాకవుతోన్నారు. నాగార్జున టీషర్ట్‌లో కనిపిస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. ఈ శనివారం(అక్టోబర్ 26) ఎపిసోడ్‌లో బ్లాక్ అండ్ వైట్ కాంబో కలర్ షర్ట్ ధరించి కనిపించారు. స్కాచ్ అండ్ సోడా బ్రాండ్‌కు చెందిన ఈ షర్ట్ ధర పదిహేడు వేలు అని సమాచారం.
కుబేర మూవీలో...
ప్రస్తుతం బిగ్‌బాస్ 8 తెలుగు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాలపై ఫోకస్ పెడుతోన్నాడు నాగార్జున. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న కుబేర మూవీలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నట్లు చెబుతోన్నారు. కుబేర మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
రజనీకాంత్‌తో కూలీ...
మరోవైపు కెరీర్‌లో ఫస్ట్ టైమ్ రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు నాగార్జున. రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో కూలీ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగార్జున ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోన్నాడు. కూలీ మూవీలో మాస్ క్యారెక్టర్‌లో నాగార్జున కనిపించనున్నట్లు చెబుతోన్నారు. కూలీ మూవీలో నాగార్జునతో పాటు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నటిస్తోన్నాడు.
సంక్రాంతికి హిట్...
మరోవైపు నా సామిరంగ తర్వాత హీరోగా నాగార్జున నెక్స్ట్ మూవీ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సంక్రాంతికి విడుదలైన నా సామిరంగ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మాస్ యాక్షన్ మూవీలో అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ మూవీతో విజయ్ బిన్నీ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
విజయ్ బిన్నీతో...
విజయ్ బిన్నీతోనే హీరోగా తన నెక్స్ట్ మూవీని నాగార్జున చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి గాడ్‌ఫాదర్ ఫేమ్ మోహన్‌రాజాతో నాగార్జున ఓ మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం ఉందని అంటోన్నారు.