Virat Kohli: ఈ సెలబ్రిటీలు హీరోలు, హీరోయిన్స్ పేర్లను ఫోన్‌లో ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసా? చరణ్, కోహ్లీ నేమ్స్ ఇవే!
How Celebrities Save Heroes And Heroines Names: ఇష్టమైన వాళ్ల పేర్లను ఫోన్‌లో తమకు నచ్చినట్లుగా నిక్ నేమ్స్, డిఫరెంట్‌గా సేవ్ చేసుకుంటారు. అలాగే, ఈ సెలబ్రిటీలు కూడా హీరోలు, హీరోయిన్స్ పేర్లను విభిన్నంగా సేవ్ చేసుకున్నారు. మరి వారెవరు, వారు ఎవరి పేరును ఎలా సేవ్ చేసుకున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
How Celebrities Save Heroes And Heroines Names: మనకు నచ్చినవాళ్ల పేర్లను మన ఫోన్‌లో ముద్దుపేర్లతో లేదా సెటైరికల్ నేమ్స్‌తో సేవ్ చేసుకుంటాం. అలాగే, మన ఫేవరేట్ హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు కూడా అలాగే తమకు నచ్చిన వ్యక్తుల పేర్లను అలాగే సేవ్ చేసుకుంటారు. అలా, హీరోలు, హీరోయిన్స్ పేర్లను తమ ఫోన్‌లలో డిఫరెంట్‌గా సేవ్ చేసుకున్న సెలబ్రిటీలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
సాయి పల్లవి
తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. లేడి పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే సాయి పల్లవి పేరును అమరన్ మూవీ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి హీరోయిన్ అని సేవ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని అమరన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్వయంగా తానే చెప్పారు రాజ్‌కుమార్ పెరియసామి.
అయితే, సాయి పల్లవికి 16 ఏళ్లు ఉన్నప్పుడే తనకు తెలుసు అని, డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు సాయి పల్లవిని తాను చూసినట్లు, అప్పుడే ఆమె మంచి హీరోయిన్ అవుతుందని, హీరోయిన్ అనే పేరుతో ఫోన్ నెంబర్ సేవ్ చేసుకున్నట్లు, తనకు నిక్ నేమ్స్‌తో పేర్లు పెట్టడం అలవాటు అని రాజ్ కుమార్ పెరియసామి వెల్లడించారు.
రామ్ చరణ్
నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య నటనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. పవన్ కల్యాణ్‌తో ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆయన స్పైడర్, మానాడు, మార్క్ ఆంటోనీ, సరిపోదా శనివారం సినిమాల్లో నటనతో ఇరగదీశాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీతో మరోసారి అలరించేందుకు రెడీగా ఉన్నాడు ఎస్‌జే సూర్య.
అయితే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరును ఎస్‌జే సూర్య తన ఫోన్‌లో 'ఆర్‌సీ ద కింగ్' అని సేవ్ చేసుకున్నాడట. ఇటీవల గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించిన ఓ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ఎస్‌జే సూర్యనే చెప్పారు. "రియల్ కింగ్ అండి ఆయన, చిరంజీవి కొడుకు రామ్ చరణ్ నిజమైన కింగ్ అండి, బిహేవియర్‌లో కింగ్, గుండెల్లో, ఆయన వాక్‌లో, స్టైల్‌లో అన్నింట్లో ఆయన కింగ్. అందుకే అలా సేవ్ చేసుకున్నా" అని ఎస్‌జే సూర్య తెలిపాడు.
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ
బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మకు హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉంది. ఇక అనుష్క శర్మ భర్త, ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పనక్కర్లేదు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరు పెళ్లికి ముందు ఒక యాడ్ షూట్‌లో కలిసి నటించారు.
ఈ యాడ్ షూట్‌తోనే అనుష్క-విరాట్ ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకున్నాక అనుష్క శర్మ పేరును తన ఫోన్‌లో 'ధర్మ పత్ని' అని విరాట్ కోహ్లీ సేవ్ చేసుకున్నాడట. ఇక విరాట్ కోహ్లీ పేరును 'పతి పరమేశ్వర్' అని అనుష్క శర్మ సేవ్ చేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.