నెలరోజులుగా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. సస్పెన్స్‌తో భయపెట్టేలా..-horror thriller web series khauf still trending on amazon prime video ott also streaming in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నెలరోజులుగా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. సస్పెన్స్‌తో భయపెట్టేలా..

నెలరోజులుగా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. సస్పెన్స్‌తో భయపెట్టేలా..

ఖౌఫ్ వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఇంకా టాప్-10లో ట్రెండ్ అవుతూనే ఉంది. మంచి వ్యూస్ సాధిస్తూ సత్తాచాటుతోంది.

ఓటీటీలో నెలరోజులుగా ట్రెండ్ అవుతున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. సస్పెన్స్‌తో భయపెట్టేలా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మోనికా పన్వర్, రజత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఖౌఫ్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో అంచనాలు బాగా ఏర్పడ్డాయి. స్ట్రీమింగ్‍కు వచ్చాక కూడా ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరీస్‍కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మంచి వ్యూస్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. ట్రెండింగ్‍లోనూ దుమ్మురేపుతోంది.

నెలరోజులుగా టాప్-10లోనే ట్రెండింగ్

ఖౌఫ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 18వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆరంభం నుంచే ఈ సిరీస్‍కు మంచి వ్యూస్ దక్కాయి. దీంతో ట్రెండింగ్‍లోకి దూసుకొచ్చింది. కొన్ని రోజులు టాాప్ ప్లేస్‍లో నిలిచింది. ఆ తర్వాత కిందికి వచ్చింది. మొత్తంగా నెలరోజులుగా టాప్-10లోనే ఖౌఫ్ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతోంది.

తెలుగులోనూ..

ఖౌఫ్ వెబ్ సిరీస్‍లో ఎనిమిది ఎపిసోడ్లు వచ్చాయి. ఐదు భాషల్లో ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ ఆకట్టుకునేలా ఉండడం, ఐదు భాషల్లో స్ట్రీమ్ అవుతుడటంతో మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ప్రస్తుతం (మే 19) ఖౌఫ్ సిరీస్ ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండింగ్‍లో ఆరో స్థానంలో ఉంది.

ఖౌఫ్ వెబ్ సిరీస్‍కు పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. భయపెట్టేలా, సస్పెన్స్ హారర్ ఎలిమెంట్లతో ఈ సిరీస్‍ను తెరకెక్కించారు. హాస్టల్ గదిలో ఓ అమ్మాయి ఎదుర్కొనే భయానక ఘటనలతో ఈ సిరీస్ సాగుతుంది. మోనికా పన్వర్, రజత్ కపూర్ యాక్టింగ్ ఈ సిరీస్‍కు మరో హైలైట్‍గా నిలిచింది.

ఖౌఫ్ స్టోరీలైన్

ఢిల్లీ శివారులోని ఓ హాస్టల్‍లో మాధురి (మోనిక పన్వర్) చేరుతుంది. 333 రూమ్‍లోకి వస్తుంది. తన సొంత ఊరు గ్వాలియర్‌లో ఎదురైన కష్టాల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఢిల్లీ వస్తుంది. కానీ బాధ వెంటాడుతుంది. ఆ రూమ్‍లో ఓ అమ్మాయి చనిపోయిందని, దెయ్యం ఉందని అక్కడి వారు మాధురిని భయపెడతారు. ఆ గదిలో దెయ్యం ఉందని మాధురికి అర్థమవుతుంది. ప్రమాదకరమైన హకీమ్ (రజత్ కపూర్) కంట మాధురి పడుతుంది. ఆ గదిలో మాధురి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది? హకీమ్ ఎవరు? అతడి వల్ల మాధురికి ఎదురైన చిక్కులు ఏంటి? సవాళ్ల నుంచి ఆమె బయపడిందా? అనేది ఖౌఫ్ సిరీస్‍లో ఉంటాయి.

ఖౌఫ్ వెబ్ సిరీస్‍ను సంజయ్ రౌట్రే, సరితా పాటిల్, విపిన్ అగ్నిహోత్రి ప్రొడ్యూజ్ చేశారు. ఈ సిరీస్‍లో మోనిక, రజత్‍తో పాటు అభిషేక్ చౌహాన్, గీతాంజలి కులకర్ణి, శిల్పా శుక్లా, చుమ్ దరంగ్, అషీమా వదాన్ కీలకపాత్రలు పోషించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం