తెలుగు సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రెండో సీజన్ కూడా వచ్చేస్తోంది.. అప్డేట్ ఇచ్చిన నవీన్ చంద్ర-horror thriller web series inspector rishi season 2 actor naveen chandra gives a key update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  తెలుగు సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రెండో సీజన్ కూడా వచ్చేస్తోంది.. అప్డేట్ ఇచ్చిన నవీన్ చంద్ర

తెలుగు సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రెండో సీజన్ కూడా వచ్చేస్తోంది.. అప్డేట్ ఇచ్చిన నవీన్ చంద్ర

Hari Prasad S HT Telugu

సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా రెడీ అవుతోంది. ఈ సిరీస్ లీడ్ రోల్ నవీన్ చంద్ర దీనికి సంబంధించి బుధవారం (జులై 30) కీలకమైన అప్డేట్ ఇచ్చాడు. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ కు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది.

తెలుగు సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రెండో సీజన్ కూడా వచ్చేస్తోంది.. అప్డేట్ ఇచ్చిన నవీన్ చంద్ర

తెలుగు, తమిళ నటుడు నవీన్ చంద్ర లీడ్ రోల్లో నటించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి (Inspector Rishi). గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఇప్పుడు రెండో సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్ ను నవీన్ చంద్ర ఇచ్చాడు.

ఇన్‌స్పెక్టర్ రిషి రెండో సీజన్

యాక్టర్ నవీన్ చంద్ర వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది కాలంగా అతడు నటించిన ఎన్నో సినిమాలు, సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఇప్పుడు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి రెండో సీజన్ పనులు కూడా మొదలైనట్లు అతడు వెల్లడించాడు. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ కు సంబంధించిన స్క్రిప్ట్ ఫొటోను నవీన్ చంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ కొత్త సీజన్ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్లు అది చూస్తే తెలుస్తోంది. నందని జేఎస్ ఈ సిరీస్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. గతేడాది తమిళం, తెలుగులో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండో సీజన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రైమ్ వీడియో రాబోయే రోజుల్లో వెల్లడించనుంది.

ఇన్‌స్పెక్టర్ రిషి తొలి సీజన్ ఇలా..

ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ తొలి సీజన్ గతేడాది మార్చిలో రిలీజైంది. మొత్తం 10 ఎపిసోడ్ల పాటు సాగింది. ఇందులో నవీన్ చంద్రతోపాటు సునైనా ఎల్లా, శ్రీకృష్ణ దయాల్, కన్నా రవి, మాలినీ జీవరత్నం, ఎలాంగో కుమారవేల్, అశ్వత్ చంద్రశేఖర్ తదితరులు నటించారు. ఇందులో టైటిల్ పాత్రలో నవీన్ చంద్ర కనిపించాడు.

తమిళనాడులో తైంకాడు అటవీ ప్రాంతంలో ఒకే తీరులో జరుగుతున్న వరుస హత్యల కేసును అతడు దర్యాప్తు చేస్తుంటాడు. వనరాచ్చి అనే వనదేవత ఆ హత్యలను చేస్తోందని అందరూ నమ్ముతుంటారు. కానీ ఈ హత్యలను మనుషులే చేశారని రిషి నమ్మకంగా ఉంటాడు. మరి ఈ హత్యలు ఎవరు, ఎందుకు చేస్తున్నారన్నదే ఈ సిరీస్ లో చూడొచ్చు. హారర్ థ్రిల్లర్ జానర్లో వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇప్పుడు రెండో సీజన్ సిద్ధమవుతుండటంతో ఈసారి ఎలాంటి కథతో మేకర్స్ రానున్నారన్న ఆసక్తి నెలకొంది. ఇన్‌స్పెక్టర్ రిషిగా నవీన్ చంద్ర తిరిగి రాబోతున్నాడు. తమిళంలో రూపొందినా తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ మేకర్స్ ఒకేసారి ఈ రెండో సీజన్ కూడా తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్న రోజుల్లో తెలియనుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం